Home / పవన్ టుడే / క‌రువు సీమ వెత‌లు చాటేందుకే అనంత‌లో హోదా స‌భ- జ‌న‌సేనాని

క‌రువు సీమ వెత‌లు చాటేందుకే అనంత‌లో హోదా స‌భ- జ‌న‌సేనాని

pressreleseఆంధ్రప్ర‌ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా సాధ‌న‌ పోరాటంలో భాగంగా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముచ్చ‌ట‌గా మూడో స‌భ‌ని అనంత‌పురం జిల్లాలో నిర్వ‌హించ‌నున్న‌ట్టు జ‌న‌సేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది.. న‌వంబ‌ర్ 10న స‌భ‌కు సంబంధించి ఇప్ప‌టికే పార్టీ నేత‌లు ఏర్పాట్ల‌లో నిమ‌జ్ఞ‌మ‌యిన‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఆవ‌శ్య‌క‌త ఏంటి..?  హోదా విష‌యంలో పాల‌కులు చేస్తున్న మోసం ఏంటి..?  అనే విష‌యాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచేందుకు నిర్ణ‌యించుకున్న జ‌న‌సేనాని., కాకినాడ స‌భ త‌ర్వాత ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వ‌చ్చింది..? అనంత జిల్లానే త‌దుప‌రి వేదిక‌గా ఎందుకు ఎంచుకోవాల్సి వ‌చ్చింది అనే అంశాల‌కు సంబంధించి స‌ద‌రు ప్ర‌క‌ట‌న ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు.. గ‌త నెల‌లో ఇండో-పాక్ బోర్డ‌ర్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌ధ్యంలో., తాను స‌భ‌లు నిర్వ‌హించ‌డం స‌రికాద‌ని భావించిన‌ట్టు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.. స‌రిహ‌ద్దుల్లో ఓ వైపు పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల్ని అంత‌మొందించేందుకు ఆర్మీ ప్రాణాల‌కు తెగించి మ‌రీ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ నిర్వహిస్తుంటే., తన హ‌డావిడి తాను అన్న‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌ని భావించిన‌ట్టు స్ప‌ష్టం చేశారు.. అందువ‌ల్లే అక్టోబ‌ర్ మొద‌టి వారంలో నిర్వ‌హించాల్సిన స‌భ‌ను న‌వంబ‌ర్‌కి వాయిదా వేసిన‌ట్టు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు..

ఇక అనంత‌పురం జిల్లాని స‌భ‌కి ఎంచుకోవ‌డానికి ప్ర‌ధాన‌కార‌ణం.. అక్క‌డ ఉన్న క‌రువు ప‌రిస్థితులు.. సీమ మొత్తం క‌రువు కోర‌ల్లో కూరుకుని ఉన్నా., అనంత జిల్లా ప‌రిస్థితి మ‌రీ దారుణం.. వ‌రుణుడు క‌రుణిస్తేనే అక్క‌డ పంట‌లు పండుతాయి.. ఆ వ‌రుణుడు క‌రుణించే దాఖ‌లాలు కూడా చాలా అరుదు.. దీంతో పాటు చేనేత‌ల అవ‌స్థ‌లు, ఆత్మ‌హ‌త్య‌ల వంటివి హోదా అవ‌స‌రాన్ని చాటి చెప్పేవిగా ఉన్నాయి.. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ల‌భిస్తే., త‌ద్వారా ల‌భించే నిధుల ద్వారా., క‌రువు ర‌క్క‌సి భారి నుంచి ఈ ప్రాంతం బ‌య‌ట‌ప‌డుతుంద‌న్న‌ది జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమ‌తం.. అందుకే ఆ ప్రాంతంలో హోదా స‌భ పెట్ట‌డం ద్వారా కేంద్రానికి దాని ఆవ‌శ్య‌క‌త తెలియ‌జెప్పాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.. విభ‌జ‌న హామీ మేర‌కు ఏపీకి హోదా ఇచ్చే వ‌ర‌కు పోరాటం ఆపే ప్ర‌స‌క్తే లేద‌ని అంటున్న ప‌వ‌న్‌., ఈ విష‌యంలో ఎంత వ‌ర‌కు వెళ్లేందుకైనా సిద్దంగా ఉన్న‌ట్టు హెచ్చిరిస్తున్నారు.. త‌మ స‌హ‌నాన్ని ప‌రీక్షించ వ‌ద్ద‌ని మ‌రోసారి వార్నింగ్ ఇచ్చారు.. ఇక మీద‌ట‌., ప్ర‌తి జిల్లాలో ప‌ర్య‌టించి అక్క‌డ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం, ప‌రిష్కారానికి త‌న‌వంతు కృషి చేయ‌డంతో పాటు., హోదా ఉద్య‌మాన్ని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని కూడా జ‌న‌సేనాని భావిస్తున్నారు.. అటు త‌మ సేనాని చేస్తున్న పోరాటంలో క‌లిసి అడుగులు వేసేందుకు సైన్యం కూడా స‌మాయ‌త్త‌మ‌వుతోంది..


 

Share This:

1,863 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen − 16 =