Home / పవన్ టుడే / జ‌నం బ‌తుకుల్లో చీక‌ట్ల‌ను పార‌ద్రోలే కాట‌మ‌రాయుడు- ప్ర‌జ‌ల‌కు ప‌వ‌ర్‌స్టార్ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు..

జ‌నం బ‌తుకుల్లో చీక‌ట్ల‌ను పార‌ద్రోలే కాట‌మ‌రాయుడు- ప్ర‌జ‌ల‌కు ప‌వ‌ర్‌స్టార్ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు..

kt

సినిమా అయినా, రియ‌ల్ లైఫ్ అయినా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు సంచ‌ల‌న‌మే.. అలాంటిది కొంచెం గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న ప‌వ‌న్ చిత్ర‌మంటే., ఇంకా చెప్పేదేముంది.. ఏ క్ష‌ణాన ఎలాంటి వార్త వ‌స్తుందో..? ఏ క్ష‌ణాన ఎలాంటి ఫోటో బ‌య‌టికి వ‌స్తుందోన్న ఉత్కంఠ ఆయ‌న అభిమానుల‌తో పాటు యావ‌త్ తెలుగు ప్ర‌జ‌ల్లో ఉంటుంది.. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ప‌వ‌న్ పేరు చెప్పి దేన్న‌యినా ఇట్టే మార్కెట్ చేసేయొచ్చు.. ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్ లేటెస్ట్ మూవీ కాట‌మ‌రాయుడు జ‌నంలో హాట్ టాపిక్.. దాన్ని క్యాష్ చేసుకుంటూ శుక్ర‌వారం ఫ‌స్ట్ లుక్ అంటూ ఓ ఫోటో హ‌ల్‌చ‌ల్ చేసింది.. తాజాగా దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలుపుతూ., హీరోయిన్ శృతిహాస‌న్‌తో క‌లిసి దీపాలు వెలిగించే మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల అయ్యింది.. ఇందులో ఏది అఫీషియ‌ల్‌, అన్ అఫీషియ‌ల్ అన్న‌ది ప‌క్క‌న పెడితే., రెండింట్లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌ర్ లుక్‌ని జ‌నం ఎంజాయ్ చేస్తున్నార‌న్న‌ది మాత్రం వాస్త‌వం..

ప‌నిలో ప‌నిగా కాట‌మ‌రాయుడు స్టోరీ లైన్ ప్ర‌కారం., ఆ దీపాల‌తో త‌న ఊరి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపితే., రియ‌ల్ లైఫ్ లో హోదా సాధ‌న ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.. అదే స‌మ‌యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయుల‌కి, జ‌న‌సైన్యానికీ, త‌న అభిమానుల‌కి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు..

Share This:

584 views

About Admin

Check Also

నిజ‌మైన స‌ర్వే చేద్దాం రండి.. ప‌చ్చ‌-ప్ర‌తి ప‌చ్చ‌(సాక్షి) మీడియాల‌కి ఓపెన్ ఛాలెంజ్‌..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌ధ్యంలో.. స‌ర్వేలంటూ మీడియా హ‌డావిడి మొద‌లుపెట్టింది.. తెలంగాణ‌లో ప‌రిస్థితులు ఎలా వున్నా., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × 5 =