Home / పోరు బాట / జ‌న‌వ‌రిలో జ‌న‌సేనాని నాలుగో స‌భ‌.. ముందే ఉద్దానం ప‌ర్య‌ట‌న‌..

జ‌న‌వ‌రిలో జ‌న‌సేనాని నాలుగో స‌భ‌.. ముందే ఉద్దానం ప‌ర్య‌ట‌న‌..

అనంత‌పురం సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య స‌భ జ‌రిగి నెల రోజులు దాటింది.. మ‌రి ప్ర‌త్యేక హోదా నినాదంతో జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేస్తున్న పోరాటానికి సంబంధించి త‌దుప‌రి ఘ‌ట్టం ఏంటి..? త‌ర్వాత స‌భ ఎక్క‌డ‌..? ఎప్పుడు..? ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారాన్ని తెర‌మ‌రుగు చేసే ప్ర‌య‌త్నాల్లో భాగంగా ప్ర‌చారానికి తెర‌తీస్తే., ప‌వ‌న్ ఎప్పుడు బ‌య‌టికి వ‌స్తారంటే., అప్పుడే ప్ర‌త్యేక హోదా అంశం గుర్తుకు వ‌చ్చే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ అస‌లు ఆ ఊసే ఎత్త‌డం లేదు.. ఇప్పుడు వ్య‌వ‌హారం నోట్ల రద్దుపై న‌డుస్తోంది.. మోడీ నిర్ణ‌యంపై రార్ధాంతం చేసే ప‌నిలో అంతా బిజీగా ఉన్నారు.. పైకి చెప్ప‌క‌పోయినా ఈ వ్య‌వ‌హారంలో చాలా మంది పని తేలు కుట్టిన దొంగ‌ల చందంగా త‌యారైంది..

ఇక అస‌లు విషయానికి వ‌స్తే.. జ‌న‌సేనాని మ‌ళ్లీ జ‌నంలోకి ఎప్పుడు వ‌స్తార‌న్న‌దే.. ఇప్పుడు హాట్ టాపిక్‌.. వాస్త‌వానికి ఈ నెల‌లోనే జ‌న‌సేనాని రెండుసార్లు ప్ర‌జ‌ల్లోకి రావాల్సి ఉంది.. ఈ నెల ఆరున శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో క‌డ్నీ రోగుల్ని ప‌రామ‌ర్శించ‌డం., ఆ త‌ర్వత ప‌బ్లిక్ మీటింగ్ అనుకున్నారంతా.. అయితే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో., జ‌న‌సేనాని త‌న ప్రోగ్రాంని వాయిదా వేసుకున్నారు.. దీంతో ఆయ‌న మ‌ళ్లీ బ‌య‌టికి ఎప్పుడు వ‌స్తారు.. అన్న స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.. ఈ స‌స్పెన్స్‌కి తెర‌దించే తీపి క‌బురు ఏంటంటే., ప్ర‌స్తుతం ఔట్‌డోర్ షూటింగ్‌లో ఉన్న ఆయ‌న వ‌చ్చే నెల‌లో త‌న నాలుగో స‌భ‌కు స‌న్నాహాలు చేస్తున్నారు.. ఇంకో విషయం ఏంటంటే ప‌బ్లిక్ మీటింగ్ కంటే ముందే ఉద్దానం ప‌ర్య‌ట‌న కూడా ఉంటుందంట‌.. ఈ నెలాఖ‌రు లోపు ఉద్దానం ప‌ర్య‌ట‌న ఉంటే., పండుగకి కొంచెం అటూ ఇటుగా ప‌బ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.. మొద‌టి వారంలో ఉద్దానం వెళ్తే గ‌నుక పండుగ త‌ర్వాతో స‌భ ఉంటుంది.. ఇందుకు సంబంధించిన క‌స‌ర‌త్తు ఒక‌టి రెండు రోజుల్లో పూర్తి కానుంది.. వ‌చ్చే వారంలో వివ‌రాలు పార్టీ అధికారికంగా వెలువ‌రిస్తుంది..

అటు ఉద్దానం శ్రీకాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న ఓకే., మ‌రి ప‌బ్లిక్ మీటింగ్ ఎక్క‌డ అన్న సందేహాలు స‌ర్వ‌త్ర వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. ప‌బ్లిక్ మీటింగ్‌కి సంబంధించి కూడా ఇప్ప‌టికే ప‌లు జిల్లాల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.. ఒంగోలు, ప‌శ్చిమ‌గోదావ‌రితో పాటు మ‌రో రెండు జిల్లాలపై ప‌వ‌న్ చూపు ఉంది.. ఆక్వా ఫుడ్ పార్క్ వ్య‌వ‌హారం, కొల్లేరు నిర్వాసితుల స‌మ‌స్య‌ల నేప‌ధ్యంలో ఇక్క‌డ స‌భ కంటే ప‌ర్యట‌నే మేల‌న్న ఉద్దేశం కూడా ఉంది.. ప్ర‌కాశం జిల్లా ఇటు గుంటూరు., అటు నెల్లూరు ద‌న్నుగా ఉన్నా., మ‌ధ్య‌లో సున్నాగానే మిగిలిపోయింది.. ఇక్క‌డ అభివృద్ది అంతంత మాత్ర‌మే.. క‌నుక ఇక్క‌డ పెడితే., జిల్లా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఎలుగెత్తిన‌ట్టు ఉంటుంది., ప్ర‌త్యేక హోదా వాద‌న బ‌లంగా వినిపించిన‌ట్టూ ఉంటుంద‌న్న వాద‌నా పార్టీ వ‌ర్గాల్లో విన‌బ‌డుతోంది.. అయితే ఇంకో రెండు జిల్లాల పేర్లు కూడా ప‌రిశీల‌న‌లో ఉండ‌డంతో., ఎక్క‌డ అన్న విషయం తేలాల్సి ఉంది.. ప్లేస్ ఎక్క‌డైనా స‌భ మాత్రం జ‌న‌వ‌రిలో ఖాయంగా తెలుస్తోంది..

Share This:

1,300 views

About Syamkumar Lebaka

Check Also

క‌డ‌ప‌ కోట‌లో పాగా వేసేదెవ‌రు.? జ‌న‌సేన చ‌రిత్ర సృష్టించ‌నుందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు.. ఏలయినా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని క‌ల‌లు కంటున్న ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి, తిరిగి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen + 5 =