Home / పోరు బాట / జ‌న‌సేనాని గ‌ర్జ‌న‌కు సిద్ధ‌మైన అనంత వేదిక‌… క‌రువు సీమ‌లో మోహ‌రించిన జ‌న‌సైన్యం.

జ‌న‌సేనాని గ‌ర్జ‌న‌కు సిద్ధ‌మైన అనంత వేదిక‌… క‌రువు సీమ‌లో మోహ‌రించిన జ‌న‌సైన్యం.

img-20161109-wa0002 img-20161109-wa0003

ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు నినాదంతో జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనంత వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన  స‌భ‌కు స‌ర్వం సిద్ధ‌మైంది.. ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో నాగిరెడ్డి ప్రాంగ‌ణం, క‌ల్లూరు సుబ్బారావు వేదిక ముస్తాబైంది.. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చే జ‌న‌సైన్యానికి ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.. ఇప్ప‌టికే జ‌న‌సేన ముఖ్య నేత‌లు వేదిక వ‌ద్ద ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు.. గురువారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు జ‌న‌సేనాని., గ‌ర్జించేందుకు మైక్ సెట్లు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు.. స‌భ కోసం రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి వారం రోజుల క్రిత‌మే కార్య‌క‌ర్త‌లు, ప‌లువురు నేత‌లు అనంత‌కు త‌ర‌లివ‌చ్చారు.. తెలంగాణ జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ఇక్క‌డికి ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌ర‌లిరావ‌డం విశేషం.. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి సుమారుల నాలుగు నుంచి ఐదు ల‌క్ష‌ల మంది అనంత స‌భ‌కు త‌ర‌లివ‌స్తార‌ని అంచ‌నా., ఒక వేళ నాగిరెడ్డి ప్రాంగ‌ణం కిక్కిరిస్తే., ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.. అనంత‌లో అన్ని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.. ఎక్క‌డ నుంచైనా ప‌వ‌న్ ప్ర‌సంగాన్ని తిల‌కించేందుకు వీలు క‌ల్పించారు.. స‌భ‌కు రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి త‌ర‌లివ‌చ్చే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, తిరిగి వెళ్లే వ‌ర‌కు స్వ‌త‌హాగా కూడా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పార్టీ నేత‌లు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌జ‌ల్ని చంపే అభివృద్ది ఎవ‌రికోసం.. సోంపేట బాధితుల త‌రుపున జ‌న‌సేనుడి నిల‌దీత‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర రెండో రోజు ఇచ్చాపురం నుంచి సోంపేట మీదుగా ప‌లాస‌కి చేరుకుంది.. సోంపేట చిత్త‌డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve − 4 =

%d bloggers like this: