Home / జన సేన / జేడీ వ‌చ్చారు.. ఇక వైసీపీ రాదు.. విశాఖ‌లో జ‌న‌సేనాని ప‌వ‌ర్ పంచ్‌..

జేడీ వ‌చ్చారు.. ఇక వైసీపీ రాదు.. విశాఖ‌లో జ‌న‌సేనాని ప‌వ‌ర్ పంచ్‌..

విశాఖప‌ట్నం న‌గ‌రాన్ని కాలుష్య కోర‌ల నుంచి, క‌బ్జా కోర‌ల నుంచి, మాఫియా భారి నుంచి కాపాడుతాన‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు. ఉపాధి, వ్య‌వ‌సాయ అవ‌కాశాలు మెరుగుప‌రిచి , వ‌ల‌స‌లు ఆగే విధంగా అండ‌గా నిలుస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల‌కి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. గాజువాక అసెంబ్లీ స్థానానికి నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు..విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అయ్యింది గానీ, భూములు ఇచ్చిన రైతులు మాత్రం వారి హ‌క్కులు కోల్పోయారు. మీకు జ‌న‌సేన పార్టీ న్యాయం చేస్తుంద‌ని భ‌రోసా ఇచ్చారు.. 2014లో తెలుగుదేశం పార్టీ, బీజేపీల‌కి అండ‌గా ఉన్నాం. మ‌న‌కి ఉపాధి అవ‌కాశాలు మెరుగుపడాల‌ని, బిడ్డ‌ల భ‌విష్య‌త్తు బాగుండాల‌ని ఓటేశాం. కానీ మ‌న ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయ‌ని ఆరోపించారు.. ఈ సారి మ‌న ఓటు 25 కేజీల బియ్యం కోస‌మో, రెండు వేల నోటు కోస‌మో కాద‌ని చాటుదామ‌ని పిలుపునిచ్చారు.. ఓటు కోసం నోటు ఇచ్చే వారి ముఖాన ప్ర‌జ‌లే రెండు వేల నోటు తిరిగికొట్టే స్థాయి భ‌విష్య‌త్తు ఇచ్చేందుకు జ‌న‌సేన పార్టీ ఉందన్నారు.. 2019లో జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని స్థాపిస్తున్నాం. మీరు కోరుకున్న వ్య‌క్తి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌యాణ స్వీకారం చేయ‌బోతున్నార‌ని ధీమా వ్య‌క్తం చేశారు.. ఆ ప్ర‌స్థానం మ‌న గాజువాక నుంచే మొద‌లు పెడుతున్నామ‌నీ., ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి రాజ‌కీయం తెలియ‌దు, జ‌న‌సేన‌కి రాజ‌కీయం తెలియ‌దు అనే వారికి చెబుతున్నా… 130 మందికి పైగా అభ్య‌ర్ధుల్ని శాస‌న‌స‌భ‌కి నిల‌బెడుతున్నాం. 25 ఎంపిల్లో 19 మందిని ఖ‌రారు చేశాం. జ‌న‌సేన పార్టీ నిల‌బెడుతున్న ఆ అభ్య‌ర్ధులు మాములు వారు కాదు. విశాఖ నుంచి నిల‌బెట్టిన ఎంపి అభ్య‌ర్ధి సీటు ఇస్తే పారిపోయే వ్య‌క్తి కాదు. నిల‌బ‌డే వ్య‌క్తిని తీసుకువ‌చ్చామ‌ని స్ప‌ష్టం చేశారు. జ‌న‌సేన మీకు అండ‌గా ఉండాలి అంటే, పార్టీ నిల‌బ‌డాలి అంటే అటువంటి ధైర్య‌వంతులే కావాలనీ., ఇది మార్పు కోసం, భ‌విష్య‌త్తు కోసం చేస్తున్న పోరాటంగా అభివ‌ర్ణించారు..

