Home / పెన్ పోటు / చేనేత‌ల నెత్తిన చేతులు పెట్టిన కిష్ట‌ప్ప‌గారూ.. మీ దోపిడికి అడ్డుప‌డ‌తార‌నా జ‌న‌సేనుడిపై ఈ అక్కసు..

చేనేత‌ల నెత్తిన చేతులు పెట్టిన కిష్ట‌ప్ప‌గారూ.. మీ దోపిడికి అడ్డుప‌డ‌తార‌నా జ‌న‌సేనుడిపై ఈ అక్కసు..

s01_mp_37_tdp

పేరుకి పెత్తందారులు.. ప‌నులన్నీ చీక‌టిదారులు.. వాటికి ఎవ‌రైనా ఆటంకం క‌లిగిస్తార‌ని భావిస్తే., అడ్డుతొల‌గించుకోవ‌డానికి ఎంత‌కైనా తెగిస్తారు.. అయితే జ‌న‌సేనానిని నేరుగా ఏం చేయ‌లేరు కాబ‌ట్టి., నోటికొచ్చింద‌ల్లా వాగుతూ జ‌నం చూస్తే ఏమ‌నుకుంటార‌న్న ఇంగితం కూడా మ‌ర‌చి అక్క‌సు వెళ్ల‌గ‌క్కేస్తూ ఉంటారు.. ఈ కోవ‌కే చెందిన వారు గౌర‌వ‌నీయులు హిందూపురం పార్ల‌మెంటు స‌భ్యులు నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌గారు.. ఈ పాల‌కులు త‌మ‌ను ఓటు బ్యాంకుగా మాత్ర‌మే వాడుకుని., ప్ర‌తిసారీ ఓట్లు వేయించుకునే ముందు హామీలు గుప్పించ‌డం., గెలిచిన త‌ర్వాత ఏమీ తెలియ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం.. ఇదే తంతు మ‌రోసారి పున‌రావృతం కావ‌డంతో విసిగిపోయిన చేనేత కార్మికులు., త‌మ గోడు వెళ్ల‌బోసుకోవ‌డానికి జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని ఎంచుకున్నారు..

img-20170117-wa0040 ఆయ‌నైతేనే త‌మ క‌ష్టాలు తీర్చ‌గ‌ల‌డ‌ని న‌మ్మ‌కంతో., తెలుగు రాష్ట్రాల్లోని నేత‌న్నల బృందాలు ఆయ‌న్ని క‌లిసి స‌మ‌స్య‌లు ఏక‌రువు పెట్టారు.. చేనేత‌ల క‌ష్టాలు చూసి వెంట‌నే స్పందించిన జ‌న‌సేనుడు., వారిని ఆదుకునేందుకు త‌న‌కు తానుగా చేనేత‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌క‌టించారు.. త‌ద్వారా చేనేత‌ల వాడ‌కం పెంచే ల‌క్ష్యంతో ముందుకి వ‌చ్చారు.. ప‌వ‌న్ బ్రాండ్ త‌మ స‌మ‌స్య‌ల‌ను కొంత వ‌ర‌కు తీరుస్తుంద‌ని నేత‌కార్మికులు కూడా న‌మ్మ‌కంతో ఉన్నారు…

కానీ అధికార టీడీపీ పార్టీకి చెందిన పార్ల‌మెంటు స‌భ్యుడు నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌కి మాత్రం ప‌ద్మ‌శాలీయులు ప‌వ‌న్‌ని ఆశ్ర‌యించ‌డం న‌చ్చ‌లేదు.. కార‌ణం ప్ర‌తిసారీ క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్పి చేనేత‌ల‌ ఓట్ల‌తో గెల‌వ‌డం.. వారి పేర్ల మీద వ‌చ్చే స‌బ్సిడిలు దోచుకోవ‌డం అల‌వాట‌యిన ఈయ‌న‌గారికి ఇది ఎలా న‌చ్చుతుంది మ‌రి..? ఆనంత బోర్డ‌ర్‌లో ఉన్న ప‌వ‌ర్‌లూమ్స్ లో 90 శాతం కిష్ట‌ప్ప‌గారివేన‌ని టాక్‌.. అంటే ధ‌ర్మ‌వ‌రం త‌దిత‌ర ప్రాంతాల్లో ఉన్న నేత కార్మికుల క‌డుపు కొట్ట‌డంలో., ఈయ‌న‌గారిదే కీల‌క‌పాత్ర‌న్న మాట‌.. ఈ క‌రెంటు మగ్గాల వ‌ల్లే గిట్టుబాటు క‌రువై చేనేత‌లు ఆక‌లి చావులు పెరిగిపోతున్నాయి.. ఇక్క‌డ ఇంకో దారుణ‌మైన విష‌యం ఏంటంటే., కిష్ట‌ప్ప‌గారివి అని చెబుతున్న ఈ వంద‌లాది ప‌వ‌ర్‌లూమ్స్ కూడా ఈ నేత‌న్న‌ల క‌డుపుకొట్టి సంపాధించిన‌వేనంట‌.. స‌బ్సిడిపై వ‌చ్చే క‌రెంటు మ‌గ్గాల‌ను., చేతిలో ఉన్న ప‌వ‌ర్‌తో అటు దారిమ‌ళ్లించార‌ని టాక్‌..

handddhqdefault

ఈయ‌న‌గారు.. వారి నాయ‌కుడు అన్నం పెట్టేవారంట‌.. జ‌న‌సేనుడు ఆకులెత్తేసేవారంట‌.. ప‌వ‌న్ ఆకులు ఎత్తేయ‌డం లేదు.. చేనేత‌ల‌కు వ‌డ్డించిన విస్త‌ర్ల‌ని., నోటికి అంద‌కుండా మీ లాంటి వారు లాక్కుంటుంటే., జ‌న‌సేనాని ఆ అన్నాన్ని వారి నోటికి తిరిగి అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.. ప‌ద్మ‌శాలీయుల అభివృద్ది చంద్ర‌బాబుతోనే సాధ్య‌మ‌ని సెల‌విచ్చిన కిష్ట‌ప్ప‌గారు., గ‌తంలో ఆయ‌న 9 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు., ఇప్పుడు మూడేళ్ల పాల‌న పూర్తి చేసుకోబోతున్న ఆయ‌న‌., పుష్క‌ర కాలం అధికారంలో వారికి ఏమీ చేయ‌లేద‌నే., చేనేత‌లు కొత్త‌నాయ‌కుడి వైపు క‌దిలారు.. ఇన్నాళ్లుగా మీరు., మీ నాయ‌కుడు ఖాదీ వ‌స్త్రాలు ధ‌రిస్తున్నా., ఈ బ్రాండ్‌ని ఇంతైనా ప్ర‌మోట్ చేయ‌గ‌లిగారా..? మీ అంత‌రాత్మ‌ని ఓ సారి ప్ర‌శ్నించుకోండి..? జ‌న‌సేనాని బ్రాండ్ మాత్రం చేనేతల ప‌ట్ల ఆధ‌ర‌ణ పెంచ‌గ‌లిగింది.. ఇది స్వ‌యంగా మీ ప్రాంతంలో నేత‌న్న‌లు ఒప్పుకున్న విష‌య‌మే.. ఇలాంటి నిజాలు జీర్ణించుకోవాలంటే ధైర్యం కావాలి.. అది లేన‌ప్పుడే., ఆ అక్క‌సు ఇలా పిచ్చి ప్రేలాప‌న‌లుగా మారి బ‌య‌టికి వ‌స్తుంది..

s01_mp_37_tdp

ధ‌ర్మ‌వ‌రం ప‌రిస‌రాల్లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ని పెంచి పోషిస్తున్న మీకు., ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఖ‌చ్చిత‌మైన నిబ‌ద్ద‌త ఉన్న జ‌న‌సేనుడిపై విమ‌ర్శ‌లు చేసే స్థాయిలేద‌న్న విష‌యం ముందుగా గ్ర‌హించండి నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌గారు.. జ‌నం ఇలాంటివి చూస్తూ ఊరుకోరు.. మ‌ర్చిపోయా.. ఎవ‌రైనా ఎదురుతిరిగితే., వారిపై దాడులు చేయ‌డానికి మీ రాజ‌కీయ వార‌సుడిగా చెప్పుకునే యువ‌శేఖ‌రుడు ఉండ‌నే ఉన్నాడుగా.. అయినా చేనేత కార్మికుల త‌రుపున మీకు ఓ హెచ్చ‌రిక‌.. మీ త‌ప్పులు దిద్దుకునేందుకు మీకున్న స‌మ‌యం కేవ‌లం రెండేళ్లు మాత్ర‌మే.. ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు మాని ముందాప‌ని చూడండి.. ఇంకో విష‌యం మ‌ర్చిపోయామండో., మీ త‌న‌యులు దోచేసిన అసైన్డ్ భూముల‌కి కూడా లెక్క‌లు చెప్పితీరాల్సిందే.. జ‌న‌సేనానిపై చేసిన వ్యాఖ్య‌లు విత్‌డ్రా చేసుకోక‌పోతే., మీ సెంక‌డ్ ఎపిసోడ్‌లో లోకానికి తెలియ‌ని మీ అరాచ‌కాలు మ‌రిన్ని ఆధారాల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు చేయాల్సి వ‌స్తుంది మ‌రి..

Share This:

1,697 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేన‌లోకి బిగ్ మూవ్‌.. నేడు తీర్ధం పుచ్చుకోనున్న జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌..

ఏ గూటి ప‌క్షులు ఆ గూటికే చేర‌తాయ‌న్న సామెత జ‌న‌సేన పార్టీకి అతికిన‌ట్టు స‌రిపోతుంది.. అవినీతి ప‌రుల్ని సైతం పార్టీలోకి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − 5 =