Home / పవన్ టుడే / చేనేతకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా జ‌న‌సేనుడు.. నేత‌న్న క‌ష్టాల‌కు చ‌లించిన ప‌వ‌న్‌..

చేనేతకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా జ‌న‌సేనుడు.. నేత‌న్న క‌ష్టాల‌కు చ‌లించిన ప‌వ‌న్‌..

img-20170117-wa0038

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తి స‌మ‌స్య ప‌రిష్కారానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారారు.. జ‌న‌సేనాని ప‌స‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ఎవ‌రికి ఏ ఇబ్బంది వ‌చ్చినా., జ‌న‌సేనుడికి విన్న‌వించుకుంటే అది తీరిన‌ట్టేనన్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో నానాటికీ బ‌ల‌ప‌డుతోంది.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఏ ఒక్క‌రినీ నిరాశ‌ప‌ర్చ‌డం లేదు.. అంద‌రినీ అక్కున చేర్చుకుంటూ., స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌న‌వంతు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నారు.. హీ ఈజ్ ద రియ‌ల్ లీడ‌ర్ అని నిరూపించుకుంటున్నారు.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో నేత‌న్న‌ల దుర్భ‌ర ప‌రిస్థితుల‌ను చూసి చ‌లించిన ఆయ‌న‌., చేనేత‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు స్వ‌చ్చందంగా ముందుకి వ‌చ్చారు.. ఆ వ‌ర్గానికి త‌న‌వంతు బాస‌ట ప్ర‌క‌టించారు..

img-20170117-wa0042 img-20170117-wa0039

నిత్యం ఆక‌లి చావులు., దుర్బ‌ర స్థితిగ‌తులు.. అరిక‌ట్టే చ‌ర్య‌లు తీసుకోవాల్సిన పాల‌కులు చేతులు ఎత్తేసిన ప‌రిస్థితుల్లో త‌మ‌ను ఆదుకునే నాథుడి కోసం వెతుకున్న చేనేత‌ల‌కు., జ‌న‌సేనుడు ఓ ఆశా జ్యోతిలా క‌నిపించారు.. ఆయ‌న ఎవ‌రి త‌రుపున గొంతెత్తినా., వారి స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుండ‌డంతో., త‌మ గోడు వెళ్లబోసుకునేందుకు తెలుగు రాష్ట్రాల చేనేత కార్మిక సంఘాల స‌భ్యులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని క‌లిశారు.. తెలంగాన చేనేత అఖిల‌ప‌క్ష ఐక్య‌వేదిక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ చేనేత కార్మికుల సంఘం స‌భ్యుల బృందం పార్టీ కార్యాల‌యంలో జ‌న‌సేనానిని క‌లిసి., రెండు రాష్ట్రాల్లో సంభ‌విస్తున్న చేనేత కార్మికుల ఆక‌లి చావుల‌ను ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చారు.. గ‌త రెండున్న‌రేళ్ల కాలంలో ఒక్క తెలంగాణ‌లోనే 45 మంది చేనేత కార్మికులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ ముందుంచారు.. నేత ప‌ని గిట్టుబాటు కాక‌పోవ‌డం., మ‌రే ఇత‌ర ప‌ని చేత‌కాక‌పోవ‌డంతో., నేత‌న్న‌లు త‌నువు చాలిస్తున్నార‌ని., వారి కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయ‌ని తెలిపారు.. ఈ దుస్థితికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల విధానాలే కార‌ణ‌మ‌ని జ‌న‌సేనానికి తెలిపారు..

చేనేత కార్మికుల క‌ష్టాల‌ను సావ‌ధానంగా విన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., వారి క‌ష్టాలు విని ఒకింత ఉద్వేగానికి గుర‌య్యారు.. చేనేత‌లు మ‌న జాతిసంప‌ద అని., వారిని ప‌రిర‌క్షించుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని జ‌న‌సేనాని అభిప్రాయ‌ప‌డ్డారు.. నేత సంఘాల నాయ‌కుల అభ్య‌ర్ధ‌న మేర‌కు తాను చేనేత‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంటాన‌ని స్వ‌చ్చందంగా ప్ర‌క‌టించారు.. చేనేత‌ల‌ను ఆద‌కునేందుకు త‌న శ‌క్తి మేర కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు.. ప‌వ‌న్‌ని క‌లిసిన వారిలో ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు స‌భ్యులు కే ఏ ఎన్ మూర్తి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నేత కార్మిక సంఘా నాయ‌కులు, తెలంగాణ అఖిల‌ప‌క్ష ఐక్య‌వేదిక క‌న్విన‌ర్ కూర‌పాటి ర‌మేష్ త‌దిత‌రులు ఉన్నారు..

img-20170117-wa0041

జ‌న‌సేనాని భ‌రోసాతో నేత‌కార్మిక సంఘాల నాయ‌కులు కూడా సంతృప్తి వ్య‌క్తం చేశారు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రాండ్ త‌మ‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందన్నారు..

Share This:

1,459 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × three =