Home / జన సేన / చేయి చేయి క‌లిపిన ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సైనికులు.. సాటి జ‌న‌సైనికుడికి ఆప‌న్న‌హ‌స్తం..

చేయి చేయి క‌లిపిన ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సైనికులు.. సాటి జ‌న‌సైనికుడికి ఆప‌న్న‌హ‌స్తం..

భావ‌న వెంక‌టేష్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వీరాభిమాని.. భ‌గ‌త్‌సింగ్ విద్యార్ధి విభాగం స‌భ్యుడు.. చిన్నత‌నంలోనే త‌ల్లిదండ్రుల్ని కోల్పోయిన వెంక‌టేష్‌కి అనుకోని క‌ష్టం వ‌చ్చింది.. జ‌న‌సేనాని జ‌న్మ‌దినోత్స‌వాన త‌న ఆనందాన్ని బాణ‌సంచా రూపంలో ప్ర‌ద‌ర్శించ‌బోయి ప్ర‌మాదంలో చిక్కుకున్నాడు.. ప్ర‌మాద‌వ‌శాత్తు చేతిని కోల్పోయాడు.. వెంక‌టేష్ విష‌యం తెలుసుకున్న జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి, మీడియా విభాగం అధిప‌తి పి.హ‌రిప్ర‌సాద్‌., అత‌నికి ఆప‌న్న‌హ‌స్తం అందించ‌మంటూ ప‌వ‌న్‌టుడే ద్వారా పార్టీ శ్రేణుల ముందు ఓ విజ్ఞాప‌న ఉంచారు.. హ‌రిప్రసాద్ పిలుపు అందుకున్న జ‌న‌సేన ఎన్‌.ఆర్‌.ఐ విభాగం త‌మ వంతు సాయాన్ని వెంక‌టేష్‌కి అందించారు..

ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సేన అమెరికా విభాగం నుంచి 46 మంది జ‌న‌సైనికులు సాటి కార్య‌క‌ర్త‌కి ఆప‌న్న‌హ‌స్తం ఇచ్చేందుకు ముందుకి వ‌చ్చారు.. 15 అమెరిక‌న్ డాల‌ర్ల నుంచి 100 అమెరికన్ డాల‌ర్ల వ‌ర‌కు ఎవ‌రికి తోచిన సాయం వారందించారు.. వీరితో పాటు ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సేన మ‌స్క‌ట్ విభాగం మ‌రో 10 వేల రూపాయిలు సాయంగా అందించారు.. మొత్తం క‌లిపి ల‌క్షా 70 వేల ఆర్ధిక సాయాన్ని వెంక‌టేష్ కోసం పంపారు..

ఎన్‌.ఆర్‌.ఐ విభాగం నుంచి అందిన సాయంతో పాటు గోదావ‌రి జిల్లాల‌కి చెందిన మ‌రికొంద‌రు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా అత‌ని సాయం అందిచారు.. అర‌చేతిని తీసివేయాల్సి రావ‌డంతో., దానికి ప్ర‌త్యామ్నాయంగా., ఆర్ట్‌ఫిషియ‌ల్ చేతిని ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.. భావ‌న వెంక‌టేష్‌కి ఎలాంటి అవ‌స‌ర‌మైనా అండ‌గా వుంటామంటూ స్థానిక జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ముందుకి వ‌చ్చారు..

పార్టీ పిలుపుకి కదిలిన‌., ప‌వ‌న్‌టుడే విజ్ఞ‌ప్తికి స్పందించిన ప్ర‌తి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌కీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాం.. జ‌న‌సేన అంటే సాటి వారికి సాయం చేసే పార్టీ అని నిరూపించిన ప్ర‌తి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌కీ ధ‌న్య‌వాదాలు..

Share This:

1,020 views

About Syamkumar Lebaka

Check Also

బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఇంత‌కీ ఆ వంతెన స్టోరీ ఏంటంటే..?

బ‌ల‌స‌ల‌రేవు వంతెన‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌పంచం దృష్టికి వ‌చ్చిన మ‌రో అప‌రిష్కృత‌ ప్ర‌జా స‌మ‌స్య‌.. శ్రీకాకుళం జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × five =