Home / జన సేన / జ‌నం కోసం జ‌న‌సేన ర‌క్త‌దాత‌లు.. ఒక్క అడుగుతో మొద‌లైన ఉద్య‌మం.. వంద‌ల ప్రాణాల‌కి భ‌రోసా..

జ‌నం కోసం జ‌న‌సేన ర‌క్త‌దాత‌లు.. ఒక్క అడుగుతో మొద‌లైన ఉద్య‌మం.. వంద‌ల ప్రాణాల‌కి భ‌రోసా..

జ‌నం కోసం జ‌న‌సేన.. అంటే.. దీనికి అర్ధాన్ని విడ‌మ‌ర్చి చెప్పే ముందు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అనంత గేట్‌లో విద్యార్ధుల‌తో జ‌రిగిన భేటీలో చెప్పిన ఓ మాట‌ని గుర్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఖ‌చ్చితంగా ఉంది.. ఒక్కో హీరో ఒక్కో గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటున్నారుగా..? మీరు అనంత‌పురం జిల్లాలో ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటారా..? ఈ ప్ర‌శ్న‌కు ఆయ‌నిచ్చిన బ‌దులు., నా సేవ‌లు ఏ ఒక్క గ్రామానికో ప‌రిమితం కారాదు.. ఒక్క గ్రామాన్ని కాదు.. రాష్ట్రం మొత్తాన్ని ద‌త్త‌త తీసుకుని ఎవ‌రికీ ఏ స‌మ‌స్యా లేకుండా ప‌రిష్క‌రించాల‌ని ఉంది.. అంటే ఆయ‌న ప‌రిధి ఎంత విస్తృత‌మో తెలిపే ఘ‌ట‌న ఇది.. అందుకే త‌న సైన్యాని(కార్య‌క‌ర్త‌ల‌)కి సామాజిక సేవ అనే మార్గాన్ని సూచించారు..

సామాజిక సేవ అంటే ఏంటి..? ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా మేమున్నాం అంటూ ముందుకి రావడం.. ఇందులో ర‌క్త‌దానానికి చాలా ప్రాముఖ్య‌త ఉంది.. ర‌క్త‌దానం ఆప‌ద‌లో ఉన్న ఓ వ్య‌క్తి ప్రాణానికి భ‌రోసా.. ప్రాణాపాయంలో ఉన్న ఓ వ్య‌క్తి పాలిట సంజీవ‌ని.. అంటే పోయే ప్రాణాల‌ను కాపాడుతుంది.. అందుకే ఈ ర‌క్త‌దానాన్ని ఓ స‌ర‌దాలాగా కాకుండా సీరియ‌స్‌గా., జ‌న‌సేన పార్టీ త‌రుపున ఓ ఉద్య‌మంగా నిర్వ‌హించాల‌ని ప‌శ్చిమ గోదావారి జిల్లాకి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త నిమ్మ‌ల స‌త్య‌నారాయ‌ణ‌.. త‌న‌తో మొద‌లు పెట్టిన ఆ ఉద్య‌మం., ఇప్పుడు ఇంతింతై అన్న‌గ్గు దిన‌దినాభివృద్ది చెందుతోంది..

ఇత‌ను ఓ బ్ల‌డ్ బ్యాంక్ పెట్ట‌లేదు.. క్యాంపులు నిర్వ‌హించ‌లేదు.. కేవ‌లం సామాజిక మాద్య‌మాల్లో మెస్సేజ్‌ల‌తో అన‌తి కాలంలోనే కొన్ని వంద‌ల మంది ప్రాణాలు కాపాడారు.. త‌న‌కు తెలిసిన అతికొద్ది మందితో మొద‌ట ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా బ్ల‌డ్ డోన‌ర్స్ అంటూ ఓ వాట్స‌ప్ గ్రూప్ ని ప్రారంభించారు.. ఆ త‌ర్వాత జ‌న‌సేన బ్ల‌డ్ డోన‌ర్స్ పేరులో మరో గ్రూప్‌.. ఇప్పుడు ఆ జ‌న‌సేన బ్ల‌డ్ డోన‌ర్స్ గ్రూపుల సంఖ్య ఐదుకి చేరింది.. స‌భ్యుల సంఖ్య వెయ్యి దాటింది.. ఈ మొత్తం స‌భ్యులు గ్రూప్‌లో ఎవ‌రికైనా ర‌క్తం కావాల‌ని పోస్టు పెడితే., బాధితులు త‌మ ద‌గ్గ‌ర‌లో ఉంటే., ఎక్క‌డి వారు అక్క‌డ స్పందించి వెంట‌నే ర‌క్తం ఇచ్చేస్తారు..

ఆరు నెల‌ల్లో సుమారు 400 నుంచి 500 మందికి పైగా ఈ జ‌న‌సేన ర‌క్త‌దాత‌లు ర‌క్త‌దానం చేసి ప్రాణాలు కాపాడారు.. ఇప్ప‌టికీ ఈ య‌జ్ఞం నిర్విజ్ఞంగా కొన‌సాగుతోంది.. రాయ‌ల‌సీమ‌లో మిన‌హా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు జ‌న‌సేన ర‌క్త‌దాత‌లు ఉన్నారు.. పైన చెప్పిన తొలి ప‌లుకులు ఇక్క‌డ అర్ధం అయ్యాయా.. జ‌న‌సేన‌.. జ‌న‌సేనాని.. జ‌న‌సైన్యం.. మా ప‌రిధి ఒక్క గ్రామానికి ప‌రిమితం కాదు.. మా ప‌రిధి విస్తృతం.. మ‌హా విస్తృతం.. ఇలాంటి పార్టీ., ఇలాంటి నాయ‌కుడు., ఇలాంటి కార్య‌క‌ర్త‌లున్న పార్టీకి జై కొట్టాల్సిందే..

Share This:

1,722 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 + 5 =