Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / చిత్త‌కార్తి చింత‌మ‌నేని.. టీడీపీ పాలిట నువ్వో ”చింత‌ల‌”నేని..

చిత్త‌కార్తి చింత‌మ‌నేని.. టీడీపీ పాలిట నువ్వో ”చింత‌ల‌”నేని..

15589938_1061735583937321_4120775808245644723_n 15622324_1061735530603993_2092936653204638886_n

కంటెంట్ ఉన్న‌వాడి క‌టౌట్ పెట్టుకుంటే చాలు గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క అని ఆ నాడు భావించారు.. మీ పార్టీల ఆఫీసుల ఎదుట‌., మీ ప్ర‌చారపు కాన్వాయ్‌ల వెంట, మీ ఇళ్ల ముందు, కార్ల మీద కూడా స‌ర్ధార్ క‌టౌట్లు పెట్టేసుకున్నారు.. ఆ క‌టౌట్ పెట్టుకోవ‌డానికి స్వ‌యానా మీ పార్టీ అధినాయ‌కుడు, ఆయ‌న కుమారుడు కూడా జ‌న‌సేనాని ఇంటికి వెళ్లి మ‌రీ కాళ్లుగ‌డ్డాలు ప‌ట్టుకుని బ‌తిమ‌లాడారు.. ఓడిపోతుంద‌నుకున్న పార్టీ కాస్తా గెలిచేసింది.. ప‌వ‌న్ వ‌ల్లే గెలిచామ‌ని మీ నాయులంతా మైకుల ముందు., టీవీ చాన‌ల్ల సాక్షిగా ప‌బ్లిక్‌గా ఒప్పుకున్నారు.. మీ ప్ర‌త్య‌ర్ధులు కూడా మీమ్మ‌ల్ని విమ‌ర్శించే ముందు, వెనుక ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌చారానికి రాక‌పోతేనా అనే ప‌దాన్ని ప‌దే ప‌దే వాడుతున్నారు..

ఆనాడు ప్ర‌జాక్షేత్రంలో చావు త‌ప్పించుకునేందుకు జ‌న‌సేనాని, ఆయ‌న క‌టౌట్ కావాల్సి వ‌చ్చాయి.. మ‌రి ఇప్పుడో.. ఏరుదాటాక తెప్ప‌గ‌లేసేశారు.. రాజ‌కీయాలు అంటే కేవ‌లం రౌడీయిజం అని భావించే దెందులూరు శాస‌న‌స‌భ్యుడు చిత్త‌కార్తి(చింత‌మ‌నేని)ప్ర‌భాక‌ర్ నోటి దూల ఇప్పుడు జ‌న‌సేనానిపై తీర్చుకుని తిట్లు తింటున్నారు.. ఇత‌న్ని చూస్తే సంస్కారం అన్న ప‌దం సిగ్గుప‌డుతుంది.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నిచేస్తున్న ఉద్యోగుల ప‌ట్ల ఈయ‌న‌గారి తీరే అందుకు నిద‌ర్శ‌నం.. మ‌హిళా అధికారిపై చేయి చేసుకుని.., పార్టీకి త‌ల‌బొప్పికట్టించిన ఉదంతం ద‌గ్గ‌ర్నుంచి., లా అండ్ ఆర్డ‌ర్ కాపాడే పోలీసుల‌పైకి దూసుకువెళ్ల‌డం వ‌ర‌కు చింత‌మ‌నేని దూర్త‌త్వం., సిఎంనే చిక్కుల్లో ప‌డేసింది.. త‌నను తాను మ‌ద‌పుటేనుగుగా భావించే దెందులూరు ఎమ్మెల్యే., క‌ట్ట‌డిచేయ‌డం ఎవ‌రిత‌రం కాద‌న్న పొగ‌రుతో మిడిసి ప‌డుతుంటారు.. కెమెరాలు చూస్తున్నాయ‌న్న భ‌యం కూడా లేకుండా జ‌ర్న‌లిస్టుల‌పై దాడికి తెగ‌బ‌డ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌నం…

15665681_1285717141490103_2235846777667125614_n

ఇంత‌టి సంస్కారం ఉన్న వ్య‌క్తికి జ‌నం ఓట్లెలా వేశారు..? అన్న అనుమానం వ‌స్తుందా.. పైగా త‌న చేష్ట‌ల‌తో జ‌నాన్ని విసిగించే ఈయ‌న‌గారికి 2009తో పోలిస్తే., 2014లో 30 వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి కూడా.. ఈ ఓట్ల‌న్ని జ‌నం త‌న తుగ్ల‌క్ సంస్కృతికి మెచ్చి వేసిన‌వేన‌న్న‌ది ఈయ‌న ఫీలింగ్‌.. చింత‌మ‌నేని ఆ వీడియో జ‌ర్న‌లిస్టుతో మాట్లాడ‌డే ముందు రోజు గాని., వెనుక రోజుగాని అమావ‌స్యో, పౌర్ణ‌మో ఉండి ఉంటాయన్న‌ది జ‌నం ఫీలింగ్‌.. ఇప్ప‌టికీ జ‌న‌సేనాని పుణ్యంతోనే గ‌ట్టెక్కామ‌ని భావిస్తున్న టీడీపీ అధినాయ‌క‌త్వం., ఆయ‌న గురించి నోరుమెదిపే సాహ‌సం కూడా చేయ‌డం లేదు.. నిత్యం ఏదో ఒక వివాదంతో పార్టీకి త‌ల‌బొప్పి క‌ట్టించే చింత‌మ‌నేని., ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ని ట‌చ్ చేయ‌డంతో., ఏం వైప‌రిత్యం దాపురిస్తుందోన‌ని బాబుగారి బ్యాచ్ కంగారు ప‌డుతున్నారంట‌..

Share This:

1,447 views

About Syamkumar Lebaka

Check Also

టార్గెట్ జేడీ మిస్ ఫైర్‌.. టాపిక్ డైవ‌ర్ట్ చేసిన విజ‌య‌సాయి(ఏ2)..

వెనుక‌టికి ఒక‌మ్మ రంకు బ‌య‌ట‌ప‌డిందని బొంకు మొద‌లుపెట్టిందంట‌..! అలా ఉంది వైసీపీ త‌ప్పుడు లెక్క‌ల ఆడిట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి ప‌రిస్థితి.. అధికారిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × 5 =