Home / జన సేన / జ‌న‌సేనాని జ‌న్మ‌దిన వేడుక‌ల్లో అప‌శృతి.. బాణ‌సంచా పేలి చెయ్యి కోల్పోయిన విద్యార్ధి.. ఆదుకోమంటున్న పార్టీ పెద్ద‌లు..

జ‌న‌సేనాని జ‌న్మ‌దిన వేడుక‌ల్లో అప‌శృతి.. బాణ‌సంచా పేలి చెయ్యి కోల్పోయిన విద్యార్ధి.. ఆదుకోమంటున్న పార్టీ పెద్ద‌లు..

సెప్టెంబ‌ర్ 2, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న్మ‌దిన వేడుక‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జ‌రిగిన విష‌యం తెలిసిందే.. ప్ర‌పంచ వ్యాప్తంగా వేల సంఖ్య‌లో సేవా కార్య‌క్ర‌మాలతో పాటు అభిమానులు సంబ‌రాలు కూడా చేసుకున్నారు.. అయితే ఈ సంబ‌రాల్లో చిన్న‌పాటి అప‌శృతి చోటు చేసుకుంది.. మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గం ఏడిద గ్రామానికి చెందిన విద్యార్ధి, జ‌న‌సైనికుడు భావ‌న వెంక‌టేష్ పార్టీ అధినేత జ‌న్మ‌దినోత్స‌వ సంబ‌రాల్లో భాగంగా బాణసంచా కాలుస్తూ., ప్ర‌మాదవ‌శాత్తు చేతిని కోల్పోయాడు.. చేతిలో బాణ‌సంచా పేల‌డంతో వెంక‌టేష్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.. వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకువెళ్లినా ఉప‌యోగం లేక‌పోయింది.. అత‌ని ఎడ‌మ చెయ్యి తీసివేయాల్సి వ‌చ్చింది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి వీరాభిమాని అయిన వెంక‌టేష్ త‌ల్లిదండ్రులు చిన్న‌త‌నంలోనే చ‌నిపోయారు.. అత‌ను ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ అయిన మేన‌మామ వీర‌బాబు
సంర‌క్ష‌ణ‌లో ఉన్నాడు..

నిరుపేద అయిన ఈ జ‌న‌సేన అభిమాని వెంక‌టేష్ చేతికి ఆప‌రేష‌న్ , చికిత్స ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం.. ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిన వెంట‌నే యంగ్ ఇండియ‌న్ ట్ర‌స్ట్ త‌రుపున 5 వేల ఆర్ధిక సాయం అందించారు.. ఇత‌ని వైద్య ఖ‌ర్చుల నిమిత్తం చాలా మొత్తం అవ‌స‌రం వుంది.. విష‌యం తెలుసుకున్న పార్టీ పెద్ద‌లు., అత‌న్ని ఆదుకోమంటూ పార్టీ శ్రేణుల‌కి విజ్ఞ‌ప్తి చేశారు.. జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి, మీడియా హెడ్ పి.హ‌రిప్ర‌సాద్ స్వ‌యంగా వెంక‌టేష్‌ని ఆదుకోవాలని తెలిపారు..

పార్టీ శ్రేణుల‌కి వెంక‌టేష్ త‌రుపున ప‌వ‌న్‌టుడే కూడా విజ్ఞ‌ప్తి చేస్తోంది.. నిబ‌ద్ద‌త గ‌ల జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ని ఆదుకోవ‌డానికి మీకు తోచిన సాయం చేయండి.. వెంక‌టేష్‌కి సాయం చేయ‌ద‌ల‌చిన వారు.. అత‌ని మేన‌మామ వీర‌బాబుని- 9912939688 నంబ‌ర్‌పై సంప్ర‌దించి నేరుగా సాయం చేయండి.. సాటి జ‌న‌సేన కార్య‌క‌ర్త క‌ష్టాల్లో వున్నాడు ఆదుకోండి..

సాయం చేయ‌ద‌ల‌చిన వారు.. వెంక‌టేష్ మేన‌మామ బి.వీర‌బాబు అకౌంట్‌కి నేరుగా చేయొచ్చు..

బి.వీర‌బాబు,
అకౌంట్ నంబ‌ర్‌-035510027001365
మండ‌పేట ఆంధ్ర‌బ్యాంక్ శాఖ‌..
IFSC CODE: ANDB0000355

Share This:

1,758 views

About Syamkumar Lebaka

Check Also

రామ‌చంద్ర‌పురం జ‌న‌సేనాని పోరాట‌యాత్ర.. ప‌బ్లిక్ మీటింగ్ ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్‌..

పాల‌కుల‌కీ-ప్ర‌జా నాయ‌కుడికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎంత అంటే., అవి రెండు ఎప్ప‌టికీ క‌ల‌వ‌ని రైలు ప‌ట్టాలే.. పాల‌కుల‌కి నిర్ధేశించిన అస‌లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × five =