Home / జన సేన / గ్రామ స్థాయిలో గ‌ళం విప్పుదామంటున్న జ‌న‌సైన్యం..

గ్రామ స్థాయిలో గ‌ళం విప్పుదామంటున్న జ‌న‌సైన్యం..

img-20161217-wa0072 img-20161218-wa0005

మాన‌వ‌సేవే మాధ‌వ‌సేవ‌.. ఇందులో సేవ అనే ప‌థాన్ని మార్గంగా ఎంచుకుని జ‌న‌సేన పార్టీని స్థాపించారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ఎదుటివాడి ఆక‌లిని నీ ఆక‌లిగా భావించు.. ప్ర‌జ‌ల క‌ష్టాన్ని నీ క‌ష్టంగా భావించు.. వారి త‌రుపున పోరాడు.. స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌తి స‌గ‌టు మ‌నిషిని బ‌య‌టికి తీసుకురా అంటూ జ‌న‌సేనాని పిలిస్తే., ఆ పిలుపు అందుకున్న జ‌న‌సైన్యం., ప‌వ‌న్ ఇజాన్ని ఆచ‌ర‌ణ‌లో పెడుతూ ముందుకు సాగుతున్నారు.. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని జ‌న‌సేనాని ప్ర‌క‌టించ‌డంతో., అందుకు త‌మ వంతు స‌న్నాహాల్లో మునిగి తేలారు ఔత్సాహిక యువ‌త‌.. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో ఈ ఔత్సాహికుల సంఖ్య భారీగానే ఉంది.. కుల‌,మ‌త‌, వ‌ర్గ, వ‌యో బేధాలు లేకుండా వీరంతా పార్టీని బ‌లోపేతం చేసే క్ర‌మంలో ఒక్క‌తాటిపైకి వ‌స్తున్నారు..

img-20161217-wa0073 img-20161218-wa0003

నియోజ‌క‌వ‌ర్గాలు, మండ‌లాలు, గ్రామాల వారీగా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ., భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ర‌చిస్తున్నారు.. ఇందులో భాగంగా తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్ర‌పురంలో జ‌రిగిన ఔత్సాహికుల భేటీ., వాడీ వేడి చ‌ర్చ‌కు వేదిక అయ్యింది.. స‌మావేశంలో పాల్గొన్న వారంతా యువ‌కులు., న‌డివ‌య‌స్కులే అయిన‌ప్ప‌టికీ జ‌న‌సేన‌ను బ‌లోపేతం చేసే అంశానికి సంబంధించి అంతా చాలా విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు.. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌., గ్రామ స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం ల‌క్ష్యంగా ఈ చ‌ర్చ సాగింది.. గ్రామాల్లో పార్టీ, జ‌న‌సేనాని సిద్దాంతాల‌ను గ‌డ‌ప గ‌డ‌ప‌కూ తీసుకువెళ్ల‌గ‌లిగితే విజ‌యం సిద్ధించిన‌ట్టేన‌ని ప‌లువురు ఔత్సాహికులు అభిప్రాయ‌ప‌డ్డారు.. పార్టీ కూడా ఇలాంటి అభిప్రాయాల‌కు విలువ‌నిస్తూ., ఎలాంటి త‌ర‌త‌మ బేధాలు లేకుండా అంద‌ర్నీ క‌లుపుకుపోవాల‌ని భావిస్తుంద‌న్న విష‌యాన్ని ప‌లువురు గుర్తుచేశారు..

Share This:

455 views

About Syamkumar Lebaka

Check Also

12 అంశాల‌తో జ‌న‌సేన విజ‌న్ డాక్యుమెంట్‌.. సాహ‌సోపేత నిర్ణ‌యాలే సాధ్య‌మేన‌న్న జ‌న‌సేనుడు..

జ‌న‌సేన పార్టీ మేనిఫెస్టో ఎలా వుండోబోతోంది.. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, ప్ర‌జా సంక్షేమం మేళ‌వింపుగా జ‌న‌సేనుడు చేప‌ట్ట‌నున్న విజ‌న్ ఎలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − 16 =

%d bloggers like this: