Home / ఎడిటోరియల్స్ / జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీని న‌డుపుతారా..? ఓట్ల పండుగ‌కు ముందు ప్ర‌త్య‌ర్ధుల నుంచి వెల్లువెత్తిన విమ‌ర్శ‌లు ఇవి.. పోలింగ్ ముగిసిన త‌ర్వాత.. క‌ట్ చేస్తే.. మార్పు కోసం వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అప్పుడే దుకాణం మూసేశారు.. తెలుగుదేశం పార్టీ, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ స్థాయిలో తాయిలాలు ఇస్తున్నాయో తెలియ‌దు గానీ., అమ్ముడు పోయిన పాత్రికేయ విలువ‌లు జ‌న‌సేన మీద బుర‌ద చ‌ల్లడం, కార్య‌క‌ర్త‌ల‌ను నిరుత్సాహ ప‌రిచేందుకు శ‌క్తి వంచ‌న లేకుండా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాయి.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతున్నాన‌ని డిక్లేర్ చేసిన రోజు నుంచి ఇదే తంతు.. చేలిచే చోటు కూడా బ‌లం లేద‌ని చెబుతూ జ‌నాన్ని గంద‌ర‌గోళానికి గురి చేయ‌డం.. మీడియా చేస్తున్న త‌ప్పుల‌ను ఎత్తిచూపిన పాపమో., భారీగా ఎన్నిక‌ల ప్యాకేజీ ముట్ట‌చెప్పిన ప్ర‌త్య‌ర్ధుల మీద క‌నిక‌ర‌మో తెలియ‌దు గానీ., ఒక్క‌టంటే ఒక్క పాజిటివ్ వార్త కూడా మీడియాలో క‌న‌బ‌డిన దాఖ‌లాలు లేద‌న్న సంగ‌తి ప్ర‌జ‌లు చూస్తూనే ఉన్నారు.. ప్ర‌చారం మ‌రో నాలుగు రోజుల్లో ముగియ‌నుండ‌గా., ముఖ్య‌మంత్రి స్థాయి ఉన్న పార్టీ అధినేత వ‌డ‌దెబ్బ‌తో ప‌డిపోతే., ఆ విష‌యాన్ని జ‌నానికి చేర‌వేయ‌డానికి కూడా ఎందుకు భ‌య‌ప‌డ్డారో మీరు జ‌నానికి చెప్పాలి.. వ‌డ‌దెబ్బ త‌గిలిన త‌ర్వాత మ‌రుస‌టి రోజు నుంచే నిత్యం మూడు నుంచి నాలుగు సెలైన్లు ఎక్కించుకుంటూ త‌న‌ను న‌మ్ముకుని బ‌రిలోకి దిగిన అభ్య‌ర్ధుల కోసం, జ‌నం కోసం మండుటెండ‌ల్లో ప్ర‌చారాన్ని కొన‌సాగించారు.. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌కున్నా., ప్రాణాల‌కు తెగించి త‌న బాధ్య‌త నిర్వ‌ర్తించిన జ‌న‌సేనాని.. ఆ త‌ర్వాత ఏమ‌య్యారు..? అన్న‌దే ఇక్క‌డ మీడియా ప్ర‌శ్న‌..

ఏసీలో ఇంద్ర‌భోగాలు వ‌దిలి ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాడిన జ‌న‌సేన అధినేత‌, అదే ప్ర‌జ‌ల కోసం రాజ‌కీయాల్లో మార్పు తెచ్చేందుకు స‌ర్వ‌సుఖాలు వ‌దిలి చ‌మ‌టోడ్చారు.. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన ప‌రిస్థితుల్లో ఓ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకునే హ‌క్కు ఆయ‌న‌కు లేదా..? ఓ అక్ష‌రం రాసే ముందు జ‌న‌సేన అధినేతా మ‌న‌లాంటి మ‌నిషే అన్న భావ‌న ఒక్క‌రికీ ఎందుకు గుర్తుకు రాదు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరు చెప్పి వార్త రాస్తే, మంచ‌యినా చెడ‌యినా రేటింగ్స్ బాగా వ‌స్తాయి.. రేటింగ్స్ కోసం జ‌నం ఛీ కొట్టినా ప‌ర్వాలేదు.. అన్న చందంగా ఉంది కొంద‌రు పాత్రికేయుల ప‌రిస్థితి.. ఆరోగ్య బాగాలేని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఓ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు అని మాత్రం ఒక్క‌రూ రాయ‌రు.. దిగ‌జారుడు మీడియా..

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉండే ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్న నేప‌ధ్యంలో., ప్ర‌ధాన కార్యాల‌యాల‌కు అనుబంధంగా నాలుగు నుంచి ఆరు నెల‌ల లీజుతో మ‌రో రెండు మూడు కార్యాల‌యాలు జ‌న‌సేన పార్టీ తీసుకుంది.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌తో పాటు లీజు గ‌డువు ముగిసిన నేప‌ధ్యంలో స‌ద‌రు బిల్డింగ్ ఓన‌ర్ టూ లెట్ బోర్డు త‌గిలిస్తే., అదేదో జ‌న‌సేన కేంద్ర కార్యాల‌యానికో, రాష్ట్ర కార్యాల‌యానికో పెట్టిన బోర్డులా జ‌న‌సేన జెండా పీకేసింది అంటూ వార్త‌లు.. వార్త రాసే ముందు మీకు ప్ర‌త్య‌ర్ధి పార్టీలు ఇచ్చే డ‌బ్బు మిన‌హా మ‌న‌స్సాక్షి ఏ మాత్రం ప‌ని చేయ‌ద‌న్న విష‌యం జ‌నానికి తెలియ‌దుగా మ‌రి..

ఇక వైసీపీ, టీడీపీల మాదిరి చుట్టూ వంద మంది నాయ‌కుల్ని పెట్టుకుని రాజ‌కీయాలు చేయ‌డం తేలికే.. స‌ర్వం తానే అయ్యి పార్టీ న‌డ‌ప‌డంలో ఉన్న క‌ష్టం ఏంటో జ‌న‌సేన అధినేత‌కు మాత్ర‌మే తెలుసు.. ప్ర‌జ‌లు కూడా కుల‌,మ‌త‌, ప్రాంతాల‌కు అతీతంగా ప‌వ‌న్‌ను త‌మ‌వాడిగా చూసి, ఆయ‌న నిల‌బెట్టిన అభ్య‌ర్ధుల్లోనూ అదే జ‌న‌సేనానిని చూసి ఆయ‌న మీద న‌మ్మ‌కంతోనే ఓటు వేశారు.. చివ‌రి వ‌రుస‌లో ఉన్న కార్య‌క‌ర్త సైతం త‌న క‌ష్టాన్ని నేరుగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు మాత్ర‌మే చెప్పుకోవాల‌ని కోరుకుంటాడు.. అదే స‌మ‌యంలో జ‌న‌సేనాని ఆరోగ్య ప‌రిస్థితి బాగా లేక‌పోవ‌డంతో, ఎన్నిక‌లు అయ్యాక ఆయ‌న కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని ప్ర‌తి అభిమాని కోరుకున్నారు.. ఆయ‌న బ‌య‌టికి రాక‌పోయినా వారికి పెద్ద‌గా ఇబ్బంది లేదు.. అదే స‌మ‌యంలో త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా ఇప్ప‌టికే య‌ధావిధిగా కార్య‌క‌లాపాలు ప్రారంభించేశారు.. అయితే ప‌వ‌న్ లేని స‌మ‌యంలో పార్టీ ఆఫీస్‌కు వ‌చ్చేందుకు ఎవ‌రూ అంత‌గా ఆస‌క్తి చూప‌రు.. ఇక కార్యాల‌యంలో ఉన్న పార్టీ పెద్ద‌లు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో నిమ‌జ్ఞ‌మ‌య్యారు.. త్వ‌ర‌లో పార్టీ అధినేత‌తో జిల్లాల వారీ స‌మీక్ష‌ల‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇదంతా న‌డుస్తుంటే, పార్టీ కార్యాల‌యం కింద భాగంలో కొంద‌రు పాత్రికేయులు ఉద్దేశ‌పూర్వ‌కంగా వీడియోలు తీసుకువెళ్లి కార్యాయ‌లం ఖాళీ అంటూ ప్ర‌చారాలు చేస్తున్నారు..

