Home / జన సేన / జ‌న‌సేనానితో మొద‌లైన నాదెండ్ల ప్ర‌యాణం. రేపు బెజ‌వాడ‌లో పార్టీలో చేరిక‌..

జ‌న‌సేనానితో మొద‌లైన నాదెండ్ల ప్ర‌యాణం. రేపు బెజ‌వాడ‌లో పార్టీలో చేరిక‌..

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ జ‌న‌సేన పార్టీలో చేరిక ఖాయం అయిన నేప‌ధ్యంలో, ఒక రోజు ముందుగానే పార్టీ అధినేత‌తో ఆయ‌న ప్ర‌యాణం మొద‌లు పెట్టారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి స్పీక‌ర్‌గా ప‌నిచేసిన ఆయ‌న‌, రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం క్రియాశీల రాజ‌కీయాల‌కి దూరంగా ఉన్నారు.. అయితే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో ఉన్న వ్య‌క్తిగ‌త సాన్నిహిత్యం నేప‌ధ్యంలో, ఆవిర్భావం నాటి నుంచి పార్టీని అనుస‌రిస్తూ వ‌స్తున్నారు. జ‌న‌సేన పార్టీకి సంబంధించిన చాలా అంశాలపై నాదెండ్ల, జ‌న‌సేనానికి త‌న అభిప్రాయాలు వ్య‌క్త ప‌రుస్తూ ఉండేవారు. అంటే అధికారికంగా మ‌నోహ‌ర్ శుక్ర‌వారం జ‌న‌సేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నా., మాన‌సికంగా ఎప్ప‌టి నుంచో పార్టీ స‌భ్యుడిగా ఉన్నారు.. జ‌న‌సేన అధినేత విజ‌య‌వాడ‌లో ఇల్లు అద్దెకు తీసుకున్న వెంట‌నే నాదెండ్ల ఆయ‌న్ని క‌ల‌వ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్‌గా కూడా మారింది.. అప్పుడే మ‌నోహ‌ర్ జ‌న‌సేన తీర్ధం పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌ని మీడియా మొత్తం కోడై కూసింది కూడా..

తాజాగా శుక్ర‌వారం కీల‌క ప‌రిణామం చోటు చేసుకోనున్న నేప‌ధ్యంలో, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో క‌ల‌సి ఒక రోజు ముందు నాదెండ్ల ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. రాజ‌కీయ ప్ర‌యాణం అధికారికంగా 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇరువురు నేత‌లు ఒక రోజు ముందు, అంటే గురువారం ప్ర‌త్యేక విమానంలో క‌ల‌సి తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లారు.. శుక్ర‌వారం ఉద‌యం ఇరువురు శ్రీనివాసుని ద‌ర్శించుకుంటారు.. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఈ ఇద్ద‌రు విమానం దిగిన త‌ర్వాత విడుద‌ల చేసిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో దిగిన సెల్ఫీ హ‌ల్ ఛ‌ల్ చేస్తోంది.. న‌వ‌త‌రం రాజ‌కీయాల‌కి నాందీ ప‌లుకుతూ మొద‌లైన ఇరువురి నాయ‌కుల క‌ల‌యిక‌, తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో ఓ నూత‌న శ‌కాన్ని లిఖించ‌నుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం చెబుతున్నారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, మ‌నోహ‌ర్‌ల‌కి రేణిగుంట ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణుల నుంచి ఘ‌న‌స్వాగ‌తం కూడా ల‌భించింది..

ఇదిలావుంటే శ్రీవారి ద‌ర్శ‌నం అనంత‌రం శుక్ర‌వారం ఇరువురు నేత‌లు విజ‌య‌వాడ చేరుకుంటారు.. సాయంత్రం నాదెండ్ల మ‌నోహ‌ర్ అధికారికంగా పార్టీ కండువా క‌ప్పుకుంటారు. ఇప్ప‌టికే మ‌నోహ‌ర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు కూడా..

Share This:

2,398 views

About Syamkumar Lebaka

Check Also

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని దారులు అటువైపే.. తారా స్థాయికి ప్ర‌వాసగ‌ర్జ‌న హీట్‌..!!!

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అల‌జ‌డి మొద‌లైంది.. డ‌ల్లాస్ వేదిక‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌ర్జన‌కి ముహుర్తం ఖ‌రారైన రోజునే ఆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three − two =