Home / జన సేన / జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ ఖ‌ర్చుని నియంత్రించేందుకు ఎన్నిక‌ల సంఘం మొద‌టి నుంచి కొన్ని నిబంధ‌న‌లు రూపొందించింది.. ప్ర‌స్తుతం సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే అభ్య‌ర్ధులు లోక్‌స‌భ‌కు పోటీ చేసే ఎంపి అభ్య‌ర్ధులు అయితే రూ. 70 ల‌క్ష‌లు, శాస‌న‌స‌భ భ‌రిలో నిలిచే ఎమ్మెల్యే అభ్య‌ర్ధులు అయితే రూ. 28 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసుకునేందుకు అనుమ‌తి ఉంది.. ఈ మొత్తాన్ని ఎన్నిక‌ల ప్ర‌చారం నిమిత్తం మాత్ర‌మే ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది.. అది ప‌త్రిక‌లు, మీడియా సంస్థ‌ల్లో వేసే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు కావ‌చ్చు., పోస్ట‌ర్లు, ప్ర‌చారంలో వినియోగించే పార్టీ జెండాలు గానీ, ప్ర‌చార వాహ‌నాల అద్దె, ఇంధ‌నం ఖ‌ర్చు, ప్ర‌చారంలో పాలు పంచుకునే కార్య‌క‌ర్త‌ల భోజ‌నాల‌తో పాటు పార్టీ కార్యాల‌యాల అద్దె త‌దిత‌ర ఖ‌ర్చులు ఈ కోవ‌కు వ‌స్తాయి.. అయితే అది కూడా ఎలా ప‌డితే అలా చేస్తామంటే కుద‌ర‌దు.. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఓ అభ్య‌ర్ధి త‌ర‌పున ఎన్ని ప్ర‌చార వాహ‌నాలు తిరుగుతున్నాయి అనే వివ‌రాలు వాటి నంబ‌ర్ల‌తో స‌హా ఇవ్వాల్సి ఉంటుంది.. అభ్య‌ర్ధులు ప‌రిమితికి మించి ఏమైనా ఖ‌ర్చులు చేస్తున్నారా.? అనే అంశం తెలుసుకోవ‌డానికి ఎన్నిక‌ల సంఘం షాడో టీంల‌ను కూడా ఏర్పాటు చేసి మోనిట‌రింగ్ చేస్తూ ఉంటుంది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిపోయింది.. ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్ధులు ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకుల కోట్ల రూపాయిలు కుమ్మ‌రించార‌న్నది బ‌హిరంగ ర‌హ‌స్యం.. జ‌న‌సేన పార్టీ మాత్రం జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా అడుగులు వేసింది.. ప్ర‌త్య‌ర్ధులు కోట్లు కుమ్మ‌రిస్తుంటే, జ‌న‌సేన అభ్య‌ర్ధులు మాత్రం కేవ‌లం పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ‌లం, బ‌ల‌గంతో పాటు సిద్ధాంతాలు, మేనిఫోస్టోని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం ద్వారా ఓట్లు సంపాదించ‌డం అనే అంశం మీద మాత్ర‌మే దృష్టి పెట్టారు.. బ‌హుశా ఈ ఎన్నిక‌ల్లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన ఓ ఎంపి అభ్య‌ర్ధి పెట్టిన ఖ‌ర్చుకు కూడా జ‌న‌సేన పార్టీ మొత్తం అభ్య‌ర్ధులు పెట్ట ఉండ‌ర‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు..

ఇదంతా ఓకే గానీ, ఇంత‌కీ రెండు శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల బ‌రిలో నిల‌చిన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ఎంత ఖ‌ర్చు పెట్టి ఉంటారు.. జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్‌కి పిలుపు ఇచ్చిన జ‌న‌సేనాని గెలుపు కోసం పెట్టిన ఖ‌ర్చు ఎంత‌..? ఈ అంశం మీద ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన ఆస‌క్తి ఉంది.. ఇందుకు సంబంధించి గాజువాక నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేనాని ఎన్నిక‌ల ఖ‌ర్చుకు సంబంధించిన వివ‌రాల‌ను ఎన్నిక‌ల సంఘం ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చింది.. ప‌వ‌న్ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ ఆధారంగా ఆ అమౌంట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.. మూడు సార్లు రోడ్ షోలు నిర్వ‌హించ‌డంతో పాటు తాను బ‌రిలోకి దిగిన నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పెట్టిన మొత్తం ఖ‌ర్చు అక్ష‌రాలా
రూ. 8,39,790.. ప‌వ‌న్‌ను ఓడించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డిన ప్ర‌త్య‌ర్ధులు, ముఖ్యంగా వైసీపీ అభ్య‌ర్ధి అన‌ధికారికంగా ఓ చిన్న గ్రామంలో పంచిన మొత్తం కంటే ఇది త‌క్కువ‌.. ఎన్నిక‌ల సంఘం రూ. రూ. 28 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టే అవ‌కాశం ఇచ్చినా, ధ‌న ప్ర‌మేయం రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను చూడాల‌ని క‌ల‌లు కంటున్న ఆయ‌న కేవ‌లం ఎనిమిది ల‌క్ష‌ల రూపాయిల ఖ‌ర్చుతో గాజువాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌లు ముగించారు.. అంతేకాదు విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర ప‌రిధిలో జ‌న‌సేన పార్టీ త‌రుఫున బ‌రిలో ఉన్న అభ్య‌ర్ధుల్లో ఏ ఒక్క‌రూ 10 ల‌క్ష‌ల ఖ‌ర్చే చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.. గంటా శ్రీనివాస‌రావుపై పోటీ చేసిన జ‌న‌సేన మ‌హిళా అభ్య‌ర్ధి ప‌సుపులేటి ఉషాకిర‌ణ్ అయితే కేవ‌లం రూ. 57, 950 ఖ‌ర్చుతో ఎన్నిక‌ల‌ను ముగించింది.. ప్ర‌త్య‌ర్ధులు కోట్లాది రూపాయిల న‌ల్ల‌ధ‌నం కుమ్మ‌రిస్తున్న త‌రుణంలో జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్‌తో ఎన్నిక‌ల్లో విజ‌యం సాధ్య‌మా అంటే., ఒక్క‌సారిగా వ్య‌వ‌స్థ మారిపోతుంద‌ని, మారిపోవాల‌న్న కోరిక త‌న‌కు లేద‌ని, మార్పు అయితే మొద‌లైంద‌న్న న‌మ్మ‌కాన్ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ్య‌క్తం చేయ‌డం ఆయ‌న‌కు త‌న సిద్ధాంతాల ప‌ట్ల ఉన్న న‌మ్మ‌కాన్ని తెలియ‌చేస్తుంది..

Share This:

967 views

About Syamkumar Lebaka

Check Also

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + 16 =