జ‌నసేన అధినేత ముందే చెప్పారు.. రాజ‌కీయం అంటే ఒక‌రిని ఒక‌రు తిట్టుకుంటూ వార్త‌ల్లో ఉండ‌డం కాదు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం అని.. గెలిచినా గెల‌వ‌కున్నా ప్ర‌జల కోసం పోరాటం చేస్తాన‌ని.. అందుకే సంప్ర‌దాయ రాజ‌కీయ వాదులు ఎన్నిక‌ల త‌ర్వాత కూడా సీట్లు అంచ‌నాలు వేసుకుంటూ, ఒక‌రి మీద ఒక‌రు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు గుప్పించుకుంటుంటే., ఆయ‌న మాత్రం గెలుపు ఓట‌మి అనే అంశాల‌ను ప‌క్క‌న‌పెట్టి య‌ధావిధిగా త‌న ప‌ని తాను చేసుకుంటున్నారు.. గెలిచిన త‌ర్వాత ప్రజ‌ల‌కు ఇచ్చిన హామీల అమ‌లుపై అంత‌ర్గ‌తంగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.. అయితే జ‌న‌సేన‌కు అంత‌ర్గ‌తాలు ఏమీ ఉండ‌కూడ‌దు అన్న చందంగా త‌యార‌య్యింది ఆ కొద్ది మంది మీడియా మిత్రుల ప‌రిస్థితి..

నిత్యం ఏదో ఒక సంచ‌ల‌నంతో వార్త‌ల్లో ఉండ‌డం జ‌న‌సేన రాజ‌కీయ విధానం కాదు.. ఎక్క‌డెక్క‌డ జ‌న‌సేన పార్టీకి ఎన్ని ఓట్లు ప‌డ్డాయ‌న్న అంశం మీద పార్టీ అధినేత‌కు స్ప‌ష్ట‌త ఉంది.. ఇక త్వ‌ర‌లో పంచాయితీ ప‌ర్వం ఉండ‌డంతో, పార్టీ శ్రేణుల్ని చింద‌ర‌వంద‌ర చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఇలాంటి ప్ర‌చారాల‌ను తెర మీదికి తెస్తున్నారు.. అయితే జ‌న‌సేన అధినేత తుపానుకు ముందు ప్ర‌శాంత‌త‌ను క‌న‌బ‌రుస్తున్నార‌న్న విష‌యం తెలిసినా మేక‌పోతుగాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు.. వీరంతా నెల రోజుల త‌ర్వాత రానున్న ఫ‌లితాల ఉప్పెన‌లో కొట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌న్న‌ది విశ్లేష‌కుల వాద‌న‌.. ఈవీఎంల మీద భారీగా న‌మ్మ‌కం పెట్టుకున్న వైసీపీ., క్రాస్ ఓటింగ్‌కు కంగారు ప‌డ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌నం.. సో ఇలాంటి గాలి క‌బుర్ల‌ను గాలికే వ‌దిలేద్దాం..

Share This:

2,497 views

About Syamkumar Lebaka

Check Also

ధర్మవరంలో జనసైనికులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలి-పవన్ డిమాండ్

తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా ఓ సాంఘీక నాటక ప్రదర్శనలో జనసేన పార్టీ జెండాలు ప్రదర్శించినందుకు దుర్గి ఎస్సై గ్రామస్తుల మీద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − seven =