Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / క‌స్సు బుస్సుల క‌మ‌ల‌య్య‌లు.. ఇప్పుడు నోరుమెద‌ప‌రేం..

క‌స్సు బుస్సుల క‌మ‌ల‌య్య‌లు.. ఇప్పుడు నోరుమెద‌ప‌రేం..

images-1ప్ర‌త్యేక హోదా వ‌ద్దు.. ప్యాకేజే ముద్దు అన్నారు.. ప్యాకేజీ పాచిపోయిన ల‌డ్డూ అని జ‌న‌సేనాని విమ‌ర్శించ‌గానే., కేంద్ర మంత్రి వెంక‌య్య‌, ఆయ‌న భ‌జ‌న‌ప‌రుల‌కి విప‌రీత‌మైన కోసం వ‌చ్చింది.. ప‌క్కా ప్లాన్ చేసి., హోదాని ప‌క్క‌దోవ ప‌ట్టిస్తే.. ఈ ప‌వ‌న్ ఎక్క‌డ నుంచి దాపురించాడు మ‌న ప్రాణానికి అని త‌ల‌లు ప‌ట్టుకున్న వారు.. వెంట‌నే నోటికి ప‌ని చెప్పారు.. కాకినాడ స‌భ త‌ర్వాత జ‌న‌సేనానిపై మూకుమ్మ‌డిగా ఎదురుదాడి చేశారు.. ఈ సంఘానికి అధ్య‌క్ష‌త వ‌హించిన గౌర‌వ‌నీయ వెంక‌య్య‌గారు., ఏకంగా ప‌వ‌న్‌కి రాజ‌కీయానుభ‌వం లేద‌ని., నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాల‌ని సెల‌విచ్చారు.. ఇక ఆయ‌న‌గారి ప‌ధాతిద‌ళం అయితే., ఒక‌రు ప్యాకేజీ బంద‌రు ల‌డ్డూ అని., అది అంద‌రికీ రుచిగా ఉంటుంద‌ని అంటే., ఇంకొక‌రు ఏకంగా తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూతో పోల్చారు.. అంతేకాదు ఆ ప్యాకేజీకి ఎలాంటి చ‌ట్ట‌బ‌ద్ద‌త లేకుండానే., జ‌నానికి ఏదో అద్భుతం జ‌రిగిపోయింద‌న్న ఫీలింగ్ క‌లిగించేందుకు., స‌న్మానాలు, స‌త్కారాలు అంటూ గానాభ‌జానాలు మొద‌లు పెట్టారు..

ఈ తతంగ మంతా చూస్తూ జ‌న‌సేనాని ఎందుకు మౌనంగా ఉన్నారు..? ఆయ‌న విమ‌ర్శ‌లో విష‌యం ఉందా..? లేదా..? అని ప్ర‌శ్నించిన వారు లేక‌పోలేదు.. కానీ ఇక్క‌డ రెండు కార‌ణాలు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌కంప‌న‌ల్ని కాస్త ఆల‌స్యం చేశాయి.. స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు ఉన్న స‌మ‌యంలో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌తో ఒత్తిడి పెంచ‌రాద‌న్న‌ది ఓ కార‌ణం.. ఇది ఆయ‌న‌కున్న దేశ‌భ‌క్తిని చాటుతోంది.. మ‌రోకార‌ణం.. అస‌లు కేంద్రం చెబుతున్న ప్యాకేజీ ఏంటి..? అందులోని అంశాలు ఏంటి..? ప‌్యాకేజీ ప్ర‌క‌టించి దానికి చ‌ట్ట‌బ‌ద్ద‌త ఎందుకు క‌ల్పించ‌లేదు..? అనే అంశాల‌పై క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేయ‌డం.. ప్యాకేజీ పాఠం పూర్తిగా చ‌ద‌వ‌డంతో పాటు కేంద్రస్థాయిలో ప‌నిచేసిన ఆర్ధిక రంగ నిపుణుల‌తో దానిలోని లోటుపాట్ల‌పై చ‌ర్చించి., పూర్తిగా అవుపోస‌న‌ప‌ట్టారు.. కాస్త లేటుగా వ‌చ్చినా., అనంత మీటింగ్‌లో వెంక‌య్య‌వ‌ర్గం చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు, వారికి వ‌త్తాసు పాడుతున్న టీడీపీ స‌ర్కారుకు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చారు.. ప్యాకేజీ కాని ప్యాకేజీపై త‌న‌దైన స్ట‌యిల్లో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.. చ‌ట్ట ప్ర‌కారం రాష్ట్రానికి రావ‌ల్సిన వాటాతో పాటు రెవెన్యూలోటు 23 వేల కోట్లు క‌లిపి ప్యాకేజీ చేసిన వైనాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.. కేంద్రం, రాష్ట్రం క‌లిసి ఆడుతున్న డ్రామాని ప్ర‌జ‌ల ముందుంచారు.. ఇదే నిజం.. అది ప్యాకేజీ కాదు.. హోదా రాదు.. ఎందుకీ వంచ‌న‌..? ప‌్ర‌జ‌ల్ని ఎందుకిలా మోసం చేస్తున్నారంటూ పాల‌కుల్ని న‌డిరోడ్డుపై నిల‌దీశారు..

