Home / ఎడిటోరియల్స్ / గిరి’జ‌నం’ మ‌ధ్య‌కు జ‌న‌సేనాని.. అర‌కు గూడేల్లో స‌మ‌స్య‌ల అధ్య‌య‌నం.. గుండెల్లో పెట్టుకుంటామంటున్న‌ అడ‌విబిడ్డ‌లు..

గిరి’జ‌నం’ మ‌ధ్య‌కు జ‌న‌సేనాని.. అర‌కు గూడేల్లో స‌మ‌స్య‌ల అధ్య‌య‌నం.. గుండెల్లో పెట్టుకుంటామంటున్న‌ అడ‌విబిడ్డ‌లు..

జ‌న‌సేన ఏసీ గ‌దుల్లో కూర్చుని చ‌ట్టాలు చేయ‌దు.. జ‌నం స‌మ‌స్య‌లు తెలుసుకుని, పూర్తి స్థాయిలో అధ్య‌య‌నం చేసి., జ‌నానికి ఏది అవ‌స‌ర‌మో తెలుసుకుని చ‌ట్టాలు చేస్తుంది.. ఒక రోజు ముందు అర‌కు-పాడేరు ఏజెన్సీ ప్రాంతాల గిరిజ‌నంతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముఖాముఖీలో చెప్పిన మాట‌లు ఇవి.. ఆ మ‌రుస‌టిరోజే త‌న‌వి మాట‌లు కాదు.. చేత‌ల‌ని నిరూపించేశారు.. సోమ‌వారం అడ‌విబిడ్డ‌లు త‌మ స‌మ‌స్య‌లు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దృష్టికి తీసుకురాగా., మ‌రుస‌టి రోజు ఉద‌య‌మే ఆయ‌న గిరిజ‌న గ్రామాల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.. డుంబ్రిగూడ‌, అనంత‌గిరి, అర‌కు మండ‌లాల్లోని ప‌లు గ్రామాల్లో ప‌ర్య‌టించారు.. మొద‌ట డుంబ్రిగూడ మండ‌లంలోని పోతంగి గ్రామాన్ని జ‌న‌సేన అధినేత సంద‌ర్శించారు.. క‌నీస వ‌స‌తుల‌కి నోచుకోని గిరిజ‌న గ్రామాన్ని చూసి ఆయ‌న దిగ్భ్రాంతికి గుర‌య్యారు.. గ్రామంలో ప్రతి ఇంటి త‌లుపు త‌ట్టి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకోవ‌డం., స్థానికుల్నే ఆశ్చ‌ర్యానికి గురిచేసింది..

అనంత‌రం ఆ గ్రామంతో పాటు చుట్టు ప‌క్క‌ల మూడు గ్రామాల‌కి ఏకైక తాగునీటి వ‌న‌రు అయిన ఊట బావిని ప‌రిశీలించారు.. పంట పొలాల‌కి మ‌ళ్ళించే మురికి నీటినే, గిరిజ‌న‌లు తాగాల్సిన దుస్థితి ఉంద‌న్న విష‌యాన్ని గ‌మ‌నించారు.. క్రిమికీట‌కాలు క‌ల‌సి ఉన్న ఆ నీటినే మోట‌ర్ ద్వారా గ్రామంలోని టాప్‌ల‌కి పంప‌డాన్ని ప‌వ‌న్ గ్ర‌హించారు.. ప్ర‌భుత్వాలు ఇక్క‌డ ప్ర‌జ‌ల్ని మ‌నుషులుగా కూడా చూడ‌డం లేద‌న్న విష‌యాన్ని గ్ర‌హించారు.. బావిలో చేద వేసి స్వ‌యంగా నీటిని తోడిన జ‌న‌సేనాని, శాంపిల్ నిమిత్తం వాటిని స్వీక‌రించి, ప‌రీక్ష‌ల నిమిత్తం విశాఖ‌కి పంపారు.. పోలాల మ‌ధ్యే సుమారు ఆర‌గంట‌కు పైగా గ‌డిపిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు, వాటి మార్కెటింగ్ త‌దిత‌ర అంశాల‌పైనా క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేశారు..

గిరిపుత్రులు ముందు రోజు త‌న ముందు ఉంచిన ప్ర‌ధాన స‌మ‌స్య‌లు విద్యా-ఆరోగ్యం ఈ రెండు అంశాల‌ను జ‌న‌సేనాని పరిశీల‌న చేశారు.. ముఖ్యంగా ఇళ్ల‌కు వెళ్లి మ‌రీ, సీజ‌న‌ల్ వ్యాధుల‌తో ఇబ్బందులు ప‌డుతున్న వారిని ప‌లుక‌రించారు.. చిన్నారుల‌కి వాపులు ఉండ‌డాన్ని గ్ర‌హించిన ఆయ‌న‌., వాటిని సునిశితంగా ప‌రిశీలించారు.. జ‌న‌సేన డాక్ట‌ర్ల బృందాన్ని పంపి, వీటికి కార‌ణ‌లు అన్వేషిస్తామ‌ని మాట ఇచ్చారు.. పోతంగి పంచాయితీ ప‌రిధిలోని మ‌రో రెండు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి అక్క‌డ స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేసిన ఆయ‌న‌, గిరిపుత్రులు క‌నీస మౌళిక స‌దుపాయాల‌కు దూరంగా ఉన్నార‌న్న విష‌యాన్ని గ్ర‌హించారు..

