Home / జన సేన / జ‌నం గుండె ర‌గిలించే జ‌న‌సేన పాట‌లు.. రాజ‌మ‌హేంద్రిలో ఆడియో విడుద‌ల‌…

జ‌నం గుండె ర‌గిలించే జ‌న‌సేన పాట‌లు.. రాజ‌మ‌హేంద్రిలో ఆడియో విడుద‌ల‌…

img-20170101-wa0171

ఆక‌లి మంట‌లు, అప‌రిష్కృత‌మైన స‌మ‌స్య‌ల సంద్రం సునామీగా మారి జ‌నాన్ని చుట్టుముడితే., ఆ మంట‌లు ఆర్పేందుకు.., ఆ స‌మ‌స్య‌ల సుడి నుంచి గ‌ట్టెక్కించేందుకు నావికుడిగా మారిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ అంద‌రినీ ద‌రిచేర్చే ఉద్దేశంతో పార్టీని స్థాపించారు.. అందుకే ఆయ‌న‌కి అండ‌గా ప్ర‌జ‌లే సైనికులుగా మారి ముందుకి క‌దులుతున్నారు.. జ‌నం కోస‌మే పుట్టిన జ‌న‌సేన‌కి మ‌ద్ద‌తుగా త‌లో కార్య‌క్ర‌మాన్ని భుజాన వేసుకుని ముందుకి సాగుతున్నారు.. ఆ జ‌న‌సైనికుల్లో ఒక‌డైన బ‌ద్రీనాయుడు పార్టీకి, పార్టీ అధినేత‌కు మ‌ద్ద‌తుగా త‌న‌వంతుగా జ‌నం గుండెల్ని ర‌గిలించే గీతాల్ని ర‌చించాడు.. జ‌న‌సేన ప్ర‌జ‌ల గుండె ర‌గిలేరా.. అనే టైటిల్‌తో వాటిని స్వ‌ర‌ప‌ర్చాడు.. అద్భుత‌మైన ఈ పాట‌ల ఆడియో సిడి న్యూఇయ‌ర్ వేళ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో విడుద‌ల అయ్యింది.. జ‌న‌సేవ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కురాలు గంటాస్వ‌రూప‌దేవి చేతుల మీదుగా ఈ సీడీ విడుద‌ల అయ్యింది..

img-20170101-wa0170

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిధిగా బెజ‌వాడ‌కు చెందిన లింగినేని సాయిబాబ నాయుడు హాజ‌రయ్యారు. ర‌మేష్‌, కామిశెట్టి విష్ణు, కుంప‌టాల విజ‌య్‌గోపాల్‌, నాగ‌మ‌ణి త‌దిత‌ర ప్ర‌ముఖుల‌తో పాటు జ‌నసేన‌ కార్య‌క‌ర్త‌ల స‌మ‌క్షంలో విడుద‌లైన‌., ఈ ఆడియో నిజంగానే జ‌న‌సైనికుల గుండెని ర‌గిల్చేదిగా ఉంది.. సేనా.. జ‌న‌సేన‌.. అంటూ మొద‌లై ప్ర‌జ‌ల గుండె ర‌గిలే.. ప‌వ‌న‌న్న క‌దిలేనురా అనే ప‌ల్ల‌వితో మొద‌ల‌య్యే పాట పార్టీ శ్రేణుల్లో నూత‌నోత్సాహం నింప‌డంతో పాటు క‌సిని ర‌గిల్చేదిగా ఉంది..

\చ‌రిత్ర మార్చగ‌లిగే ద‌మ్ము ప‌వ‌న‌న్నకి మాత్ర‌మే ఉంది అంటూ మొద‌ల‌య్యే పాట కూడా ఆహుతుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.. త్వ‌ర‌లోనే దీనికి వీడియో రూపం కూడా ఇచ్చి., యూట్యూబ్ ద్వారా విడుద‌ల చేయ‌నున్నారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

అస‌లు ‘సూత్ర‌ధారి’.. ”అజ్ఞాత‌వాసి” టీవీ9 ‘ర‌విప్ర‌కాషే’.. కెమెరామెన్ ‘ట్విట్ట‌ర్‌’తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..

రెండు రోజులుగా వ‌రుస ట్వీట్ల‌తో నారా వారి మీడియా మాఫియాని బెంభేలెత్తిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. శ‌నివారం ఉద‌యం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × five =

%d bloggers like this: