Home / ఎడిటోరియల్స్ / గెలిచే వ‌ర‌కు పోరాడు.. సాధించు.. ఇదే జ‌న‌సేనుడి విజ‌య ర‌హ‌స్యం..

గెలిచే వ‌ర‌కు పోరాడు.. సాధించు.. ఇదే జ‌న‌సేనుడి విజ‌య ర‌హ‌స్యం..

హ‌మ్‌.. ల‌డేంగే.. హ‌మ్ ల‌డేంగే.. జీత్ నే త‌క్ ల‌డేంగే.. మేము పోరాడుతాం.. పోరాడుతాం.. గెలిచే వ‌ర‌కు పోరాడుతూనే ఉంటాం.. ఇవి ఆవేశంతో చెప్పే మాట‌లు కాదు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాడి విజ‌యం సాధిస్తున్న తీరు ఇది.. చేతిలో అధికారం లేదు.. ఒక్క ప్ర‌జా ప్ర‌తినిధి లేడు.. కానీ అంతులేని ప్ర‌జాభిమానం మాత్రం ఉంది.. ఆయ‌న నోటి నుంచి బ‌య‌టికి వ‌చ్చే ఒక్కో మాట కొన్ని కోట్ల మందికి చేరుతుంది.. కొన్ని కోట్ల మందిని ఆ స‌మ‌స్య గురించి ఆలోచింప చేస్తుంది.. జ‌న‌సేన గ్యారేజ్‌కి ఓ స‌మ‌స్య వ‌చ్చినప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముందుగా ఆ స‌మ‌స్య‌పై లోతుగా అధ్య‌య‌నం చేస్తారు.. స‌మ‌స్య ఎందుకు ఉత్ప‌న్నం అయ్యింది.. త‌ప్పు ఎవ‌రిది..? అనే అంశాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి, మేధావులు, సంబంధిత వ‌ర్గాల నుంచి స్ప‌ష్ట‌మైన స‌మాచారం తీసుకున్న త‌ర్వాత మాత్ర‌మే ఆయ‌న దాన్ని అడ్ర‌స్ చేస్తారు.. ఒక‌ప్పుడు రాజ‌ధాని రైతుల త‌రుపున చేసిన పోరాటం, ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య‌, అక్వా ఫుడ్ పార్క్‌.. ఇలా ఆయ‌న విజ‌యం సాధించిన అంశాల‌పై విశ్లేష‌ణ‌కు అవ‌కాశం ఉండేది.. అయితే ఇప్పుడు ఆ జాబితా చాంతాడులా పెరిగిపోయింది..

గ‌తంలో తెలుగు దేశం పార్టీతో దోస్తీ ఉండ‌గా కూడా ఆయ‌న కేవ‌లం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చ‌మ‌ని మాత్ర‌మే అడిగి వాటిని ప‌రిష్క‌రించే వారు.. కొన్నాళ్ల‌కు పవ‌న్ చెప్పిన ప్ర‌తి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటూ పోతే, ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు క్రేజీ నానాటికీ పెరిగిపోతుంద‌ని కంగారు ప‌డిన ముఖ్య‌మంత్రి, ఇంటెలిజెన్స్ రిపోర్టుల‌తో జ‌న‌సేనుడి సూచ‌న‌ల్ని నెమ్మ‌దిగా ప‌ట్టించుకోవ‌డం మానేశారు.. ఇన్నాళ్లు ఎన్ని త‌ప్పులు చేసినా, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో త‌న సూచ‌న‌లు పాటిస్తున్నారు కాభ‌ట్టి, ఏదో ఒక ర‌కంగా ప్ర‌జ‌ల‌కి మంచి జ‌రుగుతుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న ప‌వ‌న్‌., ప‌చ్చ ప్ర‌భుత్వ పంధా మార‌డంతో, తాను పంధా మార్చుకున్నారు..

వాస్త‌వానికి ప్ర‌జ‌లు ఓ స‌మ‌స్య‌ను త‌న ముందు ఉంచిన‌ప్పుడు., ముందుగా ఆ స‌మ‌స్య ఏ శాఖ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉందో, ఆ శాఖ‌కి సంబంధించిన మంత్రి-అధికారుల‌కి స‌మ‌స్య‌ని విపులంగా వివ‌రిస్తూ ప‌రిష్క‌రించాలంటూ జ‌న‌సేన పార్టీ నుంచి లేఖ‌లు రాసే వారు.. ఆ లేఖ‌లు వారికి చేరాక‌., ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంది అన్న అంశాన్ని ఫాలోఅప్ చేసే వారు.. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో జ‌న‌సేన అధినేత విజ‌య‌వాడ రాగా., ఆయ‌న చెంత‌కు 8 స‌మ‌స్య‌లు వ‌చ్చాయి.. అందులో ఫాతిమా కాలేజ్‌, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల స‌మ‌స్య‌, కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్స్‌, సిపిఎస్ ఎంప్లాయిస్ లాంటి స‌మ‌స్య‌లు ఉన్నాయి.. ఇందులో ప్ర‌తి స‌మ‌స్య పైనా ఆయ‌న ప్ర‌భుత్వాలు, అధికారుల‌పై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు..

ఉదాహ‌ర‌ణ‌కి ఫాతిమా మెడిక‌ల్ క‌ళాశాల స‌మ‌స్య‌.. స‌మ‌స్య త‌న దృష్టికి వ‌చ్చిన వెంట‌నే మంత్రి కామినేని శ్రీనివాస్‌, వైద్య ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి పూనం మాల‌కొండ‌య్య‌ల‌తో పాటు మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల‌కి విద్యార్ధులకి న్యాయం చేయాలంటూ లేఖ‌లు రాశారు.. ఇప్పుడు సిపిఎస్ విధానానికి సంబంధించి పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చాక‌., ఉత్త‌రాంధ్ర పోరాట యాత్ర‌లో ఇచ్చాపురం మొద‌టి మీటింగ్ నుంచి చివ‌రి మీటింగ్ వ‌ర‌కు ఉద్యోగుల హ‌క్కులు కాల‌రాసే సిపిఎస్ విధానాన్ని ర‌ద్దు చేయాల‌ని నిన‌దిస్తూనే ఉన్నారు..

Advertisement..

ఉత్త‌రాంధ్ర‌, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా జ‌న‌సేన అధినేత గ్రామీణంలోని కొన్ని కుగ్రామాల‌కి వెళ్లి మ‌రీ అక్క‌డ స‌మ‌స్య‌ల్ని అడ్ర‌స్ చేయ‌డం ద్వారా అడ‌విబిడ్డ‌ల దుస్థితిని ప్ర‌పంచం దృష్టికి తీసుకువ‌చ్చారు.. ఇక ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుపై పోరుబావుటా ఎగుర‌వేసిన జ‌న‌సేనుడు, ఆ ప్రాంతం ఎందుకు, ఎలా వెన‌క్కి నెట్ట‌బ‌డింది అనే అంశంపై లోతైన అధ్య‌య‌నం ప్రారంభించారు.. పోరాటానికి జ‌న‌సైనిక్స్‌ని సిద్ధం చేస్తున్నారు కూడా..

ఫాతిమా మెడిక‌ల్ క‌ళాశాల విద్యార్ధుల త‌రుపున జ‌న‌సేన చేసిన పోరాటానికి విజ‌యం ద‌క్కిన సంద‌ర్బంగా ఈ అంశం ప్ర‌స్థావ‌నార్హం.. సుమారు ఏడు నెల‌ల పోరాటానికి ద‌క్కిన ఫ‌లితం ఇది.. నిట్ ద్వారా అడ్మిష‌న్లు ఇస్తున్న‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది.. స‌మ‌స్య ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దృష్టికి రాక‌పూర్వం, అధికార‌-ప్ర‌తిప‌క్షాల చుట్టూ ఫాతిమా బాధిత విద్యార్ధులు, వారి త‌ల్లిదండ్రులు కాళ్ల‌రిగేలా ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేశారు.. చీత్కారాలు ప‌డ్డారు.. బెధిరింపుల‌కి కూడా గురై, చివ‌రికి రోడ్డెక్కాల్సి వ‌చ్చింది.. ఫాతిమా వ్య‌వ‌హారం త‌న వ‌ద్ద‌కి వ‌చ్చిన‌ప్పుడు స‌మ‌స్య తీవ్ర‌తని భ‌ట్టి వారం రోజుల్లో ప‌రిష్కారం చూపుతాన‌న్న జ‌న‌సేనాని, త‌న శ‌క్తి సామ‌ర్ధ్యాల‌న్ని పెట్టి మ‌రీ పోరాటం చేశారు.. చివ‌రికి ఇప్ప‌టికి విజ‌యం ద‌క్కింది.. చేస్తాం.. చూస్తాం అన్న ప్ర‌భుత్వం మ‌ర‌చింది.. మేమే మెడిక‌ల్ కౌన్సిల్‌కి విజ్ఞ‌ప్తి చేశామ‌న్న విప‌క్షం, అధికారంలోకి వ‌చ్చాక చేస్తామంటూ దాట‌వేసింది.. చివ‌రికి జ‌న‌సేన సాధించింది.. దీంతో మ‌రోసారి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని క‌లిసి కృత‌జ్ఞ‌తాభివంద‌నాలు తెలిపేందుకు విద్యార్ధులు, వారి త‌ల్లిదండ్రులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు..

రేప‌టి నుండి ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌లు మాత్ర‌మే కాదు.. యావ‌త్ ఆంధ్ర దేశంలో ప్ర‌జ‌లు ప‌డుతున్న ప్ర‌తి స‌మ‌స్య‌పై జ‌న‌సేన గ్యారేజ్‌, జ‌న‌సేన అధినేత‌, జ‌న‌సైనిక్స్ ఇదే త‌ర‌హా పోరాటాన్ని అమ‌ల్లో పెట్ట‌నున్నారు.. హ‌మ్‌.. ల‌డేంగే.. హ‌మ్ ల‌డేంగే.. జీత్ నే త‌క్ ల‌డేంగే.. మేము పోరాడుతాం.. పోరాడుతాం.. గెలిచే వ‌ర‌కు పోరాడుతూనే ఉంటాం..

 

Share This:

1,928 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × 1 =