Home / పవన్ టుడే / గాలి వాన మ‌ర‌ణాలు బాధాక‌రం.. బాధితుల‌కి అండ‌గా ఉండాలంటూ సేన‌కు జ‌న‌సేనాని పిలుపు..

గాలి వాన మ‌ర‌ణాలు బాధాక‌రం.. బాధితుల‌కి అండ‌గా ఉండాలంటూ సేన‌కు జ‌న‌సేనాని పిలుపు..

ఉత్త‌ర భార‌త దేశంతో పాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో గాలి వాన సృష్టించిన బీభ‌త్సం అంతా ఇంతా కాదు.. ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌ల ప్రాణాలు తీసింది.. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 17 మంది మృత్యువు ఒడికి చేరారు.. ఈ ఘోరంపై స్పందిచిన జ‌న‌సేన అధినేత., ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోవ‌డం చాలా బాధా క‌ర‌మైన అంశమ‌ని. , ఈ వ్య‌వ‌హారం త‌నను తీవ్రంగా క‌ల‌చిసేసిన‌ట్టు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.. ముఖ్యంగా రైతులు దాచిపెట్టుకున్న ధాన్యం పాడ‌వ‌డం ప‌ట్ల ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.. మృతుల కుటుంబాల‌కి ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌గినంత ఆర్ధిక సాయం ప‌రిహారంగా అంద‌చేయాల‌ని డిమాండ్ చేశారు.. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లంతా బాధిత కుటుంబాల‌కి అండ‌గా నిల‌వాల‌ని పిలుపునిచ్చారు..

సైన్స్ ఎంత‌గా అభివృద్ది చెందిన నేటి రోజుల్లో ప్ర‌కృతి ప్ర‌కోపం నుంచి మ‌న వారిని మ‌నం ర‌క్షించుకోలేక పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.. అకాల వ‌ర్షాలు ఉరుములు సంభ‌విస్తాయ‌ని పిడుగులు గ‌ర్జిస్థాయని ముందుగా తెలిసిన‌ప్ప‌టికీ పాల‌నా యంత్రాంగం ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డ‌మే ఇలాంటి ప‌రిస్థితికి కార‌ణ‌మ‌ని ప‌వ‌న్ ఆరోపించారు.. తెలంగాణ‌లో 10 మంది , ఏపీలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవ‌డాన్ని చిన్న‌విష‌యంగా భావించ‌వ‌ద్ద‌ని పాల‌కల‌ని హెచ్చ‌రించారు.. ప్ర‌భుత్వం మ‌రింత బాధ్య‌తాయుతంగా ప‌నిచేయాల‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.. ఆరుగాలం చ‌మ‌టోడ్చి పండించిన పంట‌ను మార్కెట్ యార్డులో దాచినా న‌ష్టం త‌ప్ప‌లేద‌ని వాపోయారు..

రైతుల‌కి న‌ష్ట‌పోయిన మొత్తాన్ని ప‌రిహారంగా అంద‌జేయాల‌ని జ‌న‌సేనాని డిమాండ్ చేశారు.. ఆకాల వ‌ర్షాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుణ్ణి ప్రార్ధిస్తున్న‌ట్టు తెలిపారు.. త‌న త‌రుపున జ‌న‌సేన పార్టీ త‌రుపున ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.. ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు స్వ‌యంగా తెలుసుకోవ‌డం., వారికి ఇబ్బంది లేకుండా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం.. ప్ర‌జ‌ల త‌రుపున డిమాండ్లు, ప్ర‌జ‌ల కోసం సూచ‌న‌లు, పాల‌కుల‌కి-నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న అధికారుల‌కి త‌న‌దైన శైలిలో హెచ్చ‌రిక‌లు పంపారు.. జ‌న‌సేనుడి ఫుల్ టైం పాలిటిక్స్ ఎలా ఉన్నాయి..? ఉండ‌బోతున్నాయి..? అనే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెబుతూ——–..

Share This:

985 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four − 3 =