Home / జన సేన / గెరుడౌ ఉక్కు క‌ర్మాగార మృతుల కుటుంబాల‌కి న్యాయం చేయాలి.. జ‌న‌సేనాని డిమాండ్‌..

గెరుడౌ ఉక్కు క‌ర్మాగార మృతుల కుటుంబాల‌కి న్యాయం చేయాలి.. జ‌న‌సేనాని డిమాండ్‌..

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రికి స‌మీపంలోని గెరుడౌ ఉక్కు ప‌రిశ్ర‌మ‌లో విష‌వాయువులు వెలివ‌డి ఆరుగురు కార్మికులు మృతి చెందిన ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విచారం వ్య‌క్తం చేశారు.. ప్ర‌మాదం గురించి తెలుసుకున్న వెంట‌నే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జ‌న‌సేనాని., ప‌రిశ్ర‌మ‌లో భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై ఆరా తీశారు.. యాజ‌మాన్యం భ‌ద్ర‌తా చ‌ర్య‌లు ప్ర‌మాణాల మేర‌కు పాటించిందీ, లేనిది విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు..

మృతుల కుటుంబాల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌చేసిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని కోరారు.. త‌గిన ప‌రిహారం చెల్లించ‌డంతో పాటు, మృతుల కుటుంబాల్లో ఒక‌రికి ఉద్యోగం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.. ఆసుప‌త్రి పాలైన కార్మికుల‌కి మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.. గెరుడౌ ఉక్కు క‌ర్మాగారంలో ఒక్క సారిగా గ్యాస్ లీక‌వ‌డంతో ఆరుగురు కార్మికులు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోగా., ఇద్ద‌రు అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు.. అయితే గ్యాస్ ఒక్క‌సారిగా లీక‌వ‌డానికి గ‌ల కార‌ణాలు తెల‌పాల్సి ఉంది.. ఈ ఘ‌ట‌న‌లో యాజ‌మాన్య నిర్ల‌క్ష్యం ఉంటే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని జ‌న‌సేనాని డిమాండ్ చేస్తున్నారు.. చిన్న చిన్న ఏర్పాట్ల కోసం కార్మికుల ప్రాణాల‌ని బ‌లిపెట్ట‌డం లాంటి ఘ‌ట‌న అయితే ఇంకొక‌రు ఇలాంటి త‌ప్పిదాలు చేయ‌కుండా చ‌ర్య‌లు ఉండాల‌న్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆలోచ‌న‌.. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఆట‌లాడుకునే ఒకే విధ‌మైన త‌ప్పిదాలు ప‌దే ప‌దే జ‌రిగే విధంగా ప్ర‌భుత్వాలు వ్య‌వ‌హ‌రించాల‌న్న అంశంపై జ‌న‌సేన మొద‌టి నుంచి త‌న గ‌ళాన్ని వినిపిస్తూనే ఉంది..

Share This:

1,885 views

About Syamkumar Lebaka

Check Also

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × 5 =