Home / జన సేన / గాజువాక నుంచి స‌మ‌ర‌నాధం.. నామినేష‌న్ దాఖ‌లు చేసిన జ‌న‌సేనాని..

గాజువాక నుంచి స‌మ‌ర‌నాధం.. నామినేష‌న్ దాఖ‌లు చేసిన జ‌న‌సేనాని..

==============================

విశాఖ‌ప‌ట్నం జిల్లా గాజువాక శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. గురువారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల ప్రాంతంలో ఆశేష జ‌న‌వాహిని, నాయ‌కులు తోడు రాగా గాజువాక‌లోని జీవీఎంసీ జోన‌ల్ కార్యాల‌యానికి చేరుకున్నారు. రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు.. న‌ట‌న‌లో ఓన‌మాలు దిద్దిన విశాఖ‌ప‌ట్నం ప్రాంతం నుంచే ఎన్నికల బరిలో మొద‌టి అడుగు వేశారు.. జ‌న‌సేనాని నామినేష‌న్ దాఖ‌లు చేసే స‌మ‌యంలో పార్టీ ప్ర‌ముఖులు విశాఖ ఎంపి అభ్య‌ర్ధి సిబిఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, త‌మిళ‌నాడు మాజీ సిఎస్ రామ్మోహ‌న్‌రావు, మాదాసు గంగాధరం, శాంతిప్రసాద్ ఉన్నారు. జి.వి.ఎం.సి. జోనల్ కార్యాలయం వరకూ జనసేనాని వెంట పార్టీ ప్రముఖులు, జిల్లా నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా త‌ర‌లివచ్చారు.
ఉప్పొంగిన అభిమానం..
నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు నియోజ‌క‌వ‌ర్గానికి జ‌న‌సేన అధినేత రాక సంద‌ర్బంగా పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌లు అపూర్వ స్వాగ‌తాన్ని ఏర్పాటు చేశారు.. డ‌ప్పు చ‌ప్పుళ్లు, బాణాసంచా పేలుళ్లతో జ‌న‌సేన శ్రేణులు మ‌ర్రిపాలెం నుంచి గాజువాక జీవీఎంసీ జోన‌ల్ కార్యాల‌యం వ‌ర‌కు రోడ్ షో నిర్వ‌హించాయి. వేలాదిమంది యువ‌త బైకుల‌తో జ‌న‌సేనుడి వాహ‌న‌శ్రేణిని అనుస‌రించారు.. అడుగ‌డుగునా అభిమానులు పూల‌వ‌ర్షం కురిపిస్తే.. ఆడ‌ప‌డుచులు దిష్టితీసి హార‌తులు ప‌ట్టారు.. అభిమానులు ముఖానికి ప‌వ‌న్ మాస్క్లు, ఎర్ర‌కండువాలు రోడ్డు షోలో పాల్గొని త‌మ అభిమానాన్ని చాటుకున్నారు.. సుమారు 5 కిలోమీట‌ర్ల మేర ఇసుక‌ వేస్తే రాల‌నంత జ‌న‌సంద్రంలో గాజువాక ర‌హ‌దారులు నిండిపోయాయి.. రోడ్డుషోలో వేలాదిమంది జ‌న‌సైనికుల‌తో పాటు, వామ‌ప‌క్షాలు, బీఎస్పీ కార్య‌క‌ర్త‌లు వంద‌ల సంఖ్య‌లో పాల్గొని జ‌న‌సేనానికి మ‌ద్ద‌తు తెలిపారు.


Share This:

192 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + 8 =