Home / పోరు బాట / జ‌న‌సేనాని ఉద్దానం ప‌ర్య‌ట‌న ఎందుకంటే..?

జ‌న‌సేనాని ఉద్దానం ప‌ర్య‌ట‌న ఎందుకంటే..?

download15055750_531423480401196_4505078102337100457_n

 

ఉద్దానం.. శ్రీకాకుళం జిల్లా కోన‌సీమ‌గా పేరుగాంచిన ఈ ప్రాంతం పేరు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్‌.. అందుకు కార‌ణం ఆ కోస్తా ప్రాంతంలోని ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త కాదు.. ఆ ప్రాంతాన్ని మ‌హ‌మ్మారిలా ప‌ట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధే ఆ ప్రాంతాన్ని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ గుర్తించేలా చేసింది.. ద‌శాబ‌ద్దాల త‌ర‌బ‌డి ఈ అంతుప‌ట్ట‌ని మూత్ర‌పిండాల రోగం ఉద్దానం ప్రాంత వాసుల ప్రాణాలు తోడేస్తూనే ఉంది.. ఈ వ్యాధితో నిత్యం ఏదో ఒక ఊరిలో ఒక‌రిద్ద‌రు మృత్యువు ఒడికి చేరాల్సిందే.. ఉద్దానంలో ఈ రోగ పీడితుల సంఖ్య కొన్ని ల‌క్ష‌ల్లో ఉంటుంది.. గ‌డ‌చిన రెండు ద‌శాబ్దాల కాలంలో కిడ్నీ సంబంధిత రోగాల భారిన ప‌డి సుమారు 20 వేల మంది ప్రాణాలు విడిచారు.. ఐక్య‌రాజ్య స‌మితి నియంత్ర‌ణ‌లో ఉండే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ను సైతం ఉద్దానం బాధితులు క‌దిలించ‌గ‌లిగారు.. కానీ ఈ ప్రాంతం జ‌నం ఓట్ల‌తో గెలుస్తున్న నాయ‌కుల్ని గాని., ప్ర‌జ‌ల్ని పాలించే ప్ర‌భుత్వాల్ని గాని క‌దిలించ‌లేక పోవ‌డం దృర‌దృష్ట‌క‌రం.. జ‌నం ఎక్క‌డ క‌ష్టంలో ఉంటే తాను అక్క‌డే ఉంటానంటూ., ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి సిద్ద‌మైన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు ఈ మ‌హ‌మ్మారిపై యుద్ధానికి సిద్ధ‌మ‌య్యారు..

pawan-viazag-tour-details

వేల సంఖ్య‌లో ఉన్న ఉద్దానం బాధితుల్ని ఆదుకోవ‌డం ఎలా..? ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటే వీరు బ‌తికి బ‌ట్ట‌గ‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి..? భ‌విష్య‌త్ త‌రాల్నైనా ఈ మ‌హ‌మ్మారి భారి నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు ఏంటి..? అనే అంశాల‌పై పూర్తి అవ‌గాహ‌న కోసం క‌దిలిన జ‌న‌సేనాని., మంగ‌ళ‌వారం బాధితుల్లో కొంత మందిని క‌లుసుకోనున్నారు.. వారి త‌రుపున ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేందుకు సిద్ధ‌మ‌య్యారు..

ఉద్దానం బాధితులు త‌మ స‌మ‌స్యను జ‌న‌సేనాని దృష్టికి తీసుకువెళ్ల‌గా., పార్టీ మీడియా టీమ్‌కు ఈ ప్రాంతానికి పంపి అధ్య‌య‌నం చేయించారు.. భూగ‌ర్భ జ‌లాల్లో మితిమీరి ఉన్న సిలికా., భూమిపొర‌ల్లో ఉన్న లోహాలు ఈ అంతుప‌ట్ట‌ని రోగానికి కార‌ణం అని గుర్తించారు.. మ‌రి వీరిని కాపాడ‌టం ఎలా..? ఇప్ప‌టికే రోగం సోకిన వారు మృత్యువు ఒడికి చేరాల్సిందేనా..? వీరికి కాస్త‌యిన స్వాంత‌న చేకూర్చ‌లేమా..? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి.. ప్ర‌తి ఒక్క‌రికీ ర‌క్షిత మంచినీరు అందించ‌గ‌లిగిన రోజున ఉద్దానం నెఫ్రాల‌జీపై కొంత విజ‌యం సాధించిన‌ట్టే., ఇక ఇప్ప‌టికే వ్యాధి భారిన ప‌డి మృత్యువుతో పోరాడుతున్న వారిని డ‌యాల‌సిస్ ఒక‌టే కొంత కాలం కాపాడ‌గ‌ల‌దు.. అయితే ల‌క్ష‌ల మంది ఇలాంటి వ్యాధి గ్ర‌స్తులు ఉద్దానంలో ఉన్నా., స‌మ‌స్య ద‌శాబ్దాల నాటిదైనా., ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క డ‌యాల‌సిస్ సెంట‌ర్‌ని కూడా పాల‌కులు ఇక్క‌డ స్థాపించ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.. జ‌న‌సేనాని పోరాటంలో ర‌క్షిత‌నీరు., డ‌యాల‌సిస్ సెంట‌ర్లు సాధించ‌గ‌లిగితే., వీరికి గొప్ప ఊర‌ట ల‌భించిన‌ట్టే..

ఇప్ప‌టికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ స‌ర్కారు., హ‌డావుడిగా న‌ష్ట‌నివార‌ణా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టుగా తెలుస్తోంది.. ఆ క్రెడిట్ త‌న‌కు రాకున్నా., ఆ ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రిగితే., త‌న పోరాటంలో విజ‌యం సాధించిన‌ట్టేనని భావిస్తున్నారు.. జ‌న‌సేనాని..

Share This:

1,397 views

About Syamkumar Lebaka

Check Also

దుబాయ్‌లో జ‌న‌సేన త‌రంగం జోరు.. సినీ అతిధులు గెస్ట్‌లుగా అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు..

కోటికి పైగా గ‌డ‌ప‌లకి జ‌న‌సేన పార్టీని తీసుకెళ్లిన జ‌న‌సేన త‌రంగం కార్య‌క్ర‌మం.. అదే ఉత్సాహంతో ముందుకి సాగుతూ ఉంది.. జ‌న‌సేనాని, …

One comment

  1. I want pass,in pawan kalyan garu meeting uttarandhra,from manikyalarao naidu.tatipakala, janasena party active member visakhapathanam, no :9652729345

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 2 =