Home / ఎడిటోరియల్స్ / క‌ష్ట‌ప‌డినోడికి క‌ష్ట‌ప‌డినంత.. నిస్వార్ధ సేవ‌కి గుర్తింపు ద‌క్కే ఏకైక పార్టీ జ‌న‌సేన‌.. గుర్తించే నాయ‌కుడు జ‌న‌సేనుడు..

క‌ష్ట‌ప‌డినోడికి క‌ష్ట‌ప‌డినంత.. నిస్వార్ధ సేవ‌కి గుర్తింపు ద‌క్కే ఏకైక పార్టీ జ‌న‌సేన‌.. గుర్తించే నాయ‌కుడు జ‌న‌సేనుడు..

ఏడు ప‌దుల స్వ‌తంత్ర భార‌తావ‌నిలో., ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడు చెప్పేమాట‌.. క‌ష్ట‌ప‌డే కార్య‌క‌ర్త‌ల్ని గుర్తిస్తాం.. అవును అప్ప‌టి నుంచి గుర్తిస్తూనే ఉన్నారు.. కార్య‌క‌ర్త‌ని కార్య‌క‌ర్త‌గా.. నాయ‌కుడ్ని నాయ‌కుడిగా., అప్ప‌టి నుంచి కార్య‌క‌ర్త కార్య‌క‌ర్త‌గానే మిగిలిపోయాడు., నాయ‌కుడు నాయ‌కుడిగానే ఉన్నాడు.. తొలిసారి లీడ‌ర్‌., కార్య‌క‌ర్త‌లో నాయ‌కుడ్ని చూస్తున్నాడు.. కాదు కష్ట‌ప‌డే కార్య‌క‌ర్త‌ని అంద‌లం ఎక్కిస్తున్నాడు.. భార‌త దేశ రాజ‌కీయాల్లో అది సాధ్య‌మా..? అనే ఆలోచిస్తున్నారా.. జ‌న‌సేన‌తో అది సాధ్య‌మేన‌ని చెప్పేందుకు నిలువెత్తు రుజువులు నిత్యం ద‌ర్శ‌న‌మిస్తూనే ఉన్నాయి..

ఓ పార్టీ కోసం అహ‌ర్నిస‌లు క‌ష్ట‌ప‌డే ఓ కార్య‌క‌ర్త‌., గోడ‌లపై పార్టీ సిద్ధాంతాలు వ‌ల్లె వేసే ఓ కింది స్థాయి కార్య‌క‌ర్త‌.. ఆ పార్టీ అధినేత వ‌ద్ద‌కి చేరడం సాధ్య‌మా..? చేర‌డ‌మే కాదు.. ఆ పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వానికి., పార్టీ అధినేత ముఖ్య అతిధిగా ఆహ్వానించ‌డం సాధ్య‌మా..? నిత్యం ప్ర‌జా సేవే ప‌ర‌మావ‌ధిగా ముందుకి వెళ్తున్న జ‌న‌సేన పార్టీలో ఆ అసాధ్యం.. సుసాధ్యంగా ఆవిష్కృత‌మ‌య్యింది.. కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా ఉన్న ఆ నాయ‌కుడు., ఈ కింది స్థాయి కార్య‌క‌ర్త‌ని పిలిచి మ‌రీ ఆలింగ‌నం చేసుకున్నాడు.. అత‌ని కృషిని గుర్తించి., కీర్తించాడు.. ఇదే మ‌న ఆఫీస్ దీని ప్రారంభోత్స‌వానికి నువ్వే ముఖ్య అతిధి వంటూ., త‌న‌కంటే ముందు వ‌రుస‌లో నిల్చోబెట్టాడు..

