Home / జన సేన / జేపీతో జ‌న‌సేనాని భేటీ.. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై ఐక్య‌ పోరాటం దిశ‌గా మరో అడుగు..

జేపీతో జ‌న‌సేనాని భేటీ.. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై ఐక్య‌ పోరాటం దిశ‌గా మరో అడుగు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా స‌హా విభ‌జ‌న హామీల అమ‌లుకి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జేఏసీ ఏర్పాటు ప్ర‌తిపాధ‌న చేసిన జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. తాను ప్ర‌తిపాధించిన నేత‌ల నుంచి సుముఖ‌త వ్య‌క్తం కావ‌డంతో., జేఏసీ ఏర్పాటు దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు.. బుధ‌వారం మీడియా స‌మావేశంలో జ‌న‌సేన అధినేత ప్ర‌తిపాధ‌న చేయ‌గా., రాత్రి ఉండ‌వ‌ల్లితో మాట్లాడ‌టం.. తాజాగా లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌తో భేటీ.. లోక్‌స‌త్తా కార్యాల‌యానికి వెళ్లి మ‌రీ జేపీని క‌ల‌సిన ఆయ‌న సుమారు గంట పాటు ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. విభ‌జ‌న స‌మ‌యంలో కేంద్రం, ప్ర‌ధాని ఇచ్చిన హామీల‌ను విస్మ‌రించిన నేప‌ధ్యంలో., కేంద్రంపై ఒత్తిడి ఎలా తీసుకురావాలి అనే అంశంపై దిశా నిర్ధేశం చేయ‌మని జేపీని కోరారు.. క‌ల‌సి వ‌చ్చే అంద‌రితో క‌ల‌సి జేఏసీ ఏర్పాటుకి సంబంధించి చ‌ర్చించారు.. త్వ‌ర‌లో అంద‌రితో క‌ల‌సి ఓ స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు..

రోడ్ల మీద‌కి వ‌చ్చి నిర‌స‌న‌లు తెల‌ప‌డం కంటే ప్ర‌జాస్వామ్య‌యుతంగా సాధించే అంశంపైనే దృష్టి సారించిన‌ట్టు జ‌న‌సేన అధినేత తెలిపారు.. మొద‌ట రెండు పేర్లు ప్ర‌తిపాధించిన ఆయ‌న‌., మ‌రుస‌టి రోజే ముంద‌డుగు వేశారు.. ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం తాను ఎంత వ‌ర‌కైనా వెళ్తాన‌ని నిరూపిస్తూ., స్వ‌యంగా లోక్‌స‌త్తా కార్యాల‌యానికి వెళ్ల‌డం గ‌మ‌నార్హం.. తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌లో గానీ., కేంద్రంలో గాని ప్ర‌త్యేక ప‌రిస్థితుల మ‌ధ్య ప్ర‌భుత్వాలు ఏర్ప‌డిన నేప‌ధ్యంలో., హామీల అమ‌లుకి వేచి చూడాల్సి వ‌చ్చింద‌న్నారు.. ఇప్పుడు పోరాడాల్సిన స‌మ‌యం.. ఒత్త‌డి తేవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది కాబ‌ట్టి., క‌లిసొచ్చే అంద‌రితో క‌ల‌సి పోరాటానికి త‌న త‌రుపు నుంచి సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు..

విభ‌జ‌న కార‌ణంగా దెబ్బ‌తిన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఎలా న్యాయం చేయాలి అనే అంశంపై సుధీర్ఘ చ‌ర్చ జ‌ర‌గాల‌న్న ఆయ‌న‌., విష‌యాన్ని కేంద్రం దృష్టికి ఎలా తీసుకువెళ్లాల‌న్న అంశంపై ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తామ‌న్నారు.. మ‌రోసారి స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని., అందుకు సంబంధించి విధివిధానాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు..

అటు లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ కూడా జ‌న‌సేనానితో చ‌ర్చ ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేశారు.. మంచి ఆలోచ‌న‌తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముందుకి రావ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం అన్నారు.. ముఖ్యంగా స‌మాజానికి న్యాయం చేయాల‌న్న బ‌ల‌మైన ఆకాంక్ష ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఉంద‌ని జేపీ అభిప్రాయ‌ప‌డ్డారు.. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించామ‌న్న ఆయ‌న., ఏపీకి ఆర్ధికంగా న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న ఆలోచ‌న ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకుపోయింద‌న్నారు.. వెనుక‌బ‌డ్డ ప్రాంతాల‌కి బుందేల్‌ఖండ్ త‌ర‌హా ప్యాకేజీ ఇస్తామ‌ని ఇదే ప్ర‌ధాని ఇచ్చిన హామీ ఎక్క‌డని ప్ర‌శ్నించారు.. లెక్క‌ల సంగ‌తి ప్ర‌భుత్వాలు తేల్చుకోవాల‌ని., ప్ర‌జ‌ల‌కు మాత్రం న్యాయం చేయాల్సిందేన‌న్నారు..

పార్ల‌మెంటులో లోతైన చ‌ర్చ జ‌రిగాక‌., అదే పార్ల‌మెంటు సాక్షిగా హామీలు ఇచ్చి స్వ‌యానా ప్ర‌ధాని, హోంమంత్రి.. ఇప్పుడు ఏరుదాటాక తెప్ప‌త‌గ‌లేసే ప‌రిస్థితి చ‌ట్ట‌స‌భ‌ల‌పై న‌మ్మ‌కాన్ని పోగొడుతున్నాయ‌న్నారు.. ఓ వేదిక ఏర్పాటు చేసి., హామీల అమ‌లుకి ఒత్తిడి తెస్తామ‌న్నారు..

జ‌న‌సేన పార్టీ ఏర్పాటు చేసిందే., ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసేందుకు.. 25 ఏళ్ల ఓ సుధీర్ఘ ల‌క్ష్యంతో ముందుకి వ‌చ్చిన జ‌న‌సేన అధినేత‌.. రాజ‌కీయాలు-అధికారం అనే ప‌దాల‌ని ప‌క్క‌న‌పెట్టి.., ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం తానే చొర‌వ తీసుకున్న తీరు.. రాజ‌కీయాల ప‌ట్ల త‌న ఉద్దేశాన్ని మ‌రోసారి చాటుతోంది.. రాజ‌కీయం అంటే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం అని ప‌దే ప‌దే చెప్పే ఆయ‌న మాట‌ల్లో నిబ‌ద్ద‌త‌ని ప్ర‌తి ఒక్క‌రూ గ్ర‌హించాల్సిన అవ‌స‌రం ఉంది..

Share This:

1,109 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten + one =