Home / జన సేన / జ‌న‌సేనాని ప్ర‌జా యాత్ర‌ల భ‌గ్నానికి కుట్ర‌.. దుష్ట శ‌క్తుల దృష్టిపై నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌..

జ‌న‌సేనాని ప్ర‌జా యాత్ర‌ల భ‌గ్నానికి కుట్ర‌.. దుష్ట శ‌క్తుల దృష్టిపై నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌..

జ‌న‌సేన పార్టీ అడుగులు అల‌జ‌డి రేపుతున్నాయా..? జ‌న‌సేనానికి వ‌స్తున్న జ‌నాధ‌ర‌ణ‌ స్వార్ధ‌పూరిత శ‌క్తుల్ని క‌ల‌వ‌ర పెడుతోందా..? పోలీస్ నిఘా వ‌ర్గాల తాజా హెచ్చ‌రిక‌లు అవున‌నే చెబుతున్నాయి.. జ‌న‌సేన పార్టీకి వ‌స్తున్న జ‌నాధ‌ర‌ణ‌ను చూసి భ‌య‌ప‌డుతున్న కొన్ని స్వార్ధ‌పూరిత శ‌క్తులు పార్టీ అధ్య‌క్షుడి ప్ర‌జా యాత్ర‌ల్లో విధ్వంసానికి ప్లాన్ చేసిన‌ట్టు నిఘా వ‌ర్గాలు ప‌సిగ‌ట్టాయి.. షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల‌లో చిత్తూరు, గుంటూరు జిల్లా బాప‌ట్ల‌లో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మంలో తుని త‌ర‌హా రైలు విధ్వంసం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డి, త‌ద్వారా జ‌న‌సేన‌కు అప‌కీర్తి తెచ్చేలా కుట్ర ప‌న్నిన‌ట్టు నిఘా వ‌ర్గాలకు ఉప్పందింది.. ఏకంగా పొరుగు రాష్ట్రాల‌కు చెందిన కిరాయి మూక‌ల‌ను ఈ విధ్వంసానికి స‌ద‌రు స్వార్ధ‌ప‌ర శ‌క్తులు సంప్ర‌దిస్తున్న‌ట్టు నిఘా వ‌ర్గాలు గుర్తించాయి.. ఈ మేర‌కు పార్టీ నేత‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డంతో ఈ రెండు జిల్లాల్లో త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మాల‌ను జ‌న‌సేన పార్టీ వాయిదా వేసింది..
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 21, 22, 23 తేదీల్లో జ‌న‌సేనాని పాల్గొనే ప‌లు కార్య‌క్ర‌మాల‌కు పార్టీ రూప‌క‌ల్ప‌న చేసింది.. అందులో చిత్తూరు జిల్లా శెట్టిప‌ల్లి భూ సేక‌ర‌ణ స‌మ‌స్య, చిత్తూరు ప‌ట్ట‌ణంలో హైరోడ్డు నిర్మాణంలో బాధితుల‌కు జ‌రుగుతున్న అన్యాయం వంటి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను పార్టీ సిద్ధం చేసింది.. శెట్టిప‌ల్లి రైతులుకి జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం సాక్షిగా 23 లోపు ప‌ర్య‌టిస్తాన‌ని, వారి స‌మ‌స్య ప‌రిష్కారానికి త‌న‌వంతు కృషి చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత హామీ ఇచ్చారు..

దీంతో పాటు కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో బంగారు ప‌త‌కం సాధించిన గుంటూరు జిల్లా స్టువ‌ర్టుపురంకి చెందిన వెయిట్ లిఫ్ట‌ర్ వెంక‌ట రాహుల్‌కి 10 ల‌క్ష‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని., ఈ నెల 30వ తేదీన అత‌నికి బాప‌ట్ల‌లో పౌర‌స‌న్మానం చేయాల‌ని నిర్ణ‌యించారు.. రాహుల్ స్వ‌గ్రామం స్టువ‌ర్టుపురం నుంచి ఊరేగింపు, అనంత‌రం స‌న్మానానికి ఇప్ప‌టికే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.. స్థానిక నేత‌లు దాదాపు ఏర్పాటు పూర్తి చేశారు కూడా.. అయితే నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌ల నేప‌ధ్యంలో ప్ర‌జ‌లు, ప్ర‌జ‌ల ఆస్తుల‌కి న‌ష్టం క‌ల‌గ‌కూడ‌ద‌న్న ఉద్దేశ్యంతో ఈ కార్య‌క్ర‌మాల‌ను పార్టీ వాయిదా వేసింది..

నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌ల నేప‌ధ్యంలో ప్ర‌జా యాత్ర‌ల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నా., ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల‌న్న త‌న సంక‌ల్పాన్ని ఎవ‌రూ వ‌మ్ము చేయ‌లేర‌ని జ‌న‌సేనాని ఉద్ఘాటించారు.. పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో., సుధీర్ఘ ప‌ర్య‌ట‌న‌లు జ‌ర‌ప‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.. జిల్లాల్లో ప్ర‌ధాన స‌మ‌స్య‌లు, రాష్ట్ర అభివృద్దిలో టీడీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, ప్ర‌త్యేక హోదా సాధ‌న ధ్యేయంగా జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.. జ‌న‌సేన అధినేత ఆదేశాల నేప‌ధ్యంలో ., రెండు మూడు వారాల్లో ప్రారంభం అయ్యే విధంగా స‌న్నాహాలు కూడా పార్టీ ప్రారంభించేసింది.. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది..

Share This:

1,619 views

About Syamkumar Lebaka

Check Also

అహం బ్రహ్మాస్మి..! (పిట్టల దొరలు అంతే..! పిట్టల దొరలు అంతే..!) అంతేగా..అంతేగా..అంతేగా..

“సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లడం మా భువనేశ్వరితోనే ప్రారంభం అయ్యింది” అంటూ బాబోరు ఉద్ఘాటించారు. అది విన్న ప‌చ్చ మీడియా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − nine =