నిమ్మ‌ల వీర‌న్న‌.. గోడ‌ల‌పై అక్ష‌రాలు చెక్కే ఓ పెయింట‌ర్‌.. అంతకు మించి సామాజిక‌స్పృహ క‌లిగిన‌., నిబ‌ద్ద‌త‌తో కూడిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమాని.. జ‌న‌సేన ఆవిర్భావం త‌ర్వాత‌., జ‌న‌సేనాని స్ఫూర్తితో ఆయ‌న భావాల‌ను జ‌నం ముందు ఉంచాల‌నే ల‌క్ష్యంతో., ఖాళీగా క‌న‌బ‌డిన ప్ర‌తి గోడ‌ని పోస్ట‌ర్‌గా మ‌లిచేశాడు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి నాయ‌క‌త్వాన్ని ఎందుకు బ‌ల‌ప‌ర్చాలో తెలియ‌చెబుతూ., గోడ‌ల్ని నింపేశాడు.. ఆయ‌న ప్ర‌త్యేక హోదా అంటే ప్ర‌త్యేక హోదా.. ఆయ‌న రాజ‌ధాని భూములు అంటే., రాజ‌ధాని భూములు.. ఇలా.. ప్ర‌తి అడుగును దాని వెనుక ఉన్న ల‌క్ష్యాన్ని ప్ర‌జ‌ల ముందు పెట్టే క్ర‌మంలో త‌న‌వంతు చ‌మ‌టోడ్చాడు.. ఆ క్ర‌మంలో త‌న ఒంటిపై పోలీసు లాఠీలు నాట్య‌మాడినా చ‌లించ‌లేదు.. ఎన్నో బెధిరింపులు., హెచ్చ‌రిక‌లు.. డోంట్ కేర్ అంటూ ముంద‌డుగు వేశాడు.. ఓ కార్య‌క‌ర్త‌గా త‌న ప‌ని తాను చేస్తున్నాను అని భావించ‌డం మిన‌హా., ఎలాంటి ప్ర‌తిఫ‌లం ఆశించ‌లేదు..

అలాంటి ఓ చిట్ట‌చివ‌రి స్థాయి కార్య‌క‌ర్త‌ని జ‌న‌సేనుడు గుర్తించారు.. వీర‌న్నా నా కోసం క‌ష్ట‌ప‌డుతున్న నీతో ఓ సెల్ఫీ దిగుతా ర‌మ్మ‌న్నారు.. సెల్ఫీ దిగ‌డ‌మే కాదు.. పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వానికి నువ్వే ముఖ్య అతిధివ‌న్నారు.. 12 ఏళ్ల నాడు క‌లుసుకున్న అత‌న్ని గుర్తించారు.. నిమ్మ‌ల వీర‌న్న అనే ఈ కార్య‌క‌ర్త‌ని తాను ఎందుకు గుర్తించానో చెబుతూ., త‌న పాసుప‌తాస్త్రం ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు కూడా చేశారు.. ఓ కార్య‌క‌ర్తకి ఇంత కంటే గుర్తింపు ఏం కావాలి.. త‌న కోసం క‌ష్ట‌ప‌డుతున్న ఓ సామాన్యుడ్ని ఉన్న ఉండాల్సిన స్థానం ఇక్క‌డ అంటూ పిలిచే నాయ‌కుడు., ప్ర‌పంచంలో ఎక్క‌డైనా క‌న‌బ‌డ‌తాడా.. మ‌రి ఇలాంటి నాయ‌కుడి కోసం ముందూ వెనుకా ఆలోచించ‌కుండా ఎందుకు క‌ష్ట‌ప‌డ కూడ‌దు..? ఇలాంటి నాయ‌కుడి పాల‌న ఎలా ఉంటుందో., ఒక్క సారి గుండెల‌పై చెయ్యేసుకుని ఆలోచించండి..

దేవుణ్ణి క‌లిసిన వీర‌న్న ఏం కోరారో తెలుసా.. దేశానికి నిస్వార్ధంగా ప‌నిచేసే రాజ‌కీయా నాయ‌క‌త్వం దేశానికి అవ‌స‌ర‌మ‌ని., అలాంటి నాయ‌క‌త్వాన్ని త‌యారు చేయాల‌ని జ‌న‌సేనుడ్ని కోరారు.. జ‌నం మంచి కోరుకోవ‌డ‌మంటే అదే..

Share This:

2,571 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 + 5 =