Home / జన సేన / ఖండాంత‌రాలు దాటిన హోదా పోరు.. మాతృ భూమికోసం గ‌ళం విప్పిన ఎన్ఆర్ఐలు..

ఖండాంత‌రాలు దాటిన హోదా పోరు.. మాతృ భూమికోసం గ‌ళం విప్పిన ఎన్ఆర్ఐలు..

విభ‌జ‌న హామీల అమ‌లు వ్య‌వ‌హారంలో కేంద్రం చేసిన మోసాన్ని తెలుగు ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక పోతున్నారు.. ముఖ్యంగా స్పెష‌ల్ కేట‌గిరీ స్టేట‌స్ (ప్ర‌త్యేక హోదా) ఇస్తామ‌ని చెప్పి వంచించ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.. పదేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన బీజేపీ., కావాల‌నే ఆంధ్రుల నోట్లొ మ‌న్ను కొట్టింద‌ని న‌మ్ముతున్నారు.. అందుకే హోదా సాధ‌న కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఒక్క‌టై పోరాటం చేస్తున్నారు.. విభ‌జ‌న చ‌ట్టాన్ని అమ‌లు ప‌రిచే వ్య‌వ‌హారంలో కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని మాత్ర‌మే కాదు తెలంగాణ ప్ర‌జ‌ల‌కి కూడా అన్యాయం జ‌రిగింద‌న్న‌ది వారి భావ‌న‌.. అందుకే విభ‌జ‌న కార‌ణంగా న‌ష్ట‌పోయిన ఏపీ కోసం మేము సైతం అంటూ తెలంగాణ రాజ‌కీయ నాయ‌కులు ముందుకి రాగా., ఏపీ ప‌ల్లెల్లో హోదా వాదం బ‌ల‌ప‌డుతోంది…

జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు గొంతు స‌వ‌రించి ఓ నినాదాన్ని ఇప్పుడు తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో నాటారు.. ప్ర‌త్యేక హోదా వ్య‌తిరేకుల‌కు మా మ‌న‌సులో చోటు లేదు., మా ఇంట్లో ఓటు లేదు.. ఈ నినాదం ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైర‌ల్ అవుతోంది.. ఇప్పుడు ఇదే నినాదం ఖండాంత‌రాలు దాటి., కేవ‌లం తెలుగు ప్ర‌జ‌ల్ని మాత్ర‌మే కాదు.. దేశం దాటి వెళ్లిన ప్ర‌తి ఎన్నారైల‌ని కూడా క‌దిలిస్తోంది.. తెలుగు ప్ర‌జ‌ల‌కి జ‌రిగిన అన్యాయాన్ని భాష‌, కుల‌, మ‌త‌, ప్రాంతీయ విధ్వేషాల‌కి అతీతంగా ప్ర‌తి ఎన్ఆర్ఐ కేంద్రాన్ని ప్ర‌శ్నించేలా జ‌న‌సేన ఎస్ఆర్ఐ వింగ్ త‌న ప్ర‌య‌త్నాన్ని మొద‌లుపెట్టింది..

ప్ర‌త్యేక హోదా కోసం మాతృ దేశంలో త‌మ వారు చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తుగా ఎన్ఆర్ఐ జ‌న‌సేన అమెరికా విభాగం గ‌ళం విప్పింది.. అదీ ఎముక‌లు కొరికే 5 డిగ్రీల చ‌లిలో కూర్చుని నిర‌స‌న తెలిపింది.. ఈ నిర‌స‌న ద్వారా తెలుగు ప్ర‌జ‌ల‌కి జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌పంచం దృష్టికి తీసుకువెళ్లాల‌న్న‌దే వారి ఉద్దేశం.. ప్ర‌త్యేక హోదా వ్య‌తిరేకుల‌కి మా మ‌న‌సులో చోటు లేదు., మా ఇంట్లో ఓటు లేదు అనే నినాదాన్ని ప్ల‌కార్డుల ద్వారా ప్ర‌ద‌ర్శిస్తూ., ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ దేశం కాని దేశంలో గ‌ళం విప్పారు..

న్యూజెర్సీ వేదిక‌గా ఎన్ఆర్ఐ జ‌న‌సైనికులు చేప‌ట్టిన ఈ నిర‌స‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.. స్వ‌దేశంలోని తెలుగు ప్ర‌జ‌ల్లో హోదా కాంక్ష‌ని మ‌రింత‌గా రాజేస్తోంది.. ఎక్క‌డో ఉన్న వారే మ‌న హ‌క్కుల కోసం పోరాడుతుంటే., మ‌నం ఏం చేస్తున్నామ‌న్న ఆలోచ‌న రేకెత్తిస్తోంది.. ఈ స్ఫూర్తి హోదా సాధించే వర‌కు కొన‌సాగాల‌ని కోరుకుందాం..

ఈ ఉద్య‌మ స్ఫూర్తిని ర‌గిల్చిన ఎన్ఆర్ఐ జ‌న‌సైనికులు చంద్ర‌శేఖ‌ర్ పొలిశెట్టి, సురేష్ తాడిశెట్టి, ప్ర‌సాద్ చింగిలిశెట్టి, కాశీవిశ్వ‌నాథ్‌, శ్రీ స‌త్య‌క‌రుణాక‌ర్ తిమ్మ‌న‌, స‌తీష్ రెడ్డి మేక‌ల‌ల‌కు యావ‌త్ ఆంధ్రావ‌ని ధ‌న్య‌వాదాలు తెలుపుతోంది..

Share This:

1,189 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 − 5 =