Home / పవన్ టుడే / చంద్ర‌బాబుకీ ప‌వ‌ర్ పంచ్‌..

చంద్ర‌బాబుకీ ప‌వ‌ర్ పంచ్‌..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీ సిఎం చంద్ర‌బాబుని ఎందుకు విమ‌ర్శించ‌డం లేదు..? అవును చంద్ర‌బాబు కూడా ప‌వ‌న్‌ని ఏమీ అన‌డం లేదు.. ఇద్ద‌రి మ‌ధ్యా ఏమైనా ఒప్పందం ఉందా..? ఇలాంటి ఊహాగానాలు, అనుమానాలు అనంత స‌భ‌తో ప‌టాపంచ‌లైపోయాయి.. టీడీపీ అధినేత‌, సిఎం చంద్ర‌బాబుపై ప‌వ‌ర్ పంచ్‌లు పేలాయి.. గ‌త ఎన్నిక‌ల్లో మీ కోసం ప్ర‌చారం చేశాన‌న్న హ‌క్కుతో అడుగుతున్నా.. అంటూ మొద‌లు పెట్టిన ప‌వ‌న్‌., ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు ఏం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.. టీడీపీపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పోయింద‌ని., పాల‌న మొత్తం అవినీతి మ‌యంగా మారింద‌ని తెలిపారు.. నా కుటుంబాన్నిఇ కాద‌ని నేను మీకు మ‌ద్ద‌తు ప‌లికితే., మీరు మీ అనుంగుల‌ని అంద‌లం ఎక్కిస్తున్నారు.. వారిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చినా., కాపాడుతూ వ‌స్తున్నారు..

ఇది క‌రెక్ట్ కాద‌న్నారు ప‌వ‌న్‌.. ఓ వ‌ర్గానికో.., కులానికో మ‌ద్ద‌తు ఇస్తారా..? అంద‌రికీ అండ‌గా నిల‌వాల్సిన బాధ్య‌త మీకు లేదా అంటూ గ‌ర్జించారు ప‌వ‌న్‌.. ఇలాగే మీపై ఆరోప‌ణ‌లు వ‌స్తే.. నా త‌ర్వాతి ల‌క్ష్యం మీరే అవుతారంటూ జ‌న‌సేనాని హెచ్చ‌రించారు..

సింగ‌పూర్‌.. సింగ‌పూర్ అంటూ చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌చారంపైనా సెటైర్లు వేశారు.. సింగ‌పూర్ అంటే న‌గ‌రం నిండా భ‌వ‌నాలు ఉండ‌టం కాదు.. అభివృద్ది అంత‌కంటే కాదు.. ఓ సారి ఆత్మ‌ప‌రిశోధ‌న చేసుకోండని ప‌వ‌ర్‌స్టార్ సూచించారు.. రాజ‌ధాని కేవ‌లం డ‌బ్బున్న‌వారికేనా అంటూ ప్ర‌శ్నించారు.. మీరు మారండి.. మీ పిల్ల‌ల్ని మార్చుకోండ‌న్నారు..

ఈ ఎపిసోడ్‌లో చంద్ర‌బాబుకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన ప‌వ‌ర్‌స్టార్‌.. త‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న వారిని టార్గెట్ చేశారు..

Share This:

724 views

About Syamkumar Lebaka

Check Also

వ‌రుస‌గా రెండో రోజూ సామాన్యుడి గ‌డ‌ప త‌ట్టిన జ‌న‌సేనుడు.. దూసుకుపోతున్న త‌రంగం..

జ‌న‌సేన త‌రంగం.. ప్ర‌తి ఇంటికి జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు చేర్చే క్ర‌మంలో రూపొందించిన కార్య‌క్ర‌మం.. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × one =