Home / ఎడిటోరియల్స్ / చివ‌రి రోజు చేరిక‌ల‌తో జ‌న‌సేన ఉత్త‌రాంధ్ర పోరాట‌యాత్ర ప‌రిపూర్ణం..

చివ‌రి రోజు చేరిక‌ల‌తో జ‌న‌సేన ఉత్త‌రాంధ్ర పోరాట‌యాత్ర ప‌రిపూర్ణం..

 

ప్ర‌త్యేక హోదా-విభ‌జ‌న, ఎన్నిక‌ల హామీల సాధ‌న‌, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం ల‌క్ష్యంగా సుమారు 45 రోజుల క్రితం పోరాట‌యాత్ర ప్రారంభించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ఉత్త‌రాంధ్ర టూర్‌ని దిగ్విజ‌యంగా పూర్తి చేశారు.. ఇచ్చాపురం నుంచి పాల‌కుల ప్ర‌జా కంఠ‌క విధానాల‌పై త‌న పోరాటాన్ని మొద‌లు పెట్టిన జ‌న‌సేనాని., ఈ నెల‌న్నర స‌మ‌యంలో ఎన్నో స‌మ‌స్య‌ల్ని ద‌గ్గ‌ర్నుంచి అధ్య‌య‌నం చేశారు.. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల విష‌యంలో పాల‌కుల నిర్ల‌క్ష్యానికి నిర‌స‌న‌గా ఒక రోజు నిర‌స‌న దీక్ష చేప‌ట్టిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, సోంపేట బేల భూముల రైతుల్ని, వంశ‌ధార నిర్వాసితుల‌ను, కొవ్వాడ అణువిద్యుత్ పోరాట స‌మితితో పాటు ర‌సాయినిక ప‌రిశ్ర‌మ‌ల కాలుష్యం భారిన ప‌డి ఇబ్బందులు ప‌డుతున్న వారిని, ప్ర‌భుత్వం చేప‌డుతున్న భూ దోపిడిలో భాగంగా నిర్వాసితులుగా మిగిలిన ప్ర‌జ‌ల్ని క‌లిసి వారి క‌ష్టాలు స్వ‌యంగా విని తెలుసుకున్నారు.. ఆయా స‌మ‌స్య‌ల‌కు త‌న గ‌ళ బ‌లాన్నిచ్చి, ప్ర‌పంచం దృష్టికి తీసుకువెళ్లారు..

ఇక విజ‌య‌న‌గ‌రం జిల్లా వెనుక‌బాటుని ముఖ్యంగా కురుపాం, పార్వతీపురం నియోజ‌క‌వ‌ర్గాల‌కి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ పెద‌పెంకి లాంటి గ్రామ‌ల్లో ఇంటికి ఒక‌రు మంచాన ప‌డిన వైనాన్ని, భోగాపురం విమానాశ్ర‌యం పేరుతో ప‌చ్చ చొక్కాలు సాగించిన దోపిడిని, చీపురుప‌ల్లి ప్రాంతంలో ఫెర్రో అల్లాయిస్ కంపెనీల్లో కార్మికుల క‌ష్టాలు, ముడిస‌రుకు దోపిడీల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ధ్వ‌జ‌మెత్తారు.. తాటిపూడి, తోటప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ల నీటిని రైతుల‌కి అంద‌కుండా చేస్తున్న ప్ర‌భుత్వ విధానాల‌పై విమ‌ర్శనాస్త్రాలు సంధించారు.. ప్ర‌జ‌లు ప‌డే ఎలాంటి స‌మ‌స్య‌పై పోరాటానికైనా జ‌న‌సేన పార్టీ అండ‌గా నిల‌బ‌డుతుంద‌ని హామీ ఇచ్చారు..

విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న ఏజెన్సీ ప్రాంతం నుంచి మొద‌లు పెట్టిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., మూరు మూల గిరిజ‌న గ్రామాల‌కు వెళ్లి, అక్క‌డ ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను చూసి చ‌లించిపోయారు.. అడ‌వి బిడ్డ‌ల్ని పాల‌కులు క‌నీసం మ‌నుషులుగా సైతం గుర్తించ‌క‌పోవ‌డం ప‌ట్ల ఆవేధ‌న వ్య‌క్తం చేశారు.. పర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కి వ్య‌తిరేకంగా బాక్సైట్ త‌వ్వ‌కాలు చేప‌డితే., గిరిజ‌నుల ప‌క్షాన పోరాటానికి సిద్ధ‌మ‌ని హెచ్చ‌రించారు.. క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌ని ప్ర‌భుత్వాల తీరుని ఎండ‌గ‌ట్టారు.. మాడుగుల‌, న‌ర్సీప‌ట్నం మీదుగా పాయ‌క‌రావుపేట వ‌చ్చిన జ‌న‌సేన అధినేత‌., ప్ర‌తి ప్రాంతంలో ప్ర‌జ‌ల ఇబ్బందుల్ని, ముఖ్యంగా సెజ్‌ల పేరుతో జ‌రుగుతున్న భూదోపిడిపై నిల‌దీశారు.. తుంపాల షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ కార్మికులని ప‌లుక‌రించి., వారి దైన్య‌గాధ‌లు విన్న ఆయ‌న‌., సంక్షేమ నిధికి త‌న‌వంతుగా రెండు ల‌క్ష‌ల రూపాయిలు అందించారు.. విశాఖ పోర్టు ఏరియా కాలుష్యం, భూ క‌బ్జాలు లాంటి అధికార‌దుర్వినియోగాల‌పై త‌న వాణిని వినిపించారు.. బాధితుల‌కి జ‌న‌సేన పార్టీ త‌రుపున భ‌రోసా ఇచ్చారు..


ఆ క్ర‌మంలో జ‌న‌సేనుడు ఉత్త‌రాంధ్ర మేధావుల మ‌న‌సులు దోచాడు.. తూర్పు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు.. ఏడు ప‌దులు దాటిన స్వ‌తంత్ర భార‌తావ‌నిలో మొద‌టిసారి ఓ నాయ‌కుడు ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌చేందుకు ముందుకు వ‌చ్చాడ‌న్న విష‌యాన్ని ఉత్త‌రాంధ్రులు తెలుసుకున్నారు. త‌మ వెనుక‌బాటుని పార‌ద్రోలేందుకు వ‌చ్చిన జ‌న‌సేనుడి ప‌క్షాన నిల‌వాల‌ని డిసైడ్ అయిపోయారు..

జ‌న‌సేన అధినేత ఉత్త‌రాంధ్ర మేధావులు, ప్ర‌జ‌ల మ‌న‌సులే కాదు.. ప్ర‌జాక్షేమం కోరే నాయ‌కులు, విద్యావేత్త‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు, మ‌హిళా మ‌ణులు, క్రీడాప్ర‌ముఖుల‌తో పాటు వివిధ వ‌ర్గాల‌ను త‌న ఖాతాలో చేర్చేసుకున్నారు.. రంజాన్ అనంత‌రం మొద‌లైన మ‌లివిడ‌త పోరాట‌యాత్ర‌లో వీరంతా జ‌న‌సేన ఖాతాలో చేరిపోయారు.. విశాఖ న‌గ‌రంతో పాటు ఉత్త‌రాంధ్ర‌కి చెందిన ప్ర‌ముఖులు విడ‌త‌ల వారీగా జ‌నసేన తీర్ధం పుచ్చుకున్నారు.. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న చివ‌రి రోజు వ‌ర‌కు ఈ చేరిక‌లు కొన‌సాగాయి..

ఆదివారం విశాఖ న‌గ‌రంలోని ఎస్‌.క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో సుర‌క్ష గ్రూప్ చైర్మ‌న్ డాక్ట‌ర్ బొడ్డేప‌ల్లి ర‌ఘు, బొడ్డేప‌ల్లి శ్రీరాంమూర్తి, గంప‌ల గిరిధ‌ర్‌, డాక్ట‌ర్ మౌనితేజ మ‌హారాజ్‌, చింత‌ల ర‌మ‌ణ‌, డాక్ట‌ర్ ఐ.ప్ర‌కాష్‌, బి.జ‌య‌రాజ్‌, కోరాడ స‌ర్వేస్వ‌ర‌రావు, రాకేష్ మ‌హాదేవ్‌, ప‌సుపులేటి రామారావుల‌తో పాటు వారి అనుచ‌రులు పార్టీ కండువాలు కప్పుకున్నారు.. ఈ చేరిక‌లు విశాఖ జిల్లాలోని దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల నుండి కొన‌సాగాయి.. జిల్లా రాజ‌కీయాల్లో త‌మ‌దైన పాత్ర వేయ‌గ‌ల స‌త్తా ఉన్న మేధావి వ‌ర్గం, రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు విద్యావేత్త‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు, క్రీడాకారులు, విశాఖ‌లో కీల‌కమైన మ‌రో వ‌ర్గం ఉత్త‌ర‌భార‌తీయులు అంతా జ‌న‌సేన‌కు జై కోట్టేశారు.. ఆఖ‌రుకి మొన్న‌టి వ‌ర‌కు దేశ ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు నిర్వ‌హించిన మాజీ సైనికులు సైతం జ‌న సేన‌లో చేర‌డం పార్టీ ఏ స్థాయిలో జ‌నం న‌మ్మ‌కం చొర‌గొంద‌న్న విష‌యాన్ని తెలియ‌చేస్తోంది.. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే., 2019కి ముందే ఉత్త‌రాంధ్రులు జ‌న‌సేన విజ‌యాన్ని ఖాయం చేసేశారు..

Advertisement..

Share This:

2,116 views

About Syamkumar Lebaka

Check Also

పెనుగొండ‌ని శ్రీ వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ‌గా మారుస్తాం-జ‌న‌సేనాని..

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పెనుగొండ ఊరి పేరును ‘శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ’గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 5 =