Home / పవన్ టుడే / జ‌న‌సేనాని(లీడ‌ర్‌) హృద‌యం..

జ‌న‌సేనాని(లీడ‌ర్‌) హృద‌యం..

లీడ‌ర్ అంటే ఎలా ఉంటాడు..? ఇప్ప‌టి వ‌ర‌కు మీరు చూసిన‌, మీరు అనుకున్న లీడ‌ర్లు ఎలా ఉన్నారో తెలియ‌దు గాని., ఈ లీడ‌ర్ మాత్రం మ‌హోన్న‌త వ్య‌క్తిత్వం క‌లిగిన‌వాడు.. మాట‌ల్ని చేత‌లుగా మార్చి చూపేవాడు.. భ‌విష్య రాజ‌కీయాల‌కు దార్శ‌నీకుడు.. ఆయ‌న జన‌సేనాని.. ఎందుకో చూడండి..
అందరికి నా హృదయ పూర్వక నమస్కారాలు.. ఈ రోజున జీసస్ వృద్ధాశ్రమం కొత్త గా ప్రారంభిస్తున్నాం కొత్త బిల్డింగ్ లోకి మీరందరు ప్రవేశిస్తున్నందుకు నా మనస్పూర్తి గా నా అభినందనలు తెలియ చేస్తున్నాను.. దీని ద్వారా మీ అందరికి సంపూర్ణమైన ఆయురారోగ్యాలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. దీనిని స్థాపించిన శ్రీ లక్ష్మీ నరిసింహమ్మ గారికి.,ఆమె నా తల్లితో సమానం..ఎందుకంటే ఆమె ఎవరు లేని పెద్దలనందరిని వృద్దులని ఎలా ఆదుకోవాలి అని చెప్పి తపనపడి ఆమె ఎంత ఏడ్చారో నాకు బాగా తెలుసు. ఆవిడ కన్నీళ్లే నన్ను చల్లగా కరుణించినాయి..అంటే ఒక మనిషి ఒక చాల చిన్న ఉద్యోగం నుంచి ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఇలాగ ఎవరు లేని పిల్లలు ఉండీ కూడా అనాథలైన పెద్దలకి ఆవిడ అండగా నిలబడాలని ఆవిడ గురించి ఆవిడ తండ్రి నుండి ఆమెకు సంక్రమించిన ఆస్తి వృద్ధాశ్రమం పెద్దలని చూసుకుంటున్న ఒక మంచి అలవాటు..అదే ఆమెకి సంక్రమించిన ఆస్తి..ఆ ఆస్తి కోసం వాళ్ళకి నేను తిండి పెట్టలేకపోతున్నాను.. వాళ్ళని ఆదుకోలేకపోతున్నాను అని చెప్పి వచ్చి ఆవిడ నా దగ్గరకి వచ్చి ఏడ్చినా ఏడుపు ఇంకా నేను మర్చిపోలేను.. అందుకే నాకు ఆవిడని చాల మనస్పూర్తిగా ఆవిడకి ఆమె పాదాలకి నా నమస్కారాలు.. ఎందుకంటే చాల అరుదుగా జీవితంలో తోటి వాళ్ళ కోసం భాద పడే వ్యక్తులు ఉంటారు.. అలంటి అరుదయిన వ్యక్తులలో శ్రీ లక్ష్మీ నరిసింహమ్మ గారు ఒకరు..ఆవిడ ఈ రోజున కనీసం తిండి పెట్టలేని పరిస్థితి నుంచి ఈ రోజునా స్వతంత్రంగా ఒక జీసస్ హోమ్ లాంటి ఒక వృద్ధాశ్రమం కట్టి సొంత బిల్డింగ్ కి తీసుకెళ్లే స్థాయికి ఆమె తీసుకొచ్చారు అంటే ఆవిడ ఎంత తపనపడి ఆవిడ ఎంత భగవంతుడిని ప్రదించిందో ఆమె ఎంత కోలుకుంటే గాని జరగలేదు..అలంటి ఒక అద్భుతమైన విషయం ఈ రోజు జరుగుతుంది..అందరు మనస్పూర్తిగా ఆ కొత్త భావనలోకి మీరందరికి ఆనందం ఆయురారోగ్యాలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ లక్ష్మీ నరిసింహమ్మ గారికి కూడా మీరు నా తల్లి తో సమానం..మీరెప్పుడు సంతోషంగా ఇలానే పదిమందికి సేవ చేయాలనీ కోరుకుంటూ.. దాంట్లో నేను కూడా నా చేతనానిన చేయూత ఉంటదని మనస్పూర్తిగా సెలవు తీసుకుంటూ..అలాగే ఆవిడకి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభిమానులకి గాని ఇంకా చాలామంది పెద్దలందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికి లక్ష్మీ నరిసింహమ్మ గారి తరుపున మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను.. నమేస్తే
జీసెస్ వృద్దాశ్ర‌మం ప్రారంభోత్స‌వం త‌ర్వాత., నిర్వాహ‌కుల‌కి అభినంద‌న‌లు తెలుపుతూ జ‌న‌సేనాని నోటి నుంచి జాలువారిన ప‌లుకులివి..

 

Share This:

About Syamkumar Lebaka

Check Also

JANASENA PARTY guidelines to party activists

1. Address respectfully. Do not engage in personal abuses during the debates, even when provoked. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 1 =

%d bloggers like this: