Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / క‌లంతో ”కులం” ఇంకు జ‌ల్లే ప్ర‌య‌త్నాలు షురూ..

క‌లంతో ”కులం” ఇంకు జ‌ల్లే ప్ర‌య‌త్నాలు షురూ..

pspk

జ‌న‌సేనాని ప‌వ‌న్ వ‌చ్చేస్తున్నాడా.. ఆంజ‌నేయుడంత శ‌క్తి ఉన్న అత‌న్ని ఆప‌డం ఎలా..? వ‌్య‌క్తిగ‌త జీవితంపై విమ‌ర్శ‌లు చేస్తే., ఈ ఉమ్మి తిరిగి త‌మ‌పైనే ప‌డుతుంది.. జ‌నం దాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో లేరు కాబ‌ట్టి..! మ‌రి ఏం చేయాలి.. ఏం చేస్తే ప‌వ‌న్‌ని ఆయ‌న పార్టీని నిలువ‌రించొచ్చు.. కుటిల రాజ‌కీయ శ‌క్తుల చూపంతా ప్ర‌స్తుతం ఇదే ప‌నిలో ఉన్నాయి.. కుల గోల రాజేస్తే.. ఆంజ‌నేయుడంత శ‌క్తి ఉన్న జ‌న‌సేనానిని నిలువ‌రించ గ‌లిగిన బ్ర‌హ్మాస్త్రం అదొక్క‌టే.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని ఓ కులానికి చెందిన వాడిగా ముద్ర వేసేస్తే., కొంత‌లో కొంత‌యినా ల‌బ్ది చేకూరుతుంది.. కుట్ర‌లు, కుతంత్రాల‌కు నెల‌వైన పొలిటిక‌ల్ శ‌క్తులు., ఈ మంత్రాన్ని అమ‌ల్లో పెట్టేశాయి కూడా.. ఆయ‌న ప్ర‌తి అడుగుకి కులం అనే మ‌కిలిని అంటించ‌డం ద్వారా., ఓ కులానికి చెందిన వ్య‌క్తిగా ముద్ర వేయ‌డం ద్వారా., ఆయ‌న‌కి అండ‌గా ఉన్న అభిమానుల్ని దూరం చేయాల‌న్న‌ది వారి కుటిల యుక్తి.. ఆయ‌న ఏపీలో అడుగు పెడితే కులం కోస‌మేన‌ని., ఏదైనా స‌మ‌స్య‌పై పోరాడినా కులం కోస‌మేన‌ని., ఇంకా మాట్లాడితే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలంటున్న‌ది కూడా కులం కోస‌మేన‌ని ప్ర‌చారం చేసేలా ఉన్నారు..

వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ కులానికీ బ్రాండ్ అంబాసిడ‌ర్ కాదు, ఏ మ‌తానికీ ప్ర‌మోట‌ర్ కాదు.. ఆయ‌న ఓ లీడ‌ర్, అంత‌కంటే ముందు ఓ భార‌తీయుడు.. అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లే కాదు భార‌తీయులంతా జ‌న‌సేనానికి స‌మాన‌మే.. ఒక‌ర్ని కౌగిలించుకుని., ఒక‌ర్ని కింద కూర్చొబెట్ట‌డం ప‌వ‌న్‌కి చేత‌కాదు.. త‌న ద‌గ్గ‌ర‌కి స‌మ‌స్య‌తో వ‌చ్చినా, సానుభూతితో వ‌చ్చినా కుల‌,మ‌తాల‌కు అతీతంగా స‌మ దృష్టితో చేర‌దీయ గ‌ల‌గ‌డం ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైన ప‌ని..

మీ పార్టీల్లో లాగా., జ‌న‌సేన‌లో ఏ కులానికి ప్రాధాన్య‌త ఉండ‌దు.. అధికారం లేక‌పోయినా., అయిన వారిని అంద‌లం ఎక్కించే ప‌ద్ద‌తి అంత‌కంటే ఉండ‌దు.. అంతా మీ లాగే ఉంటార‌నుకోడం స‌రికాదు క‌ధా.. ఇలాంటి ఛీప్ పాలిట్రిక్స్ మానండి ప్లీజ్‌..

ఈ క‌థ‌నం మ‌న సైట్‌లో ఇంత అర్జెంటుగా ప్ర‌చురించ‌డానికి కార‌ణం.. ఓ మీడియాలో ఓ వార్త న‌న్ను క‌దిలించ‌డ‌మే. కుల ప్ర‌స‌క్తి సంబంధించిన వార్త‌లు మ‌న‌కి వ్య‌తిరేక‌మే ఆయినా., ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో ఇల్లు చూడ‌మ‌న్న విష‌యానికి కూడా కులం తొడుగు తొడిగారు.. ప్లీజ్ క‌లాన్ని అడ్డుపెట్టుకుని కుల‌మ‌తాల‌కు అతీతుడైన మా జ‌న‌సేనానిపై కులం ఇంకు చ‌ల్ల‌కండి.. అలా చేస్తే ఆయ‌న వెనుక ఉన్న జ‌నం మిమ్మ‌ల్ని వ‌దిలిపెట్ట‌రు… ధైర్యం ఉంటే ఎదురు నిల‌బ‌డండి.. గెలిచి మాకూ చావ ఉంద‌ని చాటుకోండి..

Share This:

1,366 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − six =