Home / పవన్ టుడే / జ‌న‌సేనాని సిక్కోలు ప‌ర్య‌ట‌న ఖ‌రారు..!

జ‌న‌సేనాని సిక్కోలు ప‌ర్య‌ట‌న ఖ‌రారు..!

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ నెల 6న శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోరుతూ ఇక్క‌డి ప్ర‌జ‌లు జ‌నేనానికి ప‌లు మార్లు విజ్ఞాప‌న‌లు చేశారు.. ముఖ్యంగా ఇచ్ఛాపురం డివిజ‌న్‌లో నీటి కాలుష్యం కార‌ణంగా మూత్ర‌పిండాల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో జ‌నం నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.. ప్ర‌భుత్వాలు మారినా., పాల‌కులు మారినా త‌మ స‌మ‌స్య‌లు మాత్రం ప‌రిష్కారానికి నోచుకోవ‌డం లేద‌న్న‌ది ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆరోప‌ణ‌.. త‌మ రోగాల‌కు వైద్యం చేయించుకునే ప‌రిస్థితి కూడా లేద‌ని., గ‌తంలో జ‌న‌సేన బృందం ఇక్క‌డికి వ‌చ్చిన‌ప్పుడు మొర‌పెట్టుకున్నారు.. ఇక్క‌డ ప్ర‌జ‌ల దుస్థితిని తెలుసుకున్న ప‌వ‌న్‌., వారిని ప‌లుక‌రించాల‌ని., వారి త‌రుపున పోరాడాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. ఈ మేర‌కు ఈ నెల ఆరున ఆయ‌న ఇచ్ఛాపురం వెళ్ల‌నున్నారు.. అక్క‌డ స్థానిక మ‌ణికంఠ థియెట‌ర్‌లో నీటి కాలుష్యం కార‌ణంగా కిడ్నీ సంబంధిత వ్యాదుల‌తో బాధ ప‌డుతున్న రోగుల‌ని ప‌లుక‌రించ‌నున్నారు.. సుమారు మూడు గంట‌ల పాటు వారితో గ‌డ‌ప‌నున్నారు..

ఇక ప్ర‌కాశం జిల్లాలో కూడా ఈ నెల‌లోనే నాలుగో బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని., అది ప‌దో తేదీ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.. అయితే ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి తేదీలు అయితే ఇంకా ఖ‌రారు కాలేదు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌జ‌ల్ని చంపే అభివృద్ది ఎవ‌రికోసం.. సోంపేట బాధితుల త‌రుపున జ‌న‌సేనుడి నిల‌దీత‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర రెండో రోజు ఇచ్చాపురం నుంచి సోంపేట మీదుగా ప‌లాస‌కి చేరుకుంది.. సోంపేట చిత్త‌డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + 15 =

%d bloggers like this: