Home / జన సేన / జాతీయ సమైక్యతని నాయకులు మరచిపోయారు.. మువ్వ‌న్నెల ప‌తాకం సాక్షిగా జ‌న‌సేనుడి ధ్వ‌జం..

జాతీయ సమైక్యతని నాయకులు మరచిపోయారు.. మువ్వ‌న్నెల ప‌తాకం సాక్షిగా జ‌న‌సేనుడి ధ్వ‌జం..

త‌లెత్తి చూస్తే దేశ జాతీయ జెండాకున్నంత పొగ‌రుంది.. అంత‌కు మించి జాతి స‌మ‌గ్ర‌త‌, స‌మైక్య‌త‌ల‌పై న‌మ్మ‌కం ఉంది.. దాన్ని కాపాడాల‌న్న త‌ప‌నా నిలువెల్లా ఉంది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లో.. అందుకే దేశ తొలి స్వాతంత్ర పోరాటాన్ని ఘ‌నంగా స్మ‌రించుకునే అవ‌కాశం ఆయ‌న‌కే ద‌క్కింది.. హైద‌రాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మ‌న దేశ జాతీయ జెండా.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాని ఆయ‌న ఆవిష్క‌రించారు.. ఈ సంద‌ర్బంగా నేటిత‌రం నాయ‌కుల తీరుని దుయ్య‌బ‌ట్టిన ఆయ‌న‌., జాతీయ స‌మైక్య‌త‌ను కాపాడుతామంటూ యువ‌త‌తో ప్ర‌తిజ్ఞ చేయించారు.. మ‌న జాతీయ ప‌తాకం స‌మ‌గ్ర‌త‌, స‌మైక్య‌త‌ల‌కి సూచిక అంటూ మ‌రోసారి నిన‌దించిన ఆయ‌న‌., నాయ‌కులు మాత్రం దాన్ని మ‌ర‌చిపోయార‌న్నారు.. వైబ్రెంట్స్ ఆఫ్ క‌లామ్ సంస్థ రూపొందించిన 122 అడుగుల పొడుగు, 183 అడుగుల వెడ‌ల్పు ఉన్న భారీ జాతీయ ప‌తాకాన్ని భార‌త్ మాతాకీ జై అనే నినాదాల మ‌ధ్య ఆవిష్క‌రించిన ప‌వ‌న్‌., జెండాలో మువ్వ‌న్నెలు, ఆశోక‌చ‌క్రం జాతి స‌మ‌గ్ర‌త‌కి, స‌మైక్య‌త‌కి నిద‌ర్శ‌న‌మ‌ని పున‌రుద్ఘాటించారు.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చెప్పినట్లు మన జాతీయ జెండా ఏ కులానిదీ, పార్టీది, మతానిది కాదు. ప్రతి ఒక్కరిదీ అంటూ జ‌న‌సేనాని నిన‌దించారు..

కాషాయం అంటే హిందూ మతానికి సూచిక కాదన్న ఆయ‌న‌., ఆ రంగు మన రాజకీయ వ్యవస్థ, నాయకులు ఎలా ఉండాలో చెబుతుందన్నారు.. కాషాయం కట్టినవాళ్ళు సర్వసంగ పరిత్యాగులుగా, స్వలాభం లేకుండా ఎలా ఉంటారో., నాయకులూ అలాగే ఉండాలని ఆయ‌న పిలుపునిచ్చారు.. మన జెండా దేశం కోసం త్యాగాలు చేసినవారిని, స్వలాభం లేకుండా ప‌ని చేసే వారిని గుర్తు చేస్తుందని యువ‌త‌కి తెలియ‌జెప్పారు.. యువత ముందుకు వచ్చి ఈ వేడుకను నిర్వహించడం ప‌ట్ల ఆయ‌న‌ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.. ఈ కార్య‌క్ర‌మం యువ‌త‌లోని ఔన్నత్యాన్ని తెలియచేస్తోందన్నారు. చివ‌రిగా వేడుకకు హాజరైన అంద‌రితో జాతీయ సమైక్యతా ప్రమాణం చేయించారు..
‘భారతీయుడినైన నేను.. భారతదేశ పౌరుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. నా దేశ వారసత్వ సంపదను పరిరక్షిస్తూ.. ప్రకృతికి నష్టం కలిగించకుండా పర్యావరణాన్ని కాపాడుతూ.. అనునిత్యం దేశ ప్రజలకై పరితపిస్తూ.. మన అక్కచెల్లెళ్ళనీ, ఆడపడుచుల పట్ల పేగు బంధంతో కాపాడుతామని.. చట్టాలను గౌరవిస్తూ.. కుల,మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావులేకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా భావిస్తానని మన జెండా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ జ‌న‌సేనాని ప్రమాణం సాగింది.. ఈ కార్యక్రమంలో వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కలామ్‌తో పాటు పెద్ద ఎత్తున యువ‌త‌, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.. జాతి స‌మ‌గ్ర‌త గురించి జ‌న‌సేన అధినేత మాట్లాడుతుంటే., ప్ర‌తి ప‌దాన్ని కెమెరాల్లో బంధించి, అంద‌రికీ షేర్ చేసేందుకు యువ‌త పోటీ ప‌డింది.. కొన్ని వేల మొబైల్ కెమెరాలు జ‌న‌సేనుడి జాతీయ స‌గ్ర‌తా నినాదాన్ని త‌మ మెమ‌రీల్లో బంధించాయి..

Share This:

1,125 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen + 20 =