Home / పవన్ టుడే / జ‌న‌వ‌రి 3న ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌కు ప‌వ‌న్ ప‌రామ‌ర్శ‌..

జ‌న‌వ‌రి 3న ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌కు ప‌వ‌న్ ప‌రామ‌ర్శ‌..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది.. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌ని ప‌లుక‌రించేందుకు జ‌న‌వ‌రి 3న ఆయ‌న ఇచ్చాపురం వెళ్ల‌నున్నారు.. షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 6న ఆయ‌న ఇచ్చాపురం రావాల్సి ఉండ‌గా., దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది.. అనంత‌రం కాట‌మ‌రాయుడు షెడ్యూల్ ఉండ‌డంతో., ఆయ‌న సిక్కోలు రాలేక‌పోయారు.. ఇప్పుడు అదే కార్య‌క్ర‌మం కోసం జ‌న‌వ‌రి 3న ఆయ‌న ఇచ్చాపురం రానున్నట్టు జ‌న‌సేన పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.. ప‌వ‌న్ రాక‌కోసం ఉద్దానం మూత్ర‌పిండాల వ్యాధిగ్ర‌స్తులు వేయిక‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.. ఈ ప‌ర్య‌ట‌న కేవ‌లం అంత‌ర్గ‌త స‌మావేశానికే ప‌రిమితమ‌వుతుంద‌ని వెల్ల‌డించాయి.. స్థానిక మ‌ణికంఠ థియెట‌ర్‌లో రెండు గంట‌ల పాటు సాగ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల్ని ప‌రామ‌ర్శించ‌డంతో పాటు వారితో ముఖాముఖిలో పాల్గొంటారు.. ఉద్దానంలో ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌నే., ఈ ప‌ర్య‌ట‌న ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.. ప‌బ్లిక్ మీటింగ్ కానందున అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చి నిర్వాహ‌కుల్ని ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని జ‌న‌సేన వ‌ర్గాలు విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి.. జ‌న‌వ‌రి 3న విమానంలో విశాఖ చేరుకోనున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఉద‌యం 10-11 గంట‌ల మ‌ధ్య ఇచ్చాపురం చేరుకుంటారు.. అప్ప‌టికే లోప‌ల ఉన్న ఉద్దానం కిడ్నీ రోగుల‌తో ముఖాముఖి అనంత‌రం తిరిగి వెళ్లిపోతారు..

ప‌వ‌న్ ఉద్దానం ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని తెలియ‌గానే., స్థానిక ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టిమ‌రీ ఆ ప్రాంతంలో డ‌యాల‌సీస్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.. ఇక సంక్రాంతి లోపే జ‌న‌సేనాని నాలుగో ప‌బ్లిక్ మీటింగ్ కూడా ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది..

Share This:

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనకి కామ‌న్ సింబ‌ల్(లాంత‌ర్) అనే ప్ర‌చారం అబ‌ద్దం.. పార్టీ శ్రేణులు న‌మ్మ‌వ‌ద్దు..

జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌ని గంద‌ర‌గోళానికి గురి చేసేందుకు ప్ర‌త్య‌ర్ధులు రోజుకో కొత్త ప్ర‌య‌త్నంతో ముందుకి వ‌స్తున్నారు.. జ‌న‌సేన పార్టీకి ప్ర‌ధాన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 5 =

%d bloggers like this: