Home / జన సేన / జ‌నం స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనుడి విజ‌య‌ప‌రంప‌ర‌.. 40 నెల‌ల స‌మ‌స్య‌కి 40 రోజుల్లో ప‌రిష్కారం..

జ‌నం స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనుడి విజ‌య‌ప‌రంప‌ర‌.. 40 నెల‌ల స‌మ‌స్య‌కి 40 రోజుల్లో ప‌రిష్కారం..

ప్ర‌జల‌కు ఎక్క‌డ స‌మ‌స్య‌లు వుంటే అక్క‌డ నేను వుంటా.. స‌మ‌స్య‌లంటే నాకిష్టం.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం అంటే ఇష్టం.. మీ స‌మ‌స్య‌ల‌పై నేను పోరాటం చేస్తా.. చాలా బ‌ల‌మైన పోరాటం చేస్తా.. స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు పోరాటం చేస్తా.. స‌మ‌స్య వున్న చోటు నుంచి., ఆ స‌మ‌స్య‌ను ప్ర‌పంచం దృష్టికి తీసుకువెళ్తూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ళ్యాణ్ గ‌ళం విప్పిన ప్ర‌తిసారీ విన‌బ‌డే మాట‌లు ఇవి.. ఈ మాట‌లు స‌మ‌స్య‌ల్లో వున్న ప్ర‌జ‌ల‌కి భ‌రోసా ఇస్తే.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల్ని మాత్రం ప‌రిప‌రి విధాల క‌ల‌వ‌ర పెడుతూ వ‌స్తున్నాయి.. ఏదో మూల‌న ఫైళ్లు క‌ప్పెట్టి దాచిన స‌మ‌స్య‌ను యావ‌త్ ప్ర‌జానికానికీ తెలియ‌జేస్తున్నార‌న్న క‌ల‌వ‌ర‌పాటు పాల‌కుల‌ది అయితే., స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యాక దాన్ని ఎలా హైజాక్ చేయాలా అన్న క‌ల‌వ‌రం ప్ర‌తిప‌క్షానిది.. ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచిన ఇరు ప‌క్షాలు.., అదే ప్ర‌జ‌ల్ని స‌మ‌స్య‌ల కూపంలో క‌ట్టేసి., మ‌ళ్లీ ఓట్ల కోసం వ్యూహాలాప‌నతో కాలం గ‌డిపేస్తూ వ‌స్తున్నాయి.. కానీ ప్ర‌జా స‌మ‌స్య‌ల అధ్య‌య‌నానికి పోరాట యాత్ర మొద‌లు పెట్టిన జ‌న‌సేన అధినేత మాత్రం., ఒక్కో స‌మ‌స్య అంతం చూస్తూ ప్ర‌జ‌ల గుండెల్లో గూడు క‌ట్టుకుంటూ ముందుకి సాగుతున్నారు..

జ‌న‌సేనుడి ఖాతాలో తుమ్మ‌పాల విజ‌యం..
జ‌న‌సేన పోరాట యాత్ర‌లో భాగంగా ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎన్నో స‌మ‌స్య‌ల్ని ప్ర‌పంచం ముందు వుంచారు.. ప‌రిష్కార మార్గాలు చూపుతూ ప్ర‌భుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు.. అలా ఉంచిన డిమాండ్ల‌లో విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని తుమ్మ‌పాల షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ స‌మ‌స్య ఒక‌టి.. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 17 వేల 500 కుటుంబాలకి జీవ‌నాధారం అయిన ఈ ఫ్యాక్ట‌రీ 40 నెల‌ల క్రితం మూత‌ప‌డ‌గా., పాల‌కులు ఓట్లేసిన పాపానికి అన్ని వేల మంది తిన‌డానికి తిండి లేక‌., ఆక‌లి కేక‌ల‌కి బ‌ల‌వ్వాల్సిన ప‌రిస్థితి.. వీరి దుస్థితిని తెలుసుకున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట‌యాత్ర‌లో భాగంగా జులై 3వ తేదీన తుమ్మ‌పాల చ‌క్కెర క‌ర్మాగారాన్ని సంద‌ర్శించారు.. ఆ ఫ్యాక్ట‌రీపై ఆధార‌ప‌డివున్న కార్మిక‌, క‌ర్ష‌కుల వెత‌లు స్వ‌యంగా విని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.. వెంట‌నే కార్మిక స‌హాయ నిధికి త‌న వంతు ఆర్ధిక సాయాన్ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., తుమ్మ‌పాల షుగ‌ర్స్ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఆరు వారాల డెడ్‌లైన్ విధించారు.. లేకుంటే బాధితుల త‌రుపున జ‌న‌సేన పోరాటం చేస్తుంద‌ని హెచ్చ‌రించారు.. విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న ముగింపు సంద‌ర్బంగా మ‌రోసారి పాల‌కుల‌కి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు..                         Advertisement.

ఎన్నిక‌ల వేళ తుమ్మ‌పాల చ‌క్కెర క‌ర్మాగారం స‌మ‌స్య ప‌రిష్క‌రించాల్సి ఆవ‌శ్య‌క‌త వున్నా., ఆ క్రెడిట్ ఎక్క‌డ జ‌న‌సేన ఖాతాలోకి చేరిపోతుందోన‌న్న ఆందోళ‌న‌తో ప్ర‌భుత్వం మంకుప‌ట్టు ప‌ట్టి కూర్చుంది.. దీంతో జ‌న‌సేన అధినేత ఆదేశాల‌తో జ‌న‌సైనికులు రంగంలోకి దిగి., రాజ‌ధాని వేదిక‌గా ఆందోళ‌న చేప‌ట్టారు.. నానాటికీ ప్ర‌భుత్వంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌కి, జ‌న‌సేన ఒత్తిడికి చివ‌రికి త‌లొగ్గ‌త త‌ప్ప‌లేదు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డిమాండ్ మేర‌కు., ఆ చ‌క్కెర క‌ర్మాగారాన్ని తిరిగి ప్రారంభించేందుకు గాను 30 కోట్ల రూపాయిల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన‌ట్టు తెలుస్తోంది..

దీంతో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వ్య‌వ‌హారంలో జ‌న‌సేనాని స‌త్తా మ‌రోసారి రుజువైంది.. జ‌న‌సేన ప‌ట్ల ప్ర‌జ‌ల్లో మ‌రింత న‌మ్మ‌కం పెరిగింది.. అంతేకాదు వివిధ వ‌ర్గాల చేరిక‌తో విశాఖ జిల్లాలో బ‌లం పుంజుకున్న జ‌న‌సేన‌కు తుమ్మ‌పాల విజ‌యం మ‌రింత బూస్ట్ ఇచ్చిన‌ట్ట‌య్యింది.. విప‌క్ష నేత పాద‌యాత్ర‌లో తుమ్మ‌పాల స‌మ‌స్య ఆయ‌న‌కి తెలియ‌దు.. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌లో ఆ ప్రాంత నేత‌లు ఎన్న‌డూ ఈ స‌మ‌స్య‌ని ఆయ‌న దృష్టికి తీసుకురాలేదు.. కేవ‌లం ఆ క‌ర్మాగారం ఆస్తుల‌ని ఎలా అమ్ముకోవాల‌న్న అంశంపైన మాత్రం అత్యంత శ్ర‌ద్ద చూపిన‌ట్టు అక్క‌డి కార్మిక సంఘాల ఆరోప‌ణ‌.. ఈ త‌రుణంలో కార్మిక‌-క‌ర్ష‌క వ‌ర్గాల కోసం జ‌న‌సేనుడు పోరుబావుటా ఎగుర‌వేసి సాధించిన ఈ విజ‌యం ఎంతో ప్ర‌త్యేకం..

Advertisement.

Share This:

3,463 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − 16 =