Home / పెన్ పోటు / జనసేనుడు దారి తప్పుతున్నాడా..! గాడిన పెడుతున్నాడా..? ఉన్న‌ది అంటే ఉలుకేలా..?

జనసేనుడు దారి తప్పుతున్నాడా..! గాడిన పెడుతున్నాడా..? ఉన్న‌ది అంటే ఉలుకేలా..?

జనసేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ నిన్న దెందులూరులో జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం ఎమ్మెల్యేలపైన, వారికి మద్దతు ఇస్తున్న‌ ప్రభుత్వ వ్యవస్థలపైన విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అధిపతులుగాని, మీడియా గాని స్థానిక ఎమ్మెల్యేల ఆగడాలను వేలెత్తి చెప్పడానికే భయపడుతున్న సమయంలో జనసేనుడు చేసిన ప్రసంగం దారి తప్పి చేస్తున్నట్టుగా ఏ మాత్రం తోచ‌లేదు.. గాడి తప్పిన, బూజుపట్టిన వ్యవస్థలను తట్టిలేపడానికి పరశురామునివ‌లె పక్కా ప్రణాళికతో విజృంబిస్తున్నట్టు ఉంది.. నీతి, నిజాయితీ, ధర్మము చచ్చుబ‌డిన ఈ సమాజములో, జనసేనుడు అభినందనీయుడే. ఖ‌చ్చితంగా అభినంద‌నీయుడే.

మొన్నామధ్య మదమెక్కిన పచ్చ మీడియాపై విరుచుకుపడినప్పుడుగాని, నిన్న అధికారమదంతో విర్రవీగుతున్న పచ్చ ప్రభువుల అనుచరులపై ఎలిగెత్తిన విధముగాని చూస్తుంటే జనసేనుడు విషపురుగుల నోట్లో తల దూరుస్తున్నాడా అన్న అనుమానం రాక మాన‌దు.. సమాజంలోను, మొత్తం వ్యవస్థలలోను ఆక్రమించియున్న ఇటువంటి విషపురుగులని కెలికితే ప్రభుత్వాలు “సేనానిని” బతికి బట్టకట్టనిస్తాయా అనేది జనసేనుడికి తెలియని విష‌యం కాదు.. మ‌రి అలాంటి జనసేనుడిలాంటి నిస్వార్ధ నాయకుడిని కాపాడుకోవలిసిన అవసరము నేటి సమాజానికి ఎంతైనా ఉంది.

మదమెక్కిన ప్రజాప్రతినిధులు, వ్యవస్థల అచేతనాన్ని ఆసరాగా తీసికొని చెలరేగిపోతుంటే, వారిని నిరోధించే మగాడు కావాలి అని ప్రజలు ఎప్ప‌టి నుంచో క‌ళ్లు కాయ‌లు కాసేలా(సమాజము ఎప్పుడో విడిపోయింది) ఎదురు చూస్తున్నారు. ఓట్లుకోసము పడి చచ్చే పాలక పార్టీలుగాని, తెలుగుతల్లిని తలుపులు మూసేసి నరికేసిన జాతీయ పార్టీలుగాని పిల్లి మేడలో గంటకట్టలేవ‌న్న‌ది ప్రజలకి తెలిసిన విష‌య‌మే.. జనసేనుడు తన జీవితాన్ని, పార్టీ భవితని కూడా పక్కన పెట్టి పిల్లి మేడలో గంట కట్టడానికి ముందుకు దూకారు. బూజుపట్టిన పార్టీల, మీడియా, కక్కుర్తి అనలిస్టులు రేపటి నుండి జనసేనుడిపై విరుచుకుపడడము మొదలు పెడతారు.

గత చరిత్రలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి, కెసిఆర్లు కూడా మీడియాని చీల్చి చెండాడినవారే. వీరి ఇద్దరిపేరులు చెబితే ఇప్పటికీ మీడియాకి నరాలు పనిచేయడము మానేస్తాయి. కానీ వీరు మీడియాతో తప్ప, ప్రభుత్వాలతో అంతగా గలాటా పెట్టుకోలేదు. అయితే మీడియాతో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకముగా వెళుతున్నవ్యక్తి ఒక్క జనసేనుడే అని చెప్పాలి. పాలక వర్గాలకిగాని, వారి అనుంగ మీడియాకిగాని, రౌడీ నాయకులకుగాని జనసేనుడు అంటే నేడు నిద్రరావడము లేదు అనేది నిజం. జనసేనుడికున్న తెగువ, ధైర్యము, సాహసము   నేటి కుళ్లుపట్టిన రాజకీయ వ్యవస్థలను శుద్ధి పరచడానికి అవసరమే.                                               Advertisement.

అయితే నేడు ఊరుకోక ప్రభాకర్ ఉన్నారు. వీరు అందరూ సమాజాన్ని పీడించుకొని తింటుంటే, వీరి అధినాయకుడు అలనాటి ధృతరాష్ట్ర మహారాజువలె, కళ్ళు మూసికొని పాలన కొనసాగిస్తున్నారు. ఊరుకోక ప్రభాకరులను తయారుచేస్తున్న వీరి అధినాయకుడిపై పోరాడాలి. ఓడించాలి. గద్దె దించాలి. అప్పుడే “పచ్చటి సమాజానికి” పట్టిన ఈ “పచ్చ చీడపురుగుల” భాధ వదులుతుంది.

నిండుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణము జరుగుతుంటే, నాటి దుతరాష్ట్ర మహారాజు, భీష్మ, ద్రోణ, కృపాచార్య లాంటివారు నోరు ఎత్తేవారు కాదు. కానీ ఇది అన్యాయము అనే పాండవులపైనా, ద్రౌపదిపైన మాత్రము శాంతము అంటుండేవారు. రాజుకి వ్యతిరేకం చెప్పరాదు అంటుండేవారు.

దుర్మాతులకు అండగా ఉండే నేటి ప్రభుత్వాలు, మీడియా, కుహనా మేధావులు కూడా జనసేనుడిదే తప్పు అనడము నెటినుండే మొదలు పెడతారు తప్ప అరాచకాలు సృష్టించే ప్రజాప్రతినిధులపై చర్యలు తీసికోరు. పుత్రప్రీతితో అధర్ములకు అండగా ఉండే నాటి ధృతరాష్ట్రునికి, అధర్ములకు కొమ్ముకాస్తున్న నేటి చంద్రలోకాధీశులకు తేడా ఉండదు. ధర్మం చరః అధర్మానికి శతమానం భవతి అనే ప్రభుత్వాలు ఆన్న రోజులివి. విరుచుకుపడే పచ్చ శ్రేణులు, మీడియా నిన్నటినుండి మౌనము వహిస్తున్నాయి. ఏదో కధ నడుస్తున్నది. జనసేనుడా తస్మాత్తు జాగ్రత్త!!!

Advertisememt.

Share This:

4,335 views

About Syamkumar Lebaka

Check Also

”అజ్ఞాత‌వాసి ర‌విప్ర‌కాష్‌”ది ఎంత క్రిమిన‌ల్ మైండో చూడండి..

వెనుక‌టికి ఒక సామెత ఉంది ”చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది —— గుడిసెలు” అని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three + 13 =