Home / పవన్ టుడే / క‌ల‌సి పోరాడుదాం.. జ‌న‌సేనానికి వామ‌ప‌క్షాల స్నేహ‌హ‌స్తం..

క‌ల‌సి పోరాడుదాం.. జ‌న‌సేనానికి వామ‌ప‌క్షాల స్నేహ‌హ‌స్తం..

img-20161201-wa0061

ప‌ద‌వులు ఉన్నా లేకున్నా., ఎన్నిక‌ల్లో గెలిచినా గెల‌వ‌కున్నా.. నిత్యం ప్ర‌జ‌ల త‌రుపున పోరాడ‌టం., వారికి అండ‌గా నిల‌బ‌డ‌టం ఇదే వారి సిద్ధాంతం.. అందుకే వారికంటూ ఓ ప్ర‌త్యేక ఓటు బ్యాంకు ఉంటుంది.. ఎన్నిక‌ల స‌మ‌యంలో వారు ఎవ‌రి వైపు నిల‌బ‌డితే., వారి గెలుపు అవ‌కాశాలు మెరుగుప‌డిన‌ట్టే., వారే క‌మ్యునిస్టులు(వామ‌ప‌క్షాలు).. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు తాము న‌మ్మిన సిద్ధాంతానికే నిల‌బ‌డిన వీరు ., ప్ర‌తి ఎన్నిక‌ల్లో ఓ పార్టీకి కొమ్ముకాయ‌డం., హామీల విష‌యంలో త‌ర్వాత గొడ‌వ ప‌డ‌డం వీనికి అల‌వాటు.. ఇప్పుడు ఈ వామ‌ప‌క్షాలు జ‌న‌సేనకు స్నేహ‌హ‌స్తం అందించేందుకు రెడీ అయ్యాయి.. సిద్ధాంతాల విష‌యంలో సారుప్య‌త‌., పాల‌కులపై పోరాడే తీరు ప‌వ‌న్‌కి ఎర్ర‌దండుని ద‌గ్గ‌ర చేర్చాయి.. ప్ర‌త్యేక హోదా కోసం జ‌న‌సేనాని చేస్తున్న పోరాటానికి ఇప్ప‌టికే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన క‌మ్యూనిస్టులు., ఆయ‌న‌తో క‌లిసి ముందుకు న‌డిచేందుకు ముందుకు వ‌చ్చాయి.. ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ., టీడీపీ ప్ర‌భుత్వాలు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డం., విభ‌జ‌న హామీల అమ‌లు త‌దిత‌ర అంశాల‌పై క‌లిసి పోరాటం చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి..

ఈ మేర‌కు గురువారం జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సిపిఐ ఏపీ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌, ఏఐటియుసీ ఏపీ కౌన్సిల్ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌రావు భేటీ అయ్యారు.. ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు.. ముఖ్యంగా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా., భూసేక‌ర‌ణ కార‌ణంగా ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు త‌దిత‌ర అంశాల‌పై ప‌ర‌స్స‌రం మాట‌లు పంచుకున్నారు.. చ‌ట్ట‌బ‌ద్ద‌త లేకుండా ప్యాకేజీని ఆహ్వానించి టీడీపీ స‌ర్కారు ప్ర‌జ‌ల్ని మోసం చేసింద‌ని., రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం క‌ల‌సి ప‌నిచేసేందుకు సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు భేటీ అనంత‌రం ఇరువ‌ర్గాలు వెల్ల‌డించాయి..

బీజేపీతో దోస్తీ సంగ‌తి ప‌క్క‌న పెడితే., గ‌తంలో వామ‌ప‌క్షాల అండ టీడీపీకి భాగానే క‌లిసొచ్చింద‌నే చెప్పాలి.. వీరు ఎవ‌రికి అండ‌గా ఉంటే వారికి సుమారు ఐదు నుంచి ఏడు శాతంగా ఉన్న వీరి ఓటు బ్యాంకు వారి జేబులో ప‌డిన‌ట్టే.. ఇప్పుడు ఇప్ప‌టికే జ‌న‌సేనానికి భ‌యంక‌రంగా పెరుగుతున్న ఓటు బ్యాంకుకి వామ‌ప‌క్షాలు కూడా జ‌త క‌ట్టాయి.. ఇప్పుడు సిపిఐ, రేపు సిపిఎం., ఎల్లుండి లోక్‌స‌త్తా ఇలా ఒక్కొక్క‌రు సేన‌తో జ‌త క‌డితే., ఇప్పుడు నాలుగు శాతం, ఐదు శాతం మాత్ర‌మే సేన‌కు మ‌ద్ద‌తంటూ ప్ర‌చారం చేస్తున్న బూట‌క‌పు స‌ర్వేలు ఏమైపోతాయో ఏమో..

Share This:

About Syamkumar Lebaka

Check Also

గెరుడౌ ఉక్కు క‌ర్మాగార మృతుల కుటుంబాల‌కి న్యాయం చేయాలి.. జ‌న‌సేనాని డిమాండ్‌..

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రికి స‌మీపంలోని గెరుడౌ ఉక్కు ప‌రిశ్ర‌మ‌లో విష‌వాయువులు వెలివ‌డి ఆరుగురు కార్మికులు మృతి చెందిన ఘ‌ట‌న‌పై జ‌న‌సేన …

One comment

  1. Kotha taram raajakeeyalaku maro adugu. Nijayathi gala vallu kalsitey prajalaku emi cheyavocho veella kalayika dwara cheppavachu.Good sign.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 + 19 =

%d bloggers like this: