Home / పవన్ టుడే / జ‌న‌సింహం ఉద్దానం గ‌ర్జ‌న‌కు స‌ర్వం సిద్ధం… ఇఛ్చాపురం బ‌య‌లుదేరిన ప‌వ‌న్‌..

జ‌న‌సింహం ఉద్దానం గ‌ర్జ‌న‌కు స‌ర్వం సిద్ధం… ఇఛ్చాపురం బ‌య‌లుదేరిన ప‌వ‌న్‌..

img-20170102-wa0091 img-20170103-wa0010

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప‌ర్య‌ట‌న కాసేప‌ట్లో ప్రారంభం కాబోతోంది.. ఇప్ప‌టికే ఆయ‌న విశాఖ నుంచి ఇఛ్ఛాపురంకి బ‌య‌లుదేరారు.. ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్తి అయ్యాయి.. ప‌వ‌న్ రోడ్ షోకి టాప్ లెస్ జీప్‌తో పాటు ఇచ్చాపురం మ‌ణికంఠ మ్యాక్స్ థియెట‌ర్‌లో వేదిక మొత్తం పూర్త‌య్యాయి.. కాసేప‌ట్లో ఇక్క‌డ ఉద్దానం మూత్ర‌పిండాల వ్యాధిగ్ర‌స్తుల్ని జ‌న‌సేనాని ప‌లుక‌రిస్తారు.. వారిఇ బాధ‌లు ప్ర‌త్య‌క్షంగా తెలుసుకుంటారు.. పూర్తి ప్ర‌యివేటు కార్య‌క్ర‌మంగా ఇది కొన‌సాగ‌నుంది.. షెడ్యూల్ ప్ర‌కారం 10-11 గంట‌ల మ‌ధ్య ఇఛ్చాపురం చేరుకోనున్న ఆయ‌న‌., రెండు గంట‌ల పాటు ఉద్దానం బాధితుల‌తో మాట్లాడ‌తారు.. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం రోడ్ షో ఉంటుంది..

ఇది జ‌న‌సేనాని తొలి రోడ్ షో కావ‌డంతో., అభిమానులు జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందిగా పార్టీ వ‌ర్గాలు విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి.. ఎవ‌రికి వారు స్వీయ నియంత్ర‌ణ‌తో మెల‌గాల‌ని., జ‌న‌సేనానికి ఇబ్బందులు క‌లుగ‌కుండా చూడ‌డంతో పాటు తొక్కిస‌లాట‌ల్లాంటి వాటికి తావివ్వ‌కుండా కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయ్యేలా అంతా స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు.. జ‌న‌సైనికులు క్ర‌మ‌శిక్ష‌ణ‌కి మారు పేరు అన్న విష‌యాన్ని చాటి చెప్పాల‌ని కోరుతున్నారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌జ‌ల్ని చంపే అభివృద్ది ఎవ‌రికోసం.. సోంపేట బాధితుల త‌రుపున జ‌న‌సేనుడి నిల‌దీత‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర రెండో రోజు ఇచ్చాపురం నుంచి సోంపేట మీదుగా ప‌లాస‌కి చేరుకుంది.. సోంపేట చిత్త‌డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + 7 =

%d bloggers like this: