Home / పవన్ టుడే / జనం ఇబ్బందుల్ని తీర్చండి- కేంద్రానికి జనసేనాని సూచన

జనం ఇబ్బందుల్ని తీర్చండి- కేంద్రానికి జనసేనాని సూచన

15135801_553358511533611_2499799257612658015_n న‌ల్ల‌ధ‌నం వెలికి తీసేందుకు ప్ర‌స్తుతం చ‌లామ‌ణితో ఉన్న పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.. మోడీ రాత్రికి రాత్రి తీసుకున్న ఈ నిర్ణ‌యం న‌ల్ల కుభేరుల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపిందో తెలియ‌దు గాని సామాన్య జ‌న‌జీవ‌నంపై మాత్రం తీవ్ర‌మైన ప్ర‌భావం చూపింది.. జ‌న‌సేనాని అనంత స‌భ‌కి ఒక రోజు మిగిలి ఉంద‌న‌గా మోడీ ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డంతో., అప్పుడు ఆయ‌న ఈ వ్య‌వ‌హారంపై పెద్ద‌గా స్పందించ‌లేదు.. ఈ ప్ర‌శ్న ఎదురైన‌ప్పుడు మాత్రం., బ్లాక్ పోతుందంటే ఇలాంటి నిర్ణ‌యాన్ని ఆహ్వానిస్తాన‌న్నారు.. అయితే అప్ప‌టి నుంచి బ‌డా బాబుల సంగ‌తి ఏమో గాని., సామాన్యులు మాత్రం బ్యాంకులు, ఏటిఎం సెంట‌ర్ల వ‌ద్ద క్యూల్లో కూలిపోతున్నారు.. భ‌విష్య‌త్తు బాగుంటుందంటున్నారు కాబ‌ట్టి ఓ వారంలో ప‌రిస్థితి స‌ర్ధుకుంటుందిలే అని భావించారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. అయితే రోజులు గ‌డుస్తున్నాయి గాని., ప‌రిస్థితులు మార‌డం లేదు.. అటు నిర్ణ‌యం తీసుకున్న స‌ర్కారు ద‌గ్గ‌ర్నుంచి బ్యాంకుల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్న సామాన్యుడి వ‌ర‌కు అంతా అయోమ‌య‌మే..

15110979_999759920169740_7889081002165793143_o

దీంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌న‌సేనాని స్పందించారు.. ముందుగా పెద్ద నోట్ల ర‌ద్దుపై సామాన్యుడి స్పంద‌న అంటూ త‌న స‌న్నిహితుడు సాయిమాధ‌వ్ రాసిన లెట‌ర్‌ని పోస్ట్ చేసిన ప‌వ‌న్‌., తానే ఓ సామాన్యుడిగా మారి కేంద్రానికి పలు సూచనలు చేశారు . .

img-20161120-wa0004 img-20161120-wa0005

త‌ర్వాత పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంపై త‌న అభిప్ర‌యాల‌ను సూటిగా కేంద్రానికి తెలిపారు.. పెద్ద నోట్ల ర‌ద్దు అంటూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం త‌ప్పుకాదు.. కానీ ఆ నిర్ణ‌యం తీసుకునే ముందు ప్ర‌జ‌లు ఇబ్బందులు పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందన్నారు.. ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు చూస్తే., నోట్ల ర‌ద్దుకి ముందు మీరు ఎలాంటి ముంద‌స్తు క‌స‌ర‌త్తులు చేయ‌లేద‌ని అర్ధం అవుతోంద‌న్నారు.. మీ చ‌ర్య ప‌ట్ల వృద్దులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు తీవ్ర‌మైన అసంతృప్తితో ఉన్నారు.. నోట్ల ర‌ద్దుకి సంబంధించి నిజానిజాల‌ను ప్ర‌జ‌ల ముందుంచాల‌ని డిమాండ్ చేశారు.. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న కొత్త నోట్లు ఎన్ని., పూర్తి స్థాయిలో ప‌రిస్థితులు స‌ర్ధుమ‌ణ‌గ‌డానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందో చెప్పాల‌న్నారు.. లేక‌పోతే ప్ర‌జాగ్ర‌హానికి బ‌లికాక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు..

img-20161120-wa0006 అనంత స‌భ అనంత‌రం పోలీసుల‌కి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ట్విట్ చేసిన జ‌న‌సేనాని., నోట్ల ర‌ద్దుపై స్పందించారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ పేజీలో ఇది వందో ట్విట్ కావ‌డం విశేషం.. ట్విట్ట‌ర్లో ప‌వ‌న్ ఫాలోవ‌ర్ల సంఖ్య కూడా ప‌ది ల‌క్ష‌ల ద‌గ్గ‌ర‌కు చేరుకోవ‌డం మ‌రో స్పెష‌ల్‌..

Share This:

1,483 views

About Syamkumar Lebaka

Check Also

సేనాని బాటే నా మాట‌.. అసెంబ్లీలో ప్ర‌యాణంపై జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక‌..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున శాస‌న‌స‌భ‌కు ఎన్నికయిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌కు పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభినంద‌న‌లు తెలియ‌చేశారు.. తూర్పుగోదావ‌రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 − 2 =