Home / పాలి 'ట్రిక్స్' / జ‌న‌సేనాని దెబ్బ‌కి దిగివ‌చ్చిన ఏపీ స‌ర్కారు.. ప‌వ‌న్ డిమాండ్ల‌కు సిఎం ఓకే..

జ‌న‌సేనాని దెబ్బ‌కి దిగివ‌చ్చిన ఏపీ స‌ర్కారు.. ప‌వ‌న్ డిమాండ్ల‌కు సిఎం ఓకే..

img-20170103-wa0000

స‌మ‌స్య ఎక్క‌డ ఉంటే అక్క‌డ తానుంటా.. ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు పోరాడుతా.. వెనుక‌గుడు మాత్రం వేసేది లేద‌న్న జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. తాను మాట‌ల మనిషిన‌ని మ‌రోసారి నిరూపించారు.. ఎంత‌టి తీవ్ర‌మైన స‌మ‌స్య అయినా త‌న‌ను చూస్తే ప‌రార‌వ్వాల్సిందేన‌ని ఉద్దానం కిడ్నీ బాధితుల వ్య‌వ‌హారంతో చెప్ప‌క‌నే చెప్పారు.. మూడు రోజుల క్రితం ఉద్దానం ప్రాంతంలో ప‌ర్య‌టించి., బాధితుల్ని ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్‌., వారి స‌మ‌స్య‌లు చూసి చ‌లించారు.. స‌ర్కారు ముందు కొన్ని డిమాండ్ల‌తో డెడ్ లైన్ పెట్టారు.. జ‌న‌సేనాని దెబ్బ‌కి స‌ర్కారు ఆఘ‌మేఘాల మీద దిగివ‌చ్చింది.. ప‌వ‌న్ డెడ్‌లైన్ గ‌డువు ముగిసిన 24 గంట‌ల్లోనే చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది.. మంత్రులు త‌లో మాటా మాట్లాడినా., ముఖ్య‌మంత్రి స్వ‌యంగా స్పందించారు…

babu-caste-ap-politics

రాజాంలో ప‌ర్య‌టించిన ఆయ‌న ఉద్దానం కిడ్నీ బాధితుల‌కి అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.. వ్యాధి ఎందుకు వ‌స్తుందో ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపెట్ట‌లేద‌న్న చంద్ర‌బాబు.. నీటిలో సిలికాన్ వంటి లోహాలు, కొన్ని టాక్సిస్ క‌లిసి ఉండ‌డం వ‌ల్లే వ్యాధికి కార‌ణంగా తెలుస్తోంద‌న్నారు.. ఉద్దానం ప్రాంతంలో కుప్పం త‌ర‌హా మంచినీటి ప్రాజెక్టు ఏర్పాటు చేసి., ఎన్టీఆర్ సుజ‌ల స్ర‌వంతి ప‌థ‌కం కింద రూ.2కి 20 లీట‌ర్ల తాగునీటిని అందిస్తామ‌న్నారు.. ఈ ప్రాజెక్టు కూడా త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని అధికారుల‌కి ఆదేశాలు జారీ చేశారు.. గ్రామీణాభివృద్దిశాఖ క‌మిషన‌ర్‌కి అందుకు సంబంధించిన బాధ్య‌త‌లు అప్ప‌గించారు.. ఉద్దానం స‌మ‌స్య‌పై అధ్య‌య‌నానికి ఓ క‌మిటీని కూడా ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన బాబు., రోగం ఎలా వ‌స్తుందో అధ్య‌య‌నం చేయించేందుకు ప్ర‌పంచంలో అత్యున్న‌త స్థాయి వైద్యుల బృందాన్ని పిలిపించి ప‌రిశోధ‌న‌లు చేయిస్తామ‌న్నారు.. టెక్క‌లి, పాల‌కొండ‌ల్లో ఇప్ప‌టికే డ‌యాల‌సిస్ యూనిట్లు ఏర్పాటు చేశామ‌న్న బాబు., సోంపేట‌, ప‌లాస‌ల్లో కూడా త్వ‌ర‌లోనే ఏర్పాటు చేస్తామ‌న్నారు.. వైద్యం నిమిత్తం కేజీహెచ్‌కి వెళ్లాల‌నుకునే వారికి ఉచిత బ‌స్ పాసులు అందించ‌డం., కండీషన్ సీరియ‌స్‌గా ఉన్న‌వారికి వెయ్యి నుంచి 1500 వ‌ర‌కు ఫించ‌న్లు అందిస్తామ‌ని చెప్పారు.. దీనికి సంబంధించి నివేదిక రూపొందించాల‌ని క‌లెక్ట‌ర్‌కి ఆదేశాలు జారీ చేశారు..

img-20170103-wa0001

ఒక రోజు ఆల‌స్యం అయినా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న రావ‌డంతో., ఉద్దానం బాధితులు జ‌య‌హో జ‌న‌సేనాని అంటున్నారు. ప‌వ‌న్ అడుగుపెట్టిన నాడే త‌మ స‌మ‌స్య‌లు తీరిపోయిన‌ట్టు భావించామంటున్నారు.. త‌మ‌కు అండ‌గా నిలిచిన జ‌న‌సేనానిని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేం అంటున్నారు.. ఇప్ప‌టికే రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారం., ఆక్వా ఫుడ్ పార్క్, ఇప్పుడు ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌లు.. ప‌వ‌న్ ఎక్క‌డ అడుగు పెడితే అక్క‌డి నుంచి స‌మ‌స్య‌లు ప‌లాయ‌నం చిత్త‌గించ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్ర హర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. జ‌న‌సేనాని ప‌ట్ల జ‌నంలో ఉన్న న‌మ్మ‌కం నానాటికీ బ‌ల‌ప‌డుతోంది.. ఆయ‌న‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌న్నీ ప‌ఠాపంచ‌లైపోతున్నాయి.. అదే స‌మ‌యంలో స‌మ‌స్య‌లు కూడా ఆయ‌న వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నాయి..

Share This:

1,851 views

About Syamkumar Lebaka

Check Also

స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీ ఓ స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో ముందుకు వెళ్తుంద‌ని సిబిఐ మాజీ జేడీ, విశాఖ ఎంపి అభ్య‌ర్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 + one =