Home / జన సేన / జ‌నావాసాల మ‌ధ్య డంపింగ్ యార్డ్‌.. జ‌న‌సైన్యం చొర‌వ‌తో జ‌నానికి ఊర‌ట‌..

జ‌నావాసాల మ‌ధ్య డంపింగ్ యార్డ్‌.. జ‌న‌సైన్యం చొర‌వ‌తో జ‌నానికి ఊర‌ట‌..

ప్ర‌జ‌ల‌కి సౌక‌ర్యాలు క‌ల్పించాల్సిన ప్ర‌భుత్వాలు.. సౌక‌ర్యాల క‌ల్ప‌న మాట అటుంచితే., రోజుకో కొత్త స‌మ‌స్య‌ని జ‌నం మీద రుద్దాల‌ని చూస్తున్నాయి.. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల కాల‌ప‌రిమిది ముగియ‌గా., స్పెష‌ల్ ఆఫీస‌ర్ల‌ని అడ్డుపెట్టుకుని ప‌చ్చ చొక్కాలు ఇష్టారాజ్యంగా రాజ్య‌మేలే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.. త‌మ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌ని ప్ర‌జ‌ల్ని నిత్యం ఏదో ర‌కంగా ఇబ్బంది పెట్ట‌డ‌మే వీరి ప‌ని.. కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంల‌లోని ల‌క్ష్మీపురం గ్రామ పంచాయితీ ప‌రిధిలో ఇలాంటి ప్ర‌య‌త్న‌మే జ‌రిగింది.. 3వ వార్డులో ఎస్‌సీ, ఎస్టీ, బీసీలు నివ‌శించే ఇందిర‌మ్మ కాల‌నీతో పాటు చెంచులు నివ‌సించే మ‌రో కాల‌నీకి అత్యంత స‌మీపంలో., త‌డిపొడి చెత్త‌తో వ‌న‌రులు సృష్టించే కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.. ప‌క్క‌నే వున్న శ్మ‌శానం భూమిలో ఈ డంపింగ్ యార్డ్ ప్ర‌క్రియ మొద‌లు పెట్టేశారు.. ఇక్క‌డ కాల‌నీ ఏర్ప‌డి నాలుగేళ్లు గ‌డ‌చినా., క‌నీస సౌక‌ర్యాలైన ర‌హ‌దారులు, వీధి లైట్లు లాంటి వ‌స‌తులు క‌ల్పించ‌ని పాల‌కులు.. జ‌నం నెత్తిన చెత్త వేసేందుకు రెడీ అయ్యారు.. ఇప్ప‌టికే అప‌రిశుభ్ర‌త కార‌ణంగా సంబంధిత కాల‌నీల్లో డెంగీ ప్ర‌భ‌లిన నేప‌ధ్యంలో., డంపింగ్ వ్య‌ర్ధాలు అక్క‌డ వేయ‌డాన్ని ఇరు కాల‌నీల వాసులు వ్యతిరేకిస్తున్నారు.. సుమారు 250 కుటుంబాలు అక్క‌డ నివాసం వుంటుండ‌గా., ఊరి చివ‌ర వేయాల్సిన చెత్త‌ని., బ‌ల‌వంతంగా ఇళ్ల మ‌ధ్య వేస్తుండ‌డం ప‌ట్ల జ‌నం మండిప‌డుతున్నారు.

ప్ర‌భుత్వ యంత్రాంగం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా జ‌నం రోడ్డెక్కి నిర‌స‌న తెలిపేందుకు రెడీ అవ‌గా., అధికారులు వారిని బెధిరిస్తూ వ‌చ్చారు.. దీంతో విష‌యం కాస్త స్థానిక జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల దృష్టికి వ‌చ్చింది.. విష‌యం తెలుసుకున్న వెంట‌నే బాధితులు నిర‌స‌న తెలుపుతున్న ప్రాంతానికి వెళ్లిన జ‌న‌సైనికులు., వారికి అండ‌గా నిల‌బ‌డాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. ముందుగా ప‌ద్ద‌తి ప్ర‌కారం ఓ విజ్ఞాప‌న ప‌త్రం మండ‌ల రెవెన్యూ అధికారికి రాయించి, కాల‌నీ వాసుల‌తో పంపారు.. అనంత‌రం వంద‌ల మంది అవ‌స్థ‌ల్ని క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.. అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఈ మొత్తం నిర‌స‌న‌ను త‌మ భుజాల మీద వేసుకున్నారు..

జ‌న‌సేన ఎంట్రీతో డంపింగ్ వ్యర్ధాల ప్రాజెక్ట్‌కి తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది.. ఇక్క‌డ ఇంకో విష‌యం కూడా వుంది.. ఈ సంప‌ద ఉత్ప‌త్తి కేంద్రాల పేరుతో ప‌చ్చ పాల‌కులు మ‌రో పెద్ద స్కామ్‌కి తెర‌తీసిన‌ట్టుగా తెలుస్తోంది.. ప్ర‌తి గ్రామంలో వ్య‌ర్దాల నిర్వ‌హ‌ణ ప్రాజెక్టుల పేరిట తెలుగు త‌మ్ముళ్ల జేబులు నింపే ప్ర‌క్రియ జోరందుకున్న‌ట్టు టాక్‌.. ఈ వ్య‌వ‌హారంపై కూడా జ‌న‌సైనికులు పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్నారు.. దీంతో పాటు అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ల‌క్ష్మీపురం పంచాయితీ ఇందిర‌మ్మ కాల‌నీ స‌మ‌స్య కూడా ఈ జేబులు నింపుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా భావించిన జ‌న‌సైనికులు., జ‌నావాసాల మ‌ధ్య ఢంపింగ్ వ్య‌ర్ధాల ప్ర‌జెక్టు ఆప‌కుంటే., అదే జ‌నంతో రోడ్డెక్కుతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.. ప్రాజెక్టుని నిలుపుద‌ల చేసి., ఊరి శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు..

Share This:

1,645 views

About Syamkumar Lebaka

Check Also

స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీ ఓ స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో ముందుకు వెళ్తుంద‌ని సిబిఐ మాజీ జేడీ, విశాఖ ఎంపి అభ్య‌ర్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × five =