Home / జన సేన / క‌వాతులో క‌త్తులు నూరిన జ‌న‌సేనుడు.. జ‌న‌సేనతో ప్ర‌జాప్ర‌భుత్వం రావాల‌ని ఆకాంక్ష‌..

క‌వాతులో క‌త్తులు నూరిన జ‌న‌సేనుడు.. జ‌న‌సేనతో ప్ర‌జాప్ర‌భుత్వం రావాల‌ని ఆకాంక్ష‌..

ఉత్త‌రాంధ్ర పోరాట యాత్ర ముగింపు సంద‌ర్బంగా విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన జ‌న‌సేన నిర‌స‌న క‌వాతు స‌క్సెస్ అయ్యంది.. జ‌న‌సేనుడు అస్త్ర‌శ‌స్త్రాల‌న్ని బ‌య‌ట‌కు తీసి అధికార‌-విప‌క్షాల‌పై ఘాటుగా విసిరారు.. రైల్వే జోన్ ద‌గ్గ‌ర మొద‌లుపెట్టి, ఏ పార్టీ ద‌మ్ము ఎంతో జ‌నం ముందు ఉంచారు.. రైల్వే జోన్ సాధ‌న‌కు న‌లుగురు మ‌నుషులు చాల‌న్న జ‌న‌సేన అధినేత‌., లోకేష్‌, చంద్ర‌బాబు, జ‌గ‌న్‌లు రైల్వే ట్రాక్ మీద యుద్ధానికి ముందుకి రావాలంటూ మ‌రోసారి స‌వాలు విసిరారు.. మీ ముగ్గురూ ముందుకి వ‌స్తే, మీ వెంట న‌డిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ పిలుపునిచ్చారు.. రైల్వే జోన్ ఎందుకు రాదో చూద్దామ‌న్నారు.. శ్రీకాకుళం రైల్వే స్టేష‌న్ కోసం ఏ ఒక్క నాయ‌కుడు క‌నీసం ప్ర‌తిపాధ‌న చేయ‌ని విష‌యాన్ని ఎత్తిచూపారు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల టీడీపీ నేత‌ల‌కి ఉన్న నిబ‌ద్ద‌త‌ని ప్ర‌శ్నించారు..

ఉత్త‌రాంధ్ర‌లో ఏ మూల‌కి వెళ్లినా స‌మ‌స్య‌లేన‌న్న ఆయ‌న‌., ఆ స‌మ‌స్య‌ల గురించి నిల‌దీస్తే., ముఖ్య‌మంత్రిగారు, ఆయ‌న త‌న‌యుడు ఎక్క‌డున్నాయ‌ని ఎదురు ప్ర‌శ్నించే ప‌రిస్థితులు ఉన్నాయ‌న్నారు.. వారు చేసిన అభివృద్ది ఏంటో వాళ్ల‌బ్బాయి లోకేష్‌తో ఉత్త‌రాంధ్రలో సైకిల్ యాత్ర చేయిస్తే తెలుస్తుంద‌న్నారు.. ఒక్కసారి అర‌కులో తాను వెళ్లిన మారుమూల గ్రామాలకు వెళ్లి అభివృద్ది గురించా మాట్లాడాల‌ని డిమాండ్ చేశారు.. విదేశీయుల్ని బీచ్ రోడ్డులో తిప్పి అంతా ఇలాగే ఉంటుంద‌ని చెబితే ఎలా., ఓ సారి కోట వీధిలోకి వ‌స్తే జ‌నం ప‌డుతున్న క‌ష్టాలేంటో తెలుస్తాయంటూ విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.. ఉత్త‌రాంధ్ర‌ను ఓ డంప్ యార్డ్‌గా మారుస్తున్నారని జ‌న‌సేనాని మండిప‌డ్డారు..

పాల‌కులు చేసిన పాపాలే రాష్ట్ర విభ‌జ‌న‌కి దారితీశాయ‌ని, సామాన్యుడిని క‌ష్టాల క‌డ‌లిలో ముంచేశాయ‌ని ఆరోపించారు..యాభై ఏళ్లు కాంగ్రెస్‌, 16 ఏళ్లు టీడీపీ ఉమ్మ‌డి రాష్ట్రాన్ని పాలించాయ‌న్న ప‌వ‌న్‌, అందులో వైఎస్‌, చంద్ర‌బాబుల పాల‌న‌లు కూడా ఉన్నాయ‌న్నారు..నాయ‌కులు తీసుకున్న నిర్ణ‌యాలు త‌ప్పులే విభ‌జ‌న‌కి దారితీశాయ‌ని ఆరోపించారు.. విభ‌జ‌న అనంత‌రం ఆంధ్రాలో వివ‌క్ష‌తో కూడిన పాల‌న కొన‌సాగుతోందంటూ మండిప‌డ్డారు,, ఉత్తరాంధ్ర, రాయలసీమలో వెనకబాటుతనం, అభివృద్ధిలో వివక్ష, ఇతర ప్రాంతాల్లో ఉన్న వివక్షలు పోవాలన్న ఆయ‌న‌., అవన్నీ పోగొడతామ‌ని క‌వాతుకి త‌ర‌లివ‌చ్చిన ఆశేష జ‌న‌వాహిని సాక్షిగా మాటిచ్చారు.. విశాఖ ఎన్నికల సభలో కూడా వైసిపి వస్తే ఇక్కడ ఫ్యాక్షన్ వస్తుంది, భూములు లాగేసుకుంటారు అని చంద్రబాబు గారు చెప్పారు. ఎన్నికల తరవాత తెలిసింది…. భూ దోపిడీలో వైసిపికి, టిడిపికి తేడా ఏమీ లేదు.. ఉన్న తేడా ఒక్క‌టే వైసిపివాళ్ళు దౌర్జన్యంగా లాక్కొంటే, టిడిపి వాళ్ళు లీగల్ గా లాక్కొంటారంటూ ఎద్దేవా చేశారు..

తాను రాజ‌కీయాల్లోకి రావ‌డానికి దారితీసిన ప‌రిస్థితుల్ని వివ‌రిస్తూ.. త‌న‌కు అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. చూడటానికి వచ్చిన ఓ ఐ.పీ.ఎస్. అధికారి నీ మీద‌, కుటుంబం మీద‌, అన్న‌య్య‌గారి మీద దాడులు జ‌ర‌గొచ్చ‌ని హెచ్చ‌రించిన విష‌యాన్ని గుర్తుచేశారు.. కేసులు పెట్టి కుట్ర చేస్తార‌ని చెప్పార‌న్నారు.. ఎందుకు అంటే చిరంజీవిగారు రాజ‌కీయాల్లోకి వ‌స్తారంట క‌దా, అందుకే అందుకే అని చెప్పారు.. చిరంజీవి వ‌స్తే, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌స్తే భ‌యం.. కార‌ణం తాము ధ‌ర్మాన్ని నిల‌బెడ‌తాం, ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డ‌తాం.. అదే భ‌యంతో వ్య‌క్తిగ‌త దాడుల‌కి సైతం ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు చెప్పారు.. ప్రాణం పోయినా తాను ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌నని అన్యాయంపై తిర‌గ‌బ‌డ‌తాన‌ని జ‌న‌సేనాని హెచ్చ‌రించారు..
2014 లో టిడిపికి అండగా నిలిచి గెలిపిస్తే – నా తల్లిని దుర్భాషలాడించారు. ఎవరూ అనకూడని మాటతో తిట్టించారు. ఆరు నెలలపాటు నా వ్యక్తిత్వ హననానికి ఒడిగట్టారని ఆరోపించారు.. ఈ టిడిపి వాళ్ళని మళ్ళీ గెలిపిస్తే మన అమ్మల్నీ, అక్కల్నీ దుర్భాషలాడించరా? టిడిపిని నిలువరిద్దాం..నిర్మూలిద్దామంటూ పిలుపునిచ్చారు.. లోకేష్ అంటున్నారు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. ఇంజినీర్ కొడుకు ఇంజినీర్ అవుతాడు అని. సీఎం కొడుకు సీఎం అయి మమ్మల్ని తొక్కాలా? అంటూ నిల‌దీశారు.. చంద్ర‌బాబు 2050 విజ‌న్ లోకేష్‌ని సిఎంని చేయ‌డ‌మేన‌ని విమ‌ర్శించారు..
చంద్రబాబుకి జగన్ అంటే భయమ‌ని, త‌న‌తోనే ఆ విష‌యాన్ని చెప్పిన‌ట్టు ప‌వ‌న్ తెలిపారు..వైఎస్ పాలనలో చంద్రబాబు కి జెడ్ కేటగిరీ రక్షణ తీయించేశారు. మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి పెట్టించుకున్నారు. ఒకవేళ జగన్ వస్తే ఏం చేస్తారోన‌ని బాబు భ‌య‌ప‌డిన‌ట్టు తెలిపారు.. ఎన్నికల తరవాత ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఓడినా అండ‌గా ఉండాల‌ని కోరిన‌ట్టు వివ‌రించారు.. గెలిచాక ప్రమాణ స్వీకారానికి పిలిచారు. ఆ తరవాత మనం ఆయనకీ గుర్తుకులేం. రాజధానికి 800 ఎకరాల భూమి చాలు అన్నారు. అదికాస్తా 1 .5 లక్షల ఎకరాలు అయ్యిందంటూ మండిప‌డ్డారు.. రాజధాని ప్రాంతంలో కొన్ని ఊళ్ళ రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకోలేదన్న ప‌వ‌న్‌., . రాజధానికి స‌రిప‌డ భూమి ఉన్న‌ప్పుడు వారిపై భూ సేకరణ చట్టాన్ని ఎలా ప్ర‌యోగిస్తారంటూ ధ్వ‌జ‌మెత్తారు.. అలా చేస్తే ఎదురుతిరుగుతా అని ముఖ్యమంత్రిని హెచ్చ‌రిస్తే., కొన్నాళ్లు కామ్‌గా ఉండి మ‌ళ్లీ మొదలుపెట్టేశార‌ని ఆరోపించారు..

ప్రత్యేక హోదా విషయంలో నేను మొదటి నుంచి ఒకే మాట మీద ఉన్నాన‌న్న జ‌న‌సేనాని.,. ప్యాకేజి పాచిపోయిన లడ్డూలు అంటే బిజెపి హరిబాబు, ఇతర పెద్దలు, టిడిపివాళ్ళు త‌న‌ను తిట్టార‌న్నారు.. అప్పుడు ప్యాకేజీని తిరుప‌తి ల‌డ్డూల‌న్న సిఎం ఇవాళ మాట‌మార్చార‌ని ఆరోపించారు..నవనిర్మాణ దీక్షలంటూ రూ.80 కోట్లు ఖర్చు చేశారు. ఆ మొత్తంతో ఉత్తరాంధ్రలో వంతెనలు, ఇతర అభివృద్ధి పనులు చేయవచ్చు కదా? అంటూ నిల‌దీశారు.. రైల్వే జోన్ టాపిక్ వ‌చ్చిన‌ప్పుడు టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, మురళీమోహన్ జోన్ లేదు గీను లేదు అనీ, వెయిట్ లాస్ దీక్షలు అని వెటకారాలు ఆడుకున్న విష‌యాన్ని గుర్తు చేశారు.. ప‌చ్చ చొక్కాలు ఆడేవన్నీ డ్రామాలు. నిజంగా, చిత్తశుద్ధి ఉంటే అందరూ అక్కర్లేదు… నలుగురం చాలు. లోకేష్ ముందు ఉండి నడిస్తే వెనక సీఎం, జగన్, నేను వెళ్తాం. రైల్ పట్టాలపై కూర్చొని రైళ్లు నిలుపుదాం ర‌మ్మంటూ స‌వాలు విసిరారు.. ఉత్తరాంధ్రలో 16 నదులున్నాయి. 28 లక్షల ఎకరాల సాగుకి వీలయ్యే భూమి ఉంది. కానీ 6 లక్షల ఎకరాలకు మాత్ర‌మే సాగు నీరు ఇచ్చే ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది పాలకుల నిర్లక్ష్యం కాదా అంటూ నిల‌దీశారు.. టిడిపి ప్రభుత్వం వచ్చాకా ఒక్క విజయనగరం జిల్లా నుంచే 43 ,200 మంది వలస పోయిన‌ట్టు వెల్ల‌డించారు… బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు.. ఆ జాబు వారి త‌న‌యుడికి అని ఎవ్వ‌రూ ఊహించ‌లేద‌ని ఎద్దేవా చేశారు..

Advertisement..

భూ సేక‌ర‌ణ‌పై దుమ్మెత్తిపోసిన ప‌వ‌న్‌, ముఖ్య‌మంత్రి భూదాహానికి అద్దూ అదుపూలేకుండా పోతోంద‌ని మండిప‌డ్డారు.. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ల‌క్ష ఎక‌రాలు దోచేశార‌ని ఆరోపించారు..విశాఖ ప‌బ్లిక్ గ్రంధాల‌యాన్ని మంత్రి గంజా క‌బ్జా చేశార‌న్నారు.. పెందుర్తి ఎమ్మెల్యేకి కౌంట‌ర్లు సూటిగానే విసిరారు.. భూ దోపిడికి వ్య‌తిరేకంగా మాట్లాడితే అభివృద్ది నిరోధ‌కుల‌న్న ముద్ర వేస్తున్నార‌న్నారు.. అభివృద్దికి మాత్రం తామెప్పుడూ వ్య‌తిరేకం కాద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు..

జ‌న‌సేన అధినేత స్పీచ్ ఆధ్యంతం ప్ర‌జ‌ల జ‌య‌జ‌య‌ధ్వానాల మ‌ధ్య సాగింది.. జ‌న‌సైన్య‌పు హోరు ముందు స‌ముద్ర‌పు హోరు చిన్న‌బోయింది.. ఓవ‌రాల్‌గా క‌వాతు సూప‌ర్ స‌క్సెస్ రేటింగ్ సాధించింది..

Share This:

1,636 views

About Syamkumar Lebaka

Check Also

పెనుగొండ‌ని శ్రీ వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ‌గా మారుస్తాం-జ‌న‌సేనాని..

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పెనుగొండ ఊరి పేరును ‘శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ’గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − 1 =