నోటికి ఏదివస్తే.. అది వాగడం.. ఆనక నాలుక్కరుచుకోవడం కొందరికి అలవాటు.. వాగింది తప్పని తెలిసినా.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని అడ్డంగా వాదించే అలవాటు ఇంకోందరిది.. ఇందులో రెండో రకం అనంతపురం ఎంపి జేసీ దివాకర్‌రెడ్డి.. ఫ్యాక్షన్..యాక్షన్‌తో కూడిన బ్యాంగ్రౌండ్ ఉంది కాబట్టి., తాను ఏం మాట్లాడినా చెల్లుబడి అవుతుందన్న ధైర్యం.. ఆ ధైర్యంతోనే ఇక్కడ ఏది అనిపిస్తే.. అది వాగేస్తారు.. ముందూ వెనుకా చూసుకోరు.. ఈ వాగుడికీ ఓ కారణం ఉంది.. అదే సంచలనం.. తనని జనం మర్చిపోతున్నారు అనుకున్నప్పుడల్లా.. ఏదో ఒక సంచలనాత్మక వ్యాఖ్యతో మళ్లీ మీడియాలో హల్ చల్ చేస్తారు.. ఆ క్రమంలో అందరితో తిట్లు తింటుంటారనుకోండి..
ఈ జేసీ గారి చూపు ఇప్పుడు జనసేనాని, పవర్‌స్టార్ పవన్కళ్యాణ్గారిపై పడింది.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరి గురించి మాట్లాడితే ఎక్కువ కవరేజీ వస్తుందా అని ఆలోచించి మరీ., జనసేనుడి మీద అక్కసు వెళ్లగక్కేశారు.. ముందుగా విపక్ష నేత జగన్ రెడ్డి కాదంటూ గళం విప్పిన ఆయన., ఎవరూ పట్టించుకోకపోయే సరికి., ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌కి అధికారం చేపట్టే స్టామినా లేదంటూ ఓ మాటేసేశారు.. సినిమా నటుల్ని చూసి జనం ఓటేయరని ఈయనగారు సెలవిచ్చారు.. జనసేనానికి పార్టీని అధికారంలోకి తెచ్చేంత లేదంట.. అసలు పార్లమెంటు అంటే జనసేనుడికి తెలుసా అన్నది ఈ జగడాల మారి జేసీగారి అనుమానం…
మీరు మాట్లాడిన మాటలకి సంబంధించి మేమూ కొన్ని ప్రశ్నలు వేస్తాం.. ఏ విషయంలో నైనా కుండ బద్దలు కొడతాననే మీ వద్ద వాటికి బదులుంటే చెప్పి., ఆ తర్వాత జనసేనుడి గురించి మాట్లాడండి.. 2014 ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసినప్పుడు., ఓటమి భయంతో మీ కొడుకు పవన్‌రెడ్డి ప్రచారానికి రమ్మంటూ జనసేనానిని బతిమలాడారు.. ఆ విషయాన్ని మీ పుత్రరత్నమే నేరుగా ఒప్పుకున్నారు కూడా., ఆయన పుణ్యంతో గెలిచిన మీరు., ఆయనకి గెలిపించే సత్తా లేదనడం ఎంత వరకు కరెక్టు..? జనసేనానికి గెలిపించే సత్తా లేనప్పుడు ఆయన్ని ప్రచారానికి రమ్మని ఎందుకు బతిమలాడారు..? ఆయన సినీ హీరో అన్న సంగతి అప్పుడు మీకు గుర్తుకురాలేదా..?
పవన్‌కళ్యాణ్ పార్టీ స్థాపించింది.. ఎందుకు అనే విషయాన్ని అనంత సభలో స్పష్టం చేశారు.. మీకు వినబడలేదా..? మీ అబ్బాయి పవన్‌రెడ్డికి క్లియర్‌గా వినబడింది.. ఒక్కసారి అయన్ని అడిగి తెలుసుకోండి.. అధికారం కోసం పార్టీలు మార్చే., మీకు అలాంటివి వినబడినా.. వినబడనట్టే మర్చిపోయాం.. ఇంకోసారి చెబుతున్నాం.. జనసేన జనం కోసం పుట్టింది.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పుట్టింది.. అధికారం మీద ఆశతో పుట్టలేదు.. కాబట్టి గెలుపు, ఓటమి భయం జనసేనుడికి లేదు.. పదే పదే ఆ భయంతో మీరు భుజాలు తడుముకుంటే., జనానికి అసలు విషయం అర్ధమైపోతుంది.. జాగ్రత్త..
రాజకీయ నాయకుడిగా మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు.. రాష్ట్రం విడిపోయినా పర్వాలేదు గాని., మీ బిజినెస్ దెబ్బతినకుండా ఉండేందుకు బళ్లారిని కలుపుకుంటే చాలు.. సినీ హీరో పార్టీ పెడితే చులకన.. వ్యాపారాన్నే మాఫియాగా మార్చుకున్న మీకు., ఓ పవిత్రమైన లక్ష్యంతో పార్టీ పెట్టిన పవన్ గురించి మాట్లాడే అర్హత ఉందా..?
పార్లమెంట్ అంటే ఏంటో.. రాజకీయాలు అంటే ఏంటో..? మీకు తెలుసా..? ఓ పవన్ పుణ్యమా అని అసెంబ్లీ నుంచి పార్లమెంటుకి ప్రమోట్ అయ్యారేగాని., ఇప్పటి వరకు మీకు ఓట్లేసిన జనం కోసం అక్కడ మాట్లాడింది లేదు కదూ.. మీకు తెలియకే.. పవన్‌కళ్యాణ్‌ని అడిగి ఉంటారు..
మీకు మనస్సాక్షి ఉంటే..? మిమ్మల్ని, మీ పార్టీని పవన్ గెలిపించలేదని భావిస్తే..? అదే విషయాన్ని మీరు, మీ పార్టీ నాయకులు బహిరంగంగా ఒప్పుకోండి.. ఇంకా ధైర్యం ఉంటే.. జనసేనుడిపై చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉంటే., ఉన్నపళంగా రాజీనామా చేసి., మళ్లీ గెలిచి చూపించండి.. మీ అడ్డా తాడిపత్రి., అనంతపురం జనసైనికులు మీకు విసురుతున్న సవాల్ ఇది.. మీకు నిజంగా.. అదీ.. ఇదీ ఉంటే.. సై అనండి..
Jc chetta nayakudu, jai janasena