Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / జ‌నంలో దేశ‌భ‌క్తి.. ఉద్య‌మ స్ఫూర్తిని నింపే జ‌న‌సేన పాట‌లు(దేశ్ బ‌చావో) వ‌చ్చేశాయి..

జ‌నంలో దేశ‌భ‌క్తి.. ఉద్య‌మ స్ఫూర్తిని నింపే జ‌న‌సేన పాట‌లు(దేశ్ బ‌చావో) వ‌చ్చేశాయి..

కుట్ర‌లు, కుళ్లు , కుతంత్రాల‌తో నిండిపోయిన నేటి నీతిమాలిన రాజ‌కీయాల‌పై యుద్ధం ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., దేశ్ బ‌చావో పేరుతో రూపొందించిన డీజే మిక్స్ ఆల్బ‌మ్ ., జ‌నంలో ఉద్య‌మ‌కాంక్ష‌ను ర‌గిలించేందుకు అనుకున్న స‌మ‌యానికంటే ముందుగానే వ‌చ్చేశాయి.. మొత్తం ఆరు పాట‌ల్లో మంగ‌ళ‌వారం నాలుగు విడుద‌లవుతాయి.. అందులో మొద‌టిది ఇప్ప‌టికే జ‌న‌సేన అఫీయ‌ల్ యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా జ‌నాన్ని ఉర్రూత‌లూగిస్తోంది.. ఏ దేశ‌మేగినా ఎందుకాలిడినా పొగ‌డ‌రా నీ త‌ల్లి భూమి భార‌తిని… భార‌త్ మాతాకీ జై అంటున్న జ‌న‌సేనుడి గొంతుక గ‌ర్జ‌న‌ను బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తూ.. సాగుతున్న ఈ పాట త‌మ్ముడు సినిమాలోని పాట ట్యూన్‌తో డీజే మిక్స్ చేశారు..


ఉత్త‌ర‌భార‌త రాజ‌కీయ నాయ‌కుల‌కి మ‌నం క‌ట్టుబ‌డి ఉండోద్దు.. భార‌త రాజ్యాంగానికి మాత్ర‌మే క‌ట్టుబ‌డ‌దాం.. మ‌న ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకుందాం.. ఉత్త‌ర‌భార‌తీయుల‌కి రాజ్యాంగంపై ఎంత గౌర‌వం ఉందో.., మ‌న‌కీ అంతే గౌర‌వం ఉంది.. అందుకే ఢిల్లీ రాజ్య వీధుల‌కి విన‌బ‌డేలా ఓ సారి భార‌త్ మాత‌కి జై కొడ‌దాం అంటూ జ‌న‌సేనుడు గ‌ర్జించారు.. తెలుగు ప్ర‌జ‌ల్లో ఉద్య‌మ‌స్ఫూర్తిని నింపే ప్ర‌య‌త్నం చేశారు.. ఢిల్లీ నాయ‌కుల గులాంగిరీకి స‌లాం అంటున్న చేవ చ‌చ్చిన పొలిటీషియ‌న్స్ ఉలిక్కి ప‌డేలా గావ‌వుకేక పెట్టారు..
c262hbmveaeucxm

ప్ర‌జ‌లంతా తిర‌గ‌బ‌డి ఆంధ్రుల హ‌క్కు ప్ర‌త్యేక హోదా కోసం చేస్తున్న పోరాటానికి మ‌రింత ఉత్సాహం నింపారు.. వ‌ర‌ల్డ్ రికార్డు హోల్డ‌ర్ యువ జేడీ పృధ్వి మిక్స్ చేసిన ఈ పాట‌లు యువ‌త‌ను ఉర్రూత‌లూగిస్తున్నాయి.. ముందుగా ట్విట్ట‌ర్‌లో డీజే పృధ్వి ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇచ్చిన జ‌న‌సేనాని., త‌ర్వాత యూట్యూబ్ లింక్ పోస్ట్ చేశారు.. ఈ పాట‌లు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన 14 సినిమాల్లో పాట‌ల డిజే మిక్స్‌తో అల‌రిస్తాయి.. ప‌దేల్ల వ‌య‌సులోనే 2008లో నాన్‌స్టాప్‌గా మూడు గంట‌ల్లో వంద పాట‌ల‌కు డిజే చేసి వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించిన పృధ్వీ వీటిని మిక్స్ చేశారు.. ఓష‌న్స్ అనే అంత‌ర్జాతీయ ఆల్బ‌మ్ ద్వారా కూడా పృధ్వీ సుప‌రిచితుడు.. స‌ర్థార్ గ‌బ్బ‌ర్‌సింగ్ చిత్రానికి ప‌నిచేసిన‌ట్టు ప‌వ‌న్ తెలిపారు.. అత‌ని ఫోటోని కూడా ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ఏపీలో 175 స్థానాల‌పై జ‌న‌సేన గురి.. జ‌న‌సేనుడి రాజకీయ వ్యూహంతో ప్ర‌త్య‌ర్ధుల్లో అల‌జ‌డి..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వేసే ప్ర‌తి అడుగు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా సాధ‌న ఉధ్య‌మంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + 1 =

%d bloggers like this: