Home / పవన్ టుడే / గ‌ల్లా ప్రొడ‌క్ష‌న్స్‌.. ”క‌బ్జాకోరులు-కార్పొరేట్ కోట‌లు”.. వినుడు వినుడు ‘వ‌న్ డే స్టార్’ గ‌ల్లా’ వారి వీర‌ గాధ‌…

గ‌ల్లా ప్రొడ‌క్ష‌న్స్‌.. ”క‌బ్జాకోరులు-కార్పొరేట్ కోట‌లు”.. వినుడు వినుడు ‘వ‌న్ డే స్టార్’ గ‌ల్లా’ వారి వీర‌ గాధ‌…

అన‌గ‌న‌గా ఓ యువ పార్ల‌మెంటు స‌భ్యుడు.. తొలి ప్ర‌య‌త్నంలోనే పార్ల‌మెంటుకి ఎన్నికైన ఘ‌నుడు.. స్వ‌త‌హాగా కార్పొరేట్ శ‌క్తి అయిన స‌ద‌రు ఎంపిగారు, ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఏం చేశార‌న్న‌ది లోక‌విదితం.. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం ఉన్న 12 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌లో ఆరు ల‌క్ష‌ల మందికి పైగా ఓట‌ర్లు త‌మ బ‌తుకులు బాగు చేస్తాడ‌న్న న‌మ్మ‌కంతోనో లేక వారిచ్చిన కాసుల‌కి క‌క్కుర్తిప‌డో., న‌యానో, భ‌యానో ఓటేసి గెలిపించేశారు.. తీరా గెలిచాక స్వ‌త‌హాగా కార్పొరేట్ శ‌క్తి అయిన ఆ ఎంపిగారు, కార్పొరేట్ సిఈవో మాదిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కి ఏడాదికోసారి మాత్ర‌మే ద‌ర్శ‌న‌భాగ్యం క‌లిగించడం మొద‌లు పెట్టారు.. ఆ ద‌ర్శ‌నం కూడా ఎంపిక చేసిన వారికి మాత్ర‌మే.. సామాన్య ప్ర‌జానికం ఈ మ‌ధ్య గుంటూరు ఎంపి అదృశ్యం అంటూ ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చారు.. స్టోరీలో చెప్పుకోవాల్సిన అస‌లు పాయింట్ ఇంకోటుంది.. పార్ల‌మెంటు స‌భ్యుడిగా గెలిచిన నాలుగేళ్ల త‌ర్వాత‌, అంటే సుమారు 1460 రోజుల త‌ర్వాత ఒక్క‌టంటే ఒక్క‌సారి రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం., పార్ల‌మెంటులో త‌న‌కు వ‌చ్చిన భాష‌., అదే ఆంగ్లంలో రెండు ముక్క‌లు మాట్లాడేశారు.. అదీ హాట్ టాపిక్ ప్ర‌త్యేక హోదా అంశంపై., కూల్‌గా ఓ చిన్న‌మాట‌.. అంతే స్వ‌త‌హాగా రాజ‌కీయానుభ‌వం ఉన్న స‌ద‌రు ఎంపిగారి త‌ల్లికి పుత్రోత్సాహం క‌లిగింది.. బెజ‌వాడ నుంచి మొద‌లు పెట్టి భారీ ఊరేగింపులు., ఉత్స‌వాలు.. జ‌నం న‌వ్విపోతున్నార‌న్న క‌నీస స్పృహ., ఎందుకు ఈ విజ‌య‌యాత్ర‌లు అన్న నైతిక‌త మ‌ర‌చి, అనుంగ మీడియాలో పెద్ద పెద్ద కాల‌మ్స్ క‌వ‌ర్ అయ్యేలా ఫోటోలు, వార్త‌లు.. జ‌నానికి విష‌యం ఇప్ప‌టికే అర్ధ‌మైపోయి ఉంటుంది.. మ‌నం చెప్పుకునేది ఆయ‌న గురించే., మ‌న గుంటూరు ఎంపి గ‌ల్లా జ‌య‌దేవ్ మ‌హ‌రాజ్ గారి గురించి..

క‌ట్ చేస్తే.. పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టంటే ఒక్క ప్ర‌జా స‌మ‌స్య ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు.. నాలుగేళ్ల‌లో ప్ర‌జ‌ల కోసం ఒక్క‌సారి మాత్ర‌మే పార్ల‌మెంటులో నాలుగు ఇంగిలీసు ముక్క‌లు మాటాడేసి., వ‌హ్వా.. వ‌హ్వా అనిపించేసుకున్న మ‌న సోకాల్డ్ గుంటూరు ఎంపి గ‌ల్లా ఈ మ‌ధ్య కాలంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ల‌క్ష్యంగా చౌక‌బారు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.. అయ్యా జ‌య‌దేవ్‌గారు ముందుగా మీరు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కి బ‌దులుగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల త‌రుపున కొన్ని ప్ర‌శ్న‌లు.. అందులో మొద‌టిది ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని విమ‌ర్శించే అర్హ‌త మీకుందా..? జ‌నం స‌మాధుల మీద కోట్ల‌కి కోట్లు కోట‌లు క‌ట్టుకుంటే వ‌చ్చే స్థాయి గురించి ఎవ్వ‌రూ మాట్లాడ‌టం లేదు.. మిమ్మ‌ల్ని, మీ పార్టీని గెలిపించేందుకు ఎలాంటి ప్ర‌త్యుప‌కారం ఆశించ‌కుండా గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన జ‌న‌సేన అధినేత‌., ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల త‌రుపున ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన సంద‌ర్బాలు ఎన్నో మీకు తెలుసా..? రాజ‌ధానికి భూములు కోల్పోయిన రైతుల వ్య‌వ‌హారం ద‌గ్గ‌ర్నుంచి నిన్న‌మొన్న‌టి న‌ర్స‌రీ రైతులు, మీ గుంటూరు అతిసార బాధితుల వ‌ర‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌రిష్కారం చూపిన ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌దుల సంఖ్య‌లో ఉన్నాయ‌న్న‌ది లోక‌విధితం.. ఒక్క‌సారి పార్ల‌మెంటులో నాలుగు ఇంగిలీసు ముక్క‌లు మాట్లాడి విజ‌యోత్సవాలు చేసుకునే మీరెక్క‌డ‌..? ప‌్ర‌జాక్షేత్రంలో ఎన్ని విజ‌యాలు సాధించినా., మ‌రో ప‌రిష్కారానికి మ‌రో ప్ర‌జా స‌మ‌స్య‌ను మాత్ర‌మే వెతుక్కునే జ‌న‌సేనాని ఎక్క‌డ‌.. ఈ ప్ర‌శ్న‌కి ఖ‌చ్చిత‌మైన బ‌దులు మీద‌గ్గ‌రుందా.? ఓట్లేసిన ప్ర‌జ‌లు అతిసారంతో చస్తుంటే చోద్యం చూసిన మీరెక్క‌డ‌., అదే జ‌నం కోసం ప్ర‌భుత్వాన్ని ప‌రుగులు పెట్టించిన ఆయ‌న ఎక్క‌డ‌.. గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి ఆయ‌న్ని విమ‌ర్శించ మీరు త‌గుదురా..?

లీడ‌ర్‌కి-కార్పోరేట్ య‌జ‌మానికి ఉన్న తేడానే మీకు జ‌న‌సేన అధినేత‌కి మ‌ధ్యా ఉంది.. జ‌నానికి సాయం చేయ‌డం కోసం ఉన్న ఇంటిని అమ్ముకున్న జ‌న‌సేనాని., జ‌నం స‌మాధుల మీద కార్పొరేట్ కోట‌లు నిర్మించుకున్న మీరు., రెండూ రెండు దృవాలే.. చేతికి ఏముక‌లేని జ‌న‌సేనుడి దాన‌ధ‌ర్మాల‌కి సాక్ష్యం ఉన్న‌ట్టే., మీ క‌బ్జాల‌కూ సాక్ష్యాలు ఉన్నాయి..

గుంటూరులో అద్దెకిచ్చిన ఇంటిని క‌బ‌ళించిన మీ చ‌రిత్ర‌.. అబ్బో…. అదే స్వ‌యానా ముఖ్య‌మంత్రిగారు సెటిల్ చేశారే, ప‌ద్మ అనే మ‌హిళ ఇంటి క‌బ్జా వ్య‌వ‌హారం గుర్తుకొచ్చిందా..? 20 కోట్ల విలువ చేసే ఇల్లు, మూడు కోట్ల‌కి కాజేసేద్దామనుకుంటే ఎలా గ‌ల్లా వారూ.. ఆశ‌కి కూడా హ‌ద్దు ఉండాలిగా..?


మీరు.. మీ కుటుంబ నిర్వ‌హ‌ణ‌లో ఉన్న గ‌ల్లా సంస్థ‌ల యాజ‌మాన్యం చిత్తూరు జిల్లాలో వేలాది ఎక‌రాల చిన్న‌స‌న్న‌కారు రైతుల భూమిని ఎలా హ‌స్త‌గ‌తం చేసుకున్నారో తెలిపే సాక్ష్యం ఒక‌టి మీ కోసం.. రెడ్డెమ్మ అనే మ‌హిళా రైతు భూమిపై మీ అమ‌ర్‌రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీల క‌న్ను ప‌డ‌డంతో., ఆ భూమి సాగుని అడ్డుకునుందుకు మీ రాజ‌న్న ట్ర‌స్ట్‌ని అడ్డుపెట్టుకుని ఏకంగా ప్ర‌హ‌రీ నిర్మించేసిన సంగ‌తి., మీ ప‌ర‌ప‌తితో అధికారుల చేతులు క‌ట్టేసి మ‌రీ క‌బ్జా చేయ‌డం.. ఆ బాధతో ఆ త‌ల్లి మృతి చెందితే., క‌నీసం ఆమె మృత‌దేహాన్ని సొంత భూమిలో ఖ‌న‌నం చేయ‌నివ్వ‌కుండా అడ్డుకోవ‌డం.. బాధితులు ఆ మ‌హిళా రైతు శ‌వంతో ఏకంగా కలెక్ట‌రేట్ ఎదుట ఆందోళ‌న‌కు దిగ‌డం.. మీరు క‌ట్టిన కార్పొరేట్ మేడ‌లు., ఇలాంటి ఎంత మంది రైతుల స‌మాధుల‌పై క‌ట్టిన‌వో బ‌దులివ్వ‌గ‌ల‌రా..?

రెడ్డ‌మ్మ మృత‌దేహంతో ఆందోళ‌న చేప‌ట్టిన సంద‌ర్బంలో బాధితుల‌కి మ‌ద్ద‌తుగా రంగంలోకి దిగిన జ‌న‌సంఘ్ కార్య‌క‌ర్త‌లు చేసిన ఆరోప‌ణ ప్ర‌కారం., మీ అమ‌ర్‌రాజా గ్రూప్ సంస్థ‌లు చేసిన క‌బ్జా 30 వేల ఎక‌రాలంట‌..? ప్ర‌జ‌ల‌కి ఉప‌యోగ‌ప‌డే రాజ‌కీయాల గురించి మాట్లాడుకునే ముందు క‌బ్జాల‌తో మీరు ఎంత మంది ప్ర‌జ‌ల ఉసురు తీశారో లెక్క చెప్ప‌గ‌ల‌రా..? దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టు లేవు మీ మాట‌లు..

ఇంత‌కీ గ‌ల్లా జ‌య‌దేవ్‌గారు.. జ‌న‌సైన్యం త‌రుపు నుంచి మీకో సూటి ప్ర‌శ్న‌.. మీరు జ‌న‌సేన అధినేత ల‌క్ష్యంగా చేస్తున్న విమ‌ర్శ‌లు తెలుగుదేశం పార్టీ కోసం చేస్తున్న రాజ‌కీయ విమ‌ర్శ‌లా..? లేక ప్ర‌జాప్ర‌యోజనం కోసం చేస్తున్న విమ‌ర్శ‌లా..? ప్ర‌జాప్ర‌యోజ‌నం కోసం విమ‌ర్శ‌లు చేయాలంటే., ప్ర‌త్యేక హోదా కోసం మోడీని ఇంగిలీసులో నిల‌దీశాన‌ని డ‌బ్బాలు కొట్టుకుంటున్న మీరు., కేంద్రం తీరుకి నిర‌స‌న‌గా మీ పార్ల‌మెంటు స‌భ్య‌త్వానికి రాజీనామా చేయండి.. ఓట్లేసిన జ‌నానికి ఏడాదిలో ఒక‌టి రెండుసార్లు క‌న‌బ‌డే మీరు, మీ కార్పొరేట్ కోట‌ల నిర్మాణానికి జనం గుండెల్లో జెండాలు పాతే మీరు.. ప్ర‌జాప్ర‌యోజ‌న‌మే శ్వాస‌గా బ‌తికే జ‌న‌సేనుడిపై విమ‌ర్శ‌లు చేయ‌డం.. సామాన్యుడికి కూడా వెగ‌టు పుట్టిస్తోంది.. ముందు నిబ‌ద్ద‌త‌తో కూడిన రాజ‌కీయాలు అంటే ఏంటో పూర్తిగా తెలుసుకుని ఆ త‌ర్వాత రాణించండి.. గుంటూరు ఎంపి గ‌ల్లా వారికి జ‌న‌సైన్యం ఇస్తున్న ప‌వ‌ర్ పంచ్ ఇది..

Share This:

7,567 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + 4 =