Home / జన సేన / జ‌న‌సేనకి కామ‌న్ సింబ‌ల్(లాంత‌ర్) అనే ప్ర‌చారం అబ‌ద్దం.. పార్టీ శ్రేణులు న‌మ్మ‌వ‌ద్దు..

జ‌న‌సేనకి కామ‌న్ సింబ‌ల్(లాంత‌ర్) అనే ప్ర‌చారం అబ‌ద్దం.. పార్టీ శ్రేణులు న‌మ్మ‌వ‌ద్దు..

జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌ని గంద‌ర‌గోళానికి గురి చేసేందుకు ప్ర‌త్య‌ర్ధులు రోజుకో కొత్త ప్ర‌య‌త్నంతో ముందుకి వ‌స్తున్నారు.. జ‌న‌సేన పార్టీకి ప్ర‌ధాన ఆయుధ‌మైన సోష‌ల్ మీడియాని ఉప‌యోగించుకుని త‌మ కుయుక్తుల‌ను ప్ర‌యోగిస్తున్నారు.. దీంతో జ‌న‌సేన శ్రేణులు వారి ఉచ్చులో ప‌డి అస‌లు వార్త ఏది.. అబ‌ద్దం ఏది.. అనే విష‌యం తెలియ‌క తిక‌మ‌క ప‌డుతున్నారు.. మొన్న‌టికి మొన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ని ప్ర‌క‌టించేశారు.. 16వ తేదీ నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌న్న‌ది ఆ వార్త సారాంశం.. అయితే పార్టీ శ్రేణులు మొద‌టి నుంచి చెబుతూనే ఉన్నాయి.. జ‌న‌సేన పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా, ఎలాంటి అప్‌డేట్ ఉన్నా పార్టీ అధికార ప్ర‌తినిధులు గానీ, స్వ‌యంగా పార్టీ అధ్య‌క్షుడు గాని ప్ర‌క‌టిస్తారు.. నేరుగా ప్ర‌క‌టించే అవ‌కాశం లేని ప‌క్షంలో అధికారికంగా ప్రెస్ నోట్ విడుద‌ల చేస్తారు..

తాజాగా జ‌న‌సేన సోష‌ల్ మీడియా అస్త్రం శ‌త‌గ్ని అన్న ప‌దాన్ని పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫోటోపై ఎడిట్ చేసి, ఆయ‌న చేతిలో లాంత‌ర్ ఉన్న‌ట్టుగా ఓ ఫోటోని సామాజిక మాధ్య‌మాల్లోకి పంపారు.. జ‌న‌సేన పార్టీకి కామ‌న్ సింబ‌ల్‌గా లాంత‌ర్‌ని కేటాయించార‌న్న‌ది అర్ధం వ‌చ్చేలా ఫోటోని డిజైన్ చేశారు.. శ‌త‌గ్ని అన్న పేరు ఉండ‌డంతో జ‌న‌సేన పార్టీకి లాంత‌ర్ గుర్తు వ‌చ్చేసింద‌ని జ‌న‌సేన శ్రేణులు న‌మ్మేశారు.. వార్త‌ని నిర్ధారించుకునేందుకు ఒక‌రికి ఒక‌రు ఫోన్ చేసుకుని పార్టీకి సింబ‌ల్ వ‌చ్చిన విష‌యంపై చ‌ర్చ‌లు కూడా మొద‌లు పెట్టారు..

ఈ ఫేక్ న్యూస్‌.. అదే త‌ప్పుడు వార్త క్ష‌ణాల్లో వైరల్‌గా మారింది.. వాస్త‌వానికి జ‌న‌సేన పార్టీకి ఎలాంటి గుర్తు రాలేదు.. ఇది పార్టీ శ్రేణుల‌ని గంద‌ర‌గోళానికి గురిచేసేందుకు ప్ర‌త్య‌ర్ధులు ప‌న్నిన ప‌న్నాగం.. జ‌న‌సేన పార్టీ విష‌యంలో ప‌దే ప‌దే ఇలాంటి అబ‌ద్ద‌పు ప్ర‌చారాలు వ‌స్తున్నా., పార్టీ శ్రేణులు గంద‌ర‌గోళానికి గుర‌వుతూనే ఉన్నారు.. ప్ర‌త్య‌ర్ధులు ప‌న్నిన వ‌ల‌లో ప‌డుతూనే ఉన్నారు..

జ‌న‌సేన పార్టీకి సంబంధించి ఏ వార్త వ‌చ్చినా షేర్ చేసేముందు ఒక్క క్ష‌ణం ఆలోచించండి.. అధి పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించిందా లేదా అన్న విష‌యాన్ని నిర్ధారించుకోండి.. ఆ త‌ర్వాత మాత్ర‌మే వార్త‌లకి ప్ర‌చారం క‌ల్పించండి. జ‌న‌సేన పార్టీకి సంబంధించి ఎలాంటి స‌మాచారం అయినా పార్టీ అధ్య‌క్షుడుగానీ, ఆయ‌న నియ‌మించిన అధికార ప్ర‌తినిధులు గానీ, లేదా పార్టీ మీడియా విభాగం నుంచి విడుద‌ల‌య్యే ప్రెస్ నోట్ రూపంలో గానీ వెలువ‌డ‌తుంది.. ద‌య చేసి పార్టీ శ్రేణులు ఇలాంటి త‌ప్పుడు వార్త‌ల వ‌ల‌లో ప‌డి గంద‌ర‌గోళానికి గురి కావ‌ద్దు.. తోటి కార్య‌క‌ర్త‌ల్ని గంద‌ర‌గోళానికి గురిచేయొద్దు.. ఇది పార్టీ కార్యాల‌య వ‌ర్గాల విజ్ఞ‌ప్తి..

Advertisement..

Share This:

5,058 views

About Syamkumar Lebaka

Check Also

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని దారులు అటువైపే.. తారా స్థాయికి ప్ర‌వాసగ‌ర్జ‌న హీట్‌..!!!

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అల‌జ‌డి మొద‌లైంది.. డ‌ల్లాస్ వేదిక‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌ర్జన‌కి ముహుర్తం ఖ‌రారైన రోజునే ఆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 + 14 =