Home / జన సేన / చిత్తూరులో పూల ఉప్పెనై వ‌ర్షించిన అభిమాన‌సంద్రం.. పిడికిలితో జ‌న‌సేనుడి సింహ‌నాదం..

చిత్తూరులో పూల ఉప్పెనై వ‌ర్షించిన అభిమాన‌సంద్రం.. పిడికిలితో జ‌న‌సేనుడి సింహ‌నాదం..

ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న‌లు లేవు.. ఆయ‌న బ‌య‌టికి వ‌చ్చే కొన్ని గంట‌ల ముందు వ‌ర‌కు రోడ్ షో అన్న ఊసే లేదు.. ప్ర‌జ‌ల కోసం ఆయ‌న రోడ్డెక్కారు.. ఆయ‌న కోసం జ‌నం రోడ్డెక్కారు.. ఇసుక వేస్తే రాల‌నంత‌గా ర‌హ‌దారులు నిండిపోగా ., రోడ్డుకి ఇరువైపులా ఉన్న భ‌వ‌నాలు, చెట్లు సైతం అభిమాన‌గ‌ణంతో నిండిపోయాయి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మంగ‌ళ‌వారం చిత్తూరు ప‌ర్య‌ట‌న తాలూకు వివ‌రాలు ఇవి.. ఉద‌యం శ్రీకాళ‌హ‌స్తీస్వ‌రుడి ద‌ర్శించేందుకు జ‌న‌సేనుడు వెళ్ల‌గా., ఆయ‌న ద‌ర్శ‌నానికి అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు బారులు తీరారు.. దీంతో ఆల‌య ప్రాంగ‌ణం కిక్కిరిసిపోయింది..

అనంత‌రం ప్ర‌జ‌లకి ఇచ్చిన మాట కోసం హైరోడ్డు భూనిర్వాసితుల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ఆయ‌న రోడ్డెక్క‌గా, ఆయ‌న‌కి మ‌ద్ద‌తుగా ఆయ‌న కంటే ముందుగా జ‌న‌వాహిని రోడ్డుమీద‌కి వ‌చ్చింది.. జ‌న‌సేనుడ్ని క‌ళ్లారా చూడాల‌న్న కోరిక‌తో కొన్ని వేల మంది వ‌స్తే., హైరోడ్డు నిర్వాసితుల‌కి అండ‌గా నిలిచేందుకు వ‌చ్చిన జ‌న‌సేన అధినేత‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు, ఆయ‌న‌తో గొంతు క‌లిపేందుకు మ‌రికొంత మంది త‌ర‌లి వ‌చ్చారు..

స్థానిక గాంధీ సెంట‌ర్ నుంచి జ‌న‌సేన అధినేత వాహ‌న శ్రేణికి జ‌నం అడుగ‌డుగునా పూల వ‌ర్షంతో నీరాజ‌నాలు ప‌లికారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వాహ‌నం పూర్తిగా పూల‌తో త‌డిసి ముద్ద‌య్యింది.. ఇక ఆయ‌న వాహ‌నం పైకి వ‌చ్చినప్పుడు అయితే ఓ పూల కొండ అభిమానంగా మారి ఆయ‌న‌పై విరుచుకుప‌డింది.. త‌మ స‌మ‌స్యలు తీర్చ‌డానికి వ‌చ్చిన దేవుడిగా జ‌నం ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని ప్ర‌స్తుతించారు.. జాతీయ జెండా చేత‌బూని ఆయ‌న స‌ర్వ‌స‌మైక్య‌త‌ని చాటుతూ ముందుకి క‌ద‌ల‌గా., జ‌నం పెద్ద పెట్టున నినాదాలు చేశారు..

త‌న‌కు మ‌ద్ద‌తుగా త‌ర‌లివ‌చ్చిన అభిమాన సంద్రాన్ని చూసి ఉప్పొంగిన జ‌న‌సేన అధినేత త‌న పిడికిలి భిగించి విజ‌యనాదం చేశారు.. చిత్తూరు రోడ్ షో దృశ్యాల‌ని ప‌చ్చ మీడియా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల మాటున దాచిపెట్టినా., ఎప్పుడూ క‌వ‌ర్ చేయ‌ని ప‌చ్చ ప‌త్రిక‌లు క‌వ‌రేజ్ ఇవ్వ‌డం కొస‌మెరుపు.. ఇది క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావ‌మేన‌ను కుంటా..?

Share This:

1,772 views

About Syamkumar Lebaka

Check Also

క‌వాతు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కాదు.. బాధ్య‌త‌గా ఉండ‌మ‌ని హెచ్చ‌రిక‌-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ క‌వాతు సూప‌ర్ స‌క్సెస్‌తో ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతుంటే., జ‌న‌సేనాని మాత్రం త‌న బాధ్య‌త‌ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × 2 =