Home / జన సేన / జనసేన లీగల్ విభాగం కోఆర్డినేటర్‌గా ఈవ‌న‌ ప్రతాప్..

జనసేన లీగల్ విభాగం కోఆర్డినేటర్‌గా ఈవ‌న‌ ప్రతాప్..

జ‌న‌సేన పార్టీ నిర్మాణ ప్ర‌క్రియలో భాగంగా శ‌నివారం లీగ‌ల్ విభాగం కో ఆర్డినేట‌ర్‌ను అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నియ‌మించారు.. పార్టీ లీగ‌ల్ వింగ్ కో ఆర్డినేట‌ర్‌గా సీనియ‌ర్ న్యాయ‌వాది ఈవ‌న సాంబ‌శివ ప్ర‌తాప్‌ను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో పార్టీ లీగ‌ల్ విభాగానికి సంబంధించిన కార్య‌క‌లాపాల‌ను ప్ర‌తాప్ స‌మ‌న్వ‌యం చేయ‌నున్న‌ట్టు పార్టీ వెల్ల‌డించింది.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తాప్ పార్టీకి సేవ‌లు అందించారు.. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లోనూ ఆయ‌న న్యాయ‌వాదిగా ప‌ని చేస్తున్నారు.. న్యాయ‌వాదిగా ఆపార అనుభ‌వం ఉన్న ప్ర‌తాప్ పార్టీకి సైతం విశిష్ట సేవ‌లు అందించాల‌ని పార్టీ అధినేత ఆకాంక్షించారు.. ఆయ‌నకు అభినంద‌న‌లు తెలిపారు..

బోనాల పాట‌ను విడుద‌ల చేసిన జ‌న‌సేనాని
తెలంగాణ సంప్ర‌దాయ పండుగ బోనాల ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని బోనాల‌కు సంబంధించి ఓ ప్ర‌త్యేక గీతాన్ని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విడుద‌ల చేశారు.. పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో బోనాల పాట‌ను విడుద‌ల చేసిన జ‌న‌సేనాని, పూర్తిగా దాన్ని తిల‌కించారు..

Share This:

459 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve − five =