పోరాడే వ్య‌క్తుల అవ‌స‌రం ఎందుకు కావాలి అంటే, ఇదే గాజువాక‌లో మనం టీడీపీ-బీజేపీల‌కి మ‌ద్ద‌తు ఇస్తే గెలిచాక అంతా క‌బ్జాల‌మ‌యం, భూదోపిడిలు, కుంభ‌కోణాల‌మ‌యం చేసేశారు. వీరి తాట తీయ‌డానికే జేడీ ల‌క్ష్మినారాయ‌ణని ఇక్క‌డి నుంచి పోటీ చేయిస్తున్నామ‌ని తెలిపారు.. క్రిమిన‌ల్ నాయ‌కుల భ‌ర‌తం ప‌ట్టేందుకే విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు స్థానం నుంచి ఆయ‌న్ని నిల‌బెట్టామ‌నీ, జేడీ గారు వ‌చ్చారు కాబ‌ట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక రాద‌న్నారు.. వైసీపీని గెలిపిస్తే… తెలుగుదేశం పార్టీ నేత‌ల క‌బ్జాలు ఒక ఎత్త‌యితే, వీరు ఏకంగా మీ ఇళ్లు లాగేసుకుంటారు. కొండ‌లు దోచేస్తారని ఎద్దేవా చేశారు.. అవినీతిని అంత‌మొందించ‌డానికి విశాఖ న‌గ‌రానికి ఒక కొత్వాల్‌గా జేడీ గారిని తీసుకువ‌చ్చాన‌ని తెలిపారు.. అన్యాయం తోలు తీసే కొత్వాల్ ఆయ‌న‌. డ‌బ్బిచ్చి కిరాయి మూక‌ల్ని తీసుకువ‌స్తే వారికి స‌రైన ట్రీట్‌మెంట్ ఇచ్చే కొత్వాల్ కాబ‌ట్టే ఆయ‌న్ని విశాఖ‌కి ఎంపిక చేసిన‌ట్టు చెప్పారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయ‌కులు ఏ ముఖం పెట్టుకుని వ‌చ్చి జేడీ ఎదురుగా వ‌చ్చి ఓట్లు అడుగుతారో చూద్దామ‌న్నారు..

2014లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి మోడీ గారు వ‌చ్చిన‌ప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మిత్ర్‌, భాయ్ అంటూ సంభోదిస్తుంటే భ‌య‌మేసింద‌నీ., ఓట్లు వేయించుకుని ఎక్క‌డ అన్యాయం చేస్తారోన‌ని.. న‌న్ను గుర్తించ‌మ‌ని ఏ రోజూ అడ‌గ‌లేద‌నీ., ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వ‌మ‌ని అడిగిన‌ట్టు తెలిపారు.. స్టేట‌స్ ఇవ్వ‌క‌పోగా విశాఖ పోర్టులో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్‌ని మూసివేసే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు.. ట్రేడ్ యూనియ‌న్లు విష‌యం త‌న‌ దృష్టికి తీసుకువ‌చ్చిన‌ప్పుడు బ‌లంగా నిల‌బ‌డిన‌ట్టు తెలిపారు.. ప్ర‌ధాని అంటే త‌న‌కు భ‌యం లేద‌ని చెప్పారు.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిల‌కు మాత్రం మోడీ పేరు చెబితే వెన్నులో వ‌ణుకు పుడుతుంద‌న్నారు.. వారికి ప్ర‌ధాని అంటే భ‌యం, త‌న‌కు మాత్రం లేద‌న్నారు.. తాను త‌ప్పులు చేయ‌లేదు కాబ‌ట్టే భ‌యం లేద‌న్నారు.. మ‌న‌వైపు త‌ప్పులు ఉంటే గ‌ట్టిగా మాట్లాడ‌లేమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మీద కేసులు ఉన్నాయి కాబ‌ట్టి ఏదైనా అడిగితే ఫైల్స్ చూపిస్తారని జ‌న‌సేనాని అన్నారు… అలాంటి నాయ‌కుల‌కి ఓటు వేయ‌డం అవ‌స‌ర‌మా ఆలోచాంచాల‌ని చెప్పారు.. అంతా ప్ర‌శాంతంగా ఇంటికి వెళ్లి ఆలోచించాల‌ని సూచించారు.. ఎలాంటి వ్య‌వ‌స్థ‌లు, రాజ‌కీయాలు కావాలో మీరే తేల్చుకోండన్నారు.. కిరాయి మూక‌ల్ని పంపి భ‌య‌పెడ‌దామంటే ఇది భ‌య‌ప‌డే ప్రాంతం కాదనీ., ట్రేడ్ యూనియ‌న్లు ఉన్న గ‌డ్డ ఇదనీ., విశాఖ ప‌విత్ర‌త చెడ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తే ఏం చేయాలో ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కి తెలుస‌ని హెచ్చ‌రించారు..

==============================

Share This:

501 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + twelve =