Home / జన సేన / చురుగ్గా JFC(Joint Fact Finding Committee) ఏర్పాటు ప్ర‌క్రియ‌.. ట్విట్ట‌ర్‌లో లోగో ఆవిష్క‌రించిన జ‌న‌సేనాని..

చురుగ్గా JFC(Joint Fact Finding Committee) ఏర్పాటు ప్ర‌క్రియ‌.. ట్విట్ట‌ర్‌లో లోగో ఆవిష్క‌రించిన జ‌న‌సేనాని..

విభ‌జ‌న హామీలు-వాటి అమ‌లు వ్య‌వ‌హారంలో కేంద్ర-రాష్ట్ర ప్ర‌భుత్వాల భిన్న‌వాద‌ల‌పై నిగ్గు తేల్చేందుకు., ప్ర‌జ‌ల‌కి నిజానిజాలు వివ‌రించేందుకు జ‌న‌సేన అధినేత ప్ర‌తిపాధించిన JFC(Joint Fact Finding Committee) ఏర్పాటు ప్ర‌క్రియ చురుగ్గా సాగుతోంది.. ఇప్ప‌టికే కమిటీలో కీల‌క స‌భ్యులు జ‌న‌సేనాని ఎంచుకున్న జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌ల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు ముగిశాయి.. ఇక మిగిలిన స‌భ్యులతో సంప్ర‌దింపులు-పేర్ల ప్ర‌క‌ట‌న‌కి సంబంధించిన చ‌ర్చ‌లు కూడా సాగుతున్నాయి.. సుముఖత వ్య‌క్తం చేసిన స‌భ్యుల పేర్లు ఒక‌టి,రెండు రోజుల్లోనే జ‌న‌సేన అధినేత ప్ర‌క‌టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. అటు JFC(Joint Fact Finding Committee)కి సంబంధించి లోగోని కూడా జ‌న‌సేనాని సిద్ధం చేయించారు.. త‌న బ్ర‌హ్మాస్త్రం ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా లోగోని కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విడుద‌ల చేశారు.. JFC(Joint Fact Finding Committee)కి సంబంధించిన అన్ని మీటింగుల్లో ఈ లోగోని వాడ‌తారు..

మ‌రోవైపు మిగిలిన కీల‌క స‌భ్యులు కూడా JFC(Joint Fact Finding Committee) ఏర్పాటుకి సంబంధించి త‌మ వంతు క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు.. ఆదివారం జ‌న‌సేన పార్టీ అధినేత‌ని క‌ల‌సిన రాజ‌కీయ వేత్త ఉండ‌వ‌ల్లి., తాజాగా లోక్‌స‌త్తా అధినేత జేపీ, వామ‌ప‌క్ష నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. JFCలో జ‌న‌సేన అధినేత పేర్కొన్న మిగిలిన స‌భ్యుల పేర్లు., వారి వివ‌రాల‌పై లోతుగా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది..

ఇక జ‌న‌సేన అధినేత ఇరువురు నేత‌ల‌తో చ‌ర్చించిన సంద‌ర్భంగా పేర్కొన్న JFC విధివిధానాల‌పై కూడా జేపీ-ఉండ‌వ‌ల్లి చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.. ఇక వామ‌ప‌క్ష నేత రామ‌కృష్ణ కూడా స‌మావేశంలో పాల్గొన్నారు.. JFCలో ఏకైక రాజ‌కీయ‌ప‌క్షంగా ఉన్న వామ‌ప‌క్ష పార్టీల పాత్ర ఏంటి అన్న ప్ర‌స్థావ‌న వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది..

JFC(Joint Fact Finding Committee) ఏర్పాటు వ్య‌వ‌హారంలో జ‌న‌సేన అధినేత దూకుడు పెంచ‌డంతో., కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో అంత‌ర్మ‌ధ‌నం మొద‌లైన‌ట్టు తెలుస్తోంది.. ఇన్నాళ్లు జ‌నానికి మ‌సిపూసి మారేడుకాయ రాజ‌కీయాలు చూపించారు.. ఒక్క‌సారిగా నిజాలు చెప్పాల్సి వ‌చ్చే స‌రికి భ‌య‌ప‌డుతున్నారు.. వ్య‌వ‌హారాన్ని ఎలా దారి మ‌ళ్లించాలి .. జ‌నం దృష్టిని ఏ అంశంపైకి మ‌ళ్లించాలి అన్న ఆలోచ‌న‌ల్లో కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.. అంత క‌ష్ట‌ప‌డే బ‌దులు మీ మాట‌ల్లో నీతి ఉంటే జ‌న‌సేనాని అడిగిన ఆ లెక్క‌లేవో చూపొచ్చుగా..? ఇది ఐదు కోట్ల ఆంధ్రుల డిమాండే నండోయ్‌..

Share This:

1,879 views

About Syamkumar Lebaka

Check Also

అహం బ్రహ్మాస్మి..! (పిట్టల దొరలు అంతే..! పిట్టల దొరలు అంతే..!) అంతేగా..అంతేగా..అంతేగా..

“సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లడం మా భువనేశ్వరితోనే ప్రారంభం అయ్యింది” అంటూ బాబోరు ఉద్ఘాటించారు. అది విన్న ప‌చ్చ మీడియా …

2 comments

  1. I have an idea on present political situation. My mobile no 9440205173.Please share mail id or WhatsApp no

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 1 =