మ‌రి ప‌వ‌న్ మాట‌లు నిజ‌మేనా వెంక‌య్య‌గారు..? ఈ కుట్ర‌లో మీ పాత్రెంత ఉంది బాబు గారు..? ప‌వ‌న్ వ్యాఖ్య‌ల్లో నిజం లేక‌పోతే., మీరేందుకు నోరు మెద‌ప లేదు.. కాకినాడ స‌భ‌లో ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూ అన్నందుకే మీకంత కోపం వ‌చ్చింది.. ఇవాళ అది అస‌లు ప్యాకేజీ కాదు.. అంతా మోసం అన్నారు.. ఇప్పుడు మీకెందుకు కోపం రాలేదు.. మీకు.. మీ భ‌జ‌న బ్యాచ్‌కి నోరెందుకు ప‌డిపోయింది.. జ‌న‌సేనాని చెప్పిన నిజాలు విని మీ స్వ‌ర‌పేటిక త‌డారి పోయిందా..? ఏం చెప్పాలో తెలియ‌క నోట మాట‌రావ‌డం లేదా..? రాజకీయాల కోసం ఇంత మోసం చేయాలా..? ప‌ద‌వుల కోసం ఇంత‌గా పాకులాడాలా..? గెలిచినా.. గెల‌వ‌కున్నా.. ప‌ద‌వులు వ‌చ్చినా.. రాకున్నా.. ప్ర‌జ‌ల కోసం పోరాడి జ‌నం గుండెల్లో చిర‌స్థాయిగా నిలచిన నాయ‌కులు పుట్టినగ‌డ్డ మ‌న‌ది.. ఇలాంటి గ‌డ్డపై పుట్టి ఇలాంటి నీతిమాలిన రాజ‌కీయాలు చేయ‌డానికి మీకు సిగ్గుగా లేదా..? ఇప్పుడు జ‌నానికి ఏం స‌మాధానం చెబుతారు.. మా జ‌న‌సేనాని ముందు నిల‌బ‌డే స్థాయి అయినా మీకుందా..? ఉంటే ఈ ప్ర‌శ్న‌ల‌కి బ‌దులివ్వండి..

Share This:

1,420 views

About Syamkumar Lebaka

Check Also

టార్గెట్ జేడీ మిస్ ఫైర్‌.. టాపిక్ డైవ‌ర్ట్ చేసిన విజ‌య‌సాయి(ఏ2)..

వెనుక‌టికి ఒక‌మ్మ రంకు బ‌య‌ట‌ప‌డిందని బొంకు మొద‌లుపెట్టిందంట‌..! అలా ఉంది వైసీపీ త‌ప్పుడు లెక్క‌ల ఆడిట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి ప‌రిస్థితి.. అధికారిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × 3 =