ముఖ్యంగా సీజ‌న‌ల్ వ్యాధులు వ‌చ్చిన‌ప్పుడు, ఏజెన్సీలో దాదాపు అన్ని గ్రామాలు మ‌లేరియా, టైఫైడ్ లాంటి వ్యాధుల‌తో మంచాన ప‌ట్టేస్తాయ‌ని, ఒక‌టి రెండు రోజులు హ‌డావిడి చేసే అధికారులు మిన‌హా త‌మ ముఖం చూసే నాధుడే ఉండ‌డ‌ని, అత్య‌వ‌స‌ర‌మైన 108కి ఫోన్ చేసినా ఫ‌లితం ఉండ‌ద‌న్న విష‌యాన్ని కూడా గిరిపుత్రులు జ‌న‌సేనుడికి వివ‌రించారు.. ఇక ప్ర‌భుత్వ ప‌థ‌కాల నుండి త‌మ‌కు ద‌క్కాల్సిన నిధులు కూడా స్వాహా అయిపోతున్నాయ‌ని వాపోయారు.. ఆఖ‌రికి అంగ‌న్‌వాడీల్లో పిల్ల‌ల‌కు పెట్టాల్సిన గుడ్ల‌ను సైతం మింగేస్తున్నార‌ని తెలిపారు..

సంక్షేమ హాస్ట‌ళ్ల వ్య‌వ‌హారం కూడా త‌న దృష్టికి రావ‌డంతో, ప‌వ‌న్ డుంబ్రిగూడ మండ‌ల కేంద్రంలోని క‌స్తూర్బా బాలిక‌ల వ‌స‌తిగృహాన్ని సంద‌ర్శించారు.. అక్క‌డ విద్యార్ధినుల‌కి క‌నీస సౌక‌ర్యాలు లేవ‌న్న విష‌యాన్ని వారి మాట‌ల్లో అర్ధం చేసుకున్నారు.. తిరుగు ప్ర‌యాణంలో కురిడి గ్రామ‌స్తులు బిందుల‌తో రోడ్డు మ‌ధ్య‌న జ‌న‌సేన అధినేత‌ని ఆపి మా ఊరి జ‌నం బాధ‌లు కూడా ఆల‌కించ‌మంటూ పిలిచారు.. సుమారు రెండున్న‌ర కిలోమీట‌ర్లు కాలిన‌డ‌క‌న గ్రామానికి తీసుకువెళ్లి, త‌మ అవ‌స్థ‌ల‌ను ఆయ‌న‌కి వివ‌రించారు..

ఎస్‌.కోట మిన‌హా విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌ర్య‌ట‌న పూర్తి చేసుకుని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆర‌కు చేరుకుని రెండు రోజులు గ‌డిచింది.. అక్క‌డ ఆయ‌న ఏం చేస్తున్నారు..? విశ్రాంతి తీసుకుంటున్నారా..? లేక పర్య‌ట‌న ఆపేశారా..? అంటూ వ‌చ్చిన సెటైర్ల‌కు ప‌వ‌న్ త‌న ప‌ర్య‌ట‌న ద్వారా చెంప చెళ్లు మ‌నిపించే బ‌దులిచ్చారు.. ఓట్ల కోసం నోటికి వ‌చ్చిన హామీలు ఇవ్వ‌డం నాకు తెలియ‌దు.. అధికారం కోసం రోడ్ల వెంట న‌డుచుకుంటూ వెళ్లిపోయి స‌మ‌స్య‌లు తెలిసేసుకున్నాని చెప్పుకోవ‌డ‌మూ రాదు.. మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలంటే, వాటి మీద నాకు పూర్తిగా అవ‌గాహ‌న ఉండాలి.. మీ స‌మ‌స్య‌ల్ని నేను ప్ర‌పంచం దృష్టికి తీసుకువెళ్తా., ప్ర‌తిగా మిమ్మ‌ల్ని ఓట్లు మాత్రం అడ‌గ‌ను.. ఇదే జ‌న‌సేన సిద్ధాంతం అని చెప్పిన ఆయ‌న‌., ఆ ప‌ని ప్రాక్టిక‌ల్‌గా కూడా చేసి చూపే స‌రికి., ప్ర‌త్య‌ర్ధుల‌కి కాస్త గుండెల్లో ఏదో మూల గుబులు రేగుతూనే ఉంది..

ఏజెన్సీలో ఆయ‌న రెండు రోజుల పాటు స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేసిన తీరు గిరిజ‌నుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.. ముందుగా ఓ యాక్ట‌ర్ అని చూడ‌డానికి ఎగ‌బ‌డిన వారు, ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య‌కి వ‌చ్చి, స‌మ‌స్య‌ల్ని అధ్య‌య‌నం చేస్తున్న తీరు చూసి., ప‌వ‌న్‌క‌ల్యాణ్ లీడ‌ర్ అంటుండ‌డం క‌నిపించింది.. జ‌న‌సేన మొత్తం కుర్రాళ్లే అన్న వాద‌న‌కి కాస్త దూరంగా పోరాట యాత్ర కూడా సాగుతోంది.. నిజంగా గిరిజ‌న గూడాల్లో ఇళ్ల మ‌ధ్య‌కి వ‌చ్చి మా క‌ష్టాలు తెలుసుకున్న ఏకైక నాయ‌కుడిగా గిరిజ‌నం ప‌వ‌న్‌ని కొలుస్తుండ‌డం కూడా క‌నిపించింది.. పోరాట‌యాత్ర ద్వారా ఆయ‌న నాయ‌కుల్ని, ప్ర‌జ‌ల ఓట్ల‌ని సంపాదిస్తారా..? లేదా..? అన్న‌ది ప‌క్క‌న పెడితే ఓ రియ‌ల్ లీడ‌ర్‌గా మాత్రం జ‌నం గుండెల్లో చోటు సంపాదిస్తున్నారు..

Share This:

2,636 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 4 =