Home / జన సేన / క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ భ‌విష్య‌త్తు.. కార్య‌క‌ర్త‌ల‌కు జ‌న‌సేన థ్యాంక్స్‌..

క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ భ‌విష్య‌త్తు.. కార్య‌క‌ర్త‌ల‌కు జ‌న‌సేన థ్యాంక్స్‌..

గాజు గ్లాసు గుర్తు మీద బ‌రిలోకి దిగిన యువ అభ్య‌ర్ధుల‌తో నిర్వ‌హించిన ముఖాముఖి కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంద‌రికీ ఒక ముఖ్య‌మైన సూచ‌న చేశారు.. అది మ‌న‌కు అండ‌గా నిల‌చిన వారికి, మ‌న కోసం క‌ష్ట‌ప‌డిన వారికి థ్యాంక్స్ చెప్ప‌డం మ‌ర‌చిపోవ‌ద్ద‌ని.. ప్ర‌తి గ్రామానికీ వెళ్లి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డ‌మే త‌క్ష‌ణ క‌ర్త‌వ్యంగా హిత‌బోధ చేశారు.. ఇక పార్టీ త‌రుపున ప్ర‌తి జిల్లాలో, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ముందుండి న‌డిపించిన ప్ర‌తి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌కు థ్యాంక్స్ చెప్పే ప‌నిని ముఖ్య‌నేత‌ల‌కు అప్ప‌గించారు.. పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ క‌న్వీన‌ర్ మాదాసు, ప‌వ‌న్ పొలిటిక‌ల్ అడ్వ‌యిజ‌ర్ పి.రామ్మోహ‌న్‌రావు, జ‌న‌సేనాని వ్య‌క్తిగ‌త రాజ‌కీయ కార్య‌ద‌ర్శి పి.హ‌రిప్ర‌సాద్‌ల‌తో పాటు పార్టీ ప్ర‌ముఖులు ర‌త్నం త‌దిత‌రులు ఈ ప‌నిని భుజాన వేసుకున్నారు.. జ‌న‌సేనాని పోరాట యాత్ర ప్రారంభించిన ఉత్త‌రాంధ్ర నుంచి వీరు ఈ ఆత్మీయ యాత్ర మొద‌లుపెట్టారు.. తొలిగా సిక్కోలు జిల్లా కార్య‌క‌ర్త‌ల‌తో అత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు.. రెండో రోజు ప‌ర్య‌ట‌న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో సాగింది.. సోమ‌వారం తూర్పుగోదావ‌రి జిల్లా కార్య‌క‌ర్త‌ల‌తో ముఖాముఖి భేటీ అవుతారు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ కోరుకుంటున్న మార్పు స్ప‌ష్టంగా క‌నిపించింద‌న్న విష‌యాన్ని కార్య‌క‌ర్త‌ల వ‌ద్ద మాదాసు ప్ర‌స్థావించారు.. యువ‌త‌, మ‌హిళాలోకంతో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగుల నుంచి పార్టీకి ల‌భించిన మ‌ద్ద‌తును ప్ర‌స్థావించారు.. అభ్య‌ర్ధుల అనుభ‌వాలు తెలుసుకున్న అనంత‌రం., జ‌న‌సేన విజ‌యం కోసం కృషి చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ‌త‌లు తెలిపారు.. ప‌వ‌న్ అందుకే త‌మ‌కు ఇక్క‌డికి పంపిన‌ట్టు తెలిపారు.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల మీద దృష్టి సారించి ప్ర‌తి గ్రామంలో జ‌న‌సేన జెండా ఎగుర‌వేసే వ‌ర‌కు క‌ష్ట‌ప‌డాల‌ని సూచించారు.. ప‌ని చేసే ప్ర‌తి ఒక్క‌రికీ గుర్తింపు ఉంటుంద‌ని తెలిపారు.. త‌న అనుభ‌వంలో ప‌వ‌న్ లాంటి నాయ‌కుడిని చూడ‌లేద‌న్న మాదాసు., వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు సైతం రాజ్యాధికారాన్ని అందించే ఉద్దేశంతో బీఎస్పీతో క‌ల‌సి దేశ రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన‌ట్టు తెలిపారు.. జ‌న‌సైనికులు చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్థ‌లు ప‌క్క‌న‌పెట్టి ఐక్య‌త‌తో ముందుకు సాగాల‌ని స్ప‌ష్టం చేశారు..

అధికారానికి దూర‌మైన కులాల‌కు రాజ‌కీయ ప్రాతినిధ్యం
స‌మాజంలో మార్పు కోసం బీఎస్పీ వ్య‌వ‌స్థాప‌కులు కాన్షీరాం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో.. జ‌న‌సేన అధానేత‌ కూడా అంతే క‌ష్ట‌ప‌డుతున్నార‌ని ప‌వ‌న్ రాజ‌కీయ స‌ల‌హాదారు రామ్మోహ‌న్‌రావు తెలిపారు.. స‌మాజంలో అన్ని కులాల‌ను క‌లుపుకొని రాజ‌కీయం న‌డ‌పాలి, అధికారం దూర‌మైన కులాల‌కు రాజ‌కీయ ప్రాతినిధ్యం క‌ల్పించాలనే ఆలోచ‌న‌తో ఆయ‌న ముందుకు వెళ్తున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు.. త‌న‌ 35 ఏళ్ల కెరీర్ లో ఇలాంటి గొప్ప ల‌క్ష‌ణాలు, నిస్వార్థమైన నాయ‌కుడిని చూడ‌లేదన్నారు.. జ‌న‌సేన పార్టీ ఒక్క ఎల‌క్ష‌న్ కోసం రాలేదు. స‌మాజంలో మార్పు కోసం వ‌చ్చింది. అందుకే వేల‌ కోట్ల‌తో ముడిప‌డిన రాజ‌కీయాల్లో జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ తీసుకొచ్చింద‌ని.,. రాజ‌కీయ పార్టీగా ఎదుగుతున్న పరిణామక్ర‌మంలో అంతా క్ర‌మ‌శిక్ష‌ణ‌, క‌ట్టుబాట్ల‌తో మెల‌గాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించారు.. వార్డుకు ప‌ది మంది స‌భ్యుల‌ను త‌యారు చేసేలా జ‌న‌సేన కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని తెలిపారు..
రాజ‌కీయాల‌కు జ‌న‌సేనాని గౌర‌వం తెచ్చారు..
రాజ‌కీయాలన్నా, రాజ‌కీయ నాయ‌కుల‌న్నా జ‌నంలో చిన్న‌చూపు ఉండే త‌రుణంలో జ‌న‌సేన పార్టీ స్థాపించి మ‌ళ్లీ రాజ‌కీయాల‌కు ఒక గౌర‌వం తీసుకొచ్చార‌ని ప‌వ‌న్ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి హ‌రిప్ర‌సాద్ అభిప్రాయ‌ప‌డ్డారు.. అదే గౌర‌వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని తెలిపారు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు ప‌క్క‌న పెడితే, త‌క్కువ స‌మ‌యంలో అతి త‌క్కువ వ‌న‌రుల‌తో పోరాటం చేయ‌డంలో జ‌న‌సేన పార్టీ స‌ఫ‌లీకృత‌మైంద‌ని తెలిపారు… రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని, రాష్ట్రంలో మార్పు తీసుకురావ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు చేసిన కృషి ఫ‌లించిన‌ట్లేన‌ని ఎన్డీటీవీ చీఫ్ ప్ర‌ణ‌య్ రాయ్ చెప్పిన విష‌యాన్ని ప్ర‌స్థావించారు.. ప్ర‌తి గ్రామంలో ఉన్న జ‌న‌సేన ఓటు బ్యాంకును గెలుపు దిశ‌గా తీసుకువెళ్లేలా వ్యూహాలు ర‌చించ‌డంతో పాటు అందుకు అనుగుణంగా కృషి చేయాల‌ని సూచించారు.. రామ‌రాజ్యం చూడాలంటే ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీని గెలిపించాల‌ని అందుకు ప్ర‌తి కార్య‌క‌ర్త కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు..

రెండు జిల్లాల్లో జ‌రిగిన ఆత్మీయ స‌మావేశాల్లో పార్టీ ప్ర‌తినిధులు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో విడివిడిగా స‌మావేశాలు నిర్వ‌హించి., భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌పై చ‌ర్చ జ‌రిపారు.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వున్న లోటుపాట్ల‌ను స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేశారు.. ముఖ్యంగా పేరు పేరునా ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్ చెప్పాల‌న్న జ‌న‌సేనుడి సూచ‌న‌., కార్య‌క‌ర్త‌ల్లో తిరిగి ఉత్సాహం నింపుతోంది..

Share This:

440 views

About Syamkumar Lebaka

Check Also

